|

మట్టి మనుషులు

మనిషి జీవన పరిణామక్రమంలో ‘వలస’ ఓ అనివార్యగతి. ఆదిమ కాలంలోని ‘వలస’కి. ఆధునిక కాలంలోని ‘వలస’కీ, లక్ష్యం ఒకటే కానీ. జీవనదిశలో ఫలితాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. ఈ వైరుధ్యాన్ని బి. నర్సింగ్‌రావు 1976లో ‘వాన’ పేరుతో ఓ కథానికగా రాసారు. జనారణ్యంలో, కాంక్రీట్‌ అడవిలో ఓ గ్రామీణ మహిళ పడిన కష్టాల గాధ ఇది.

తెలంగాణా ప్రాంతంలో కరువు బారిన పడే పల్లెలు ఎన్నెన్నో! అలనాటి పల్లెల నుండి నగరానికి పని కోసం వలస వస్తున్న కూలీల స్థితిని చూసి చలించిపోయి నర్సింగ్‌రావు కథరాసేసి, తన గుండె బరువు దింపుకుందా మనుకున్నారు. కానీ తీరా రాసాక, ఆ భారం దిగకపోగా, తనతో పాటే పెరుగుతూ పెరుగుతూ 1990 నాటికి ఓ పూర్తి స్థాయి కథాచిత్రంగా సినిమాగా తీస్తే తప్ప ప్రశాంతత సాధించలేనంతగా ఆయనని అలజడికి గురిచేసింది. ఆ అలజడి లోంచి తెరకెక్కిన చిత్రమ్‌ ` ‘మట్టిమనుషులు’!

వ్యవసాయ-కూలీ-దంపతులు-1కథగా చెప్పాలంటే, కరువుతో ……. ఓ పల్లెలోని వ్యవసాయ కూలీ దంపతులు ` నరసయ్య ` పోచమ్మ. దిక్కులేని స్థితిలో, తమ బిడ్డను తీసుకొని హైదరాబాద్‌ నగరానికి వలస వస్తారు. నిర్మాణంలో ఉన్న ఓ పెద్ద భవనంలో బేల్దారి కూలీలుగా పనికి చేరతారు. కానీ పట్నం తీరు ఏవీ నచ్చని పోచమ్మ తిరిగి తన సొంత ఊరికి వెళ్దామని ప్రయత్నిస్తుంటుంది. కానీ అవేవీ ఫలించకపోవడంతో తమకో సొంత గూడైనా కావాలని భావించి దాని కోసం దళారీ మాటలకు మోసపోయి అప్పుచేస్తుంది. ఇంతలో భర్త నరసయ్య మరో వలస కూలీ గౌరమ్మ మోజులో పడి భార్యబిడ్డలను వదిలేసి లేచిపోతాడు. పల్లెలోని కరువు వల్ల మాత్రమే దిక్కులేనిదానిగా మారిపోయిన పోచమ్మ, నగరంలోని ఈ పరిణామాలతో నిజంగానే ఏ దిక్కూ లేనిదిగా మారిపోయి, దళారీ, వడ్డీ వ్యాపారి, మేస్త్రీల చేతుల్లో

అన్నీ పోగొట్టుకుని మరణిస్తుంది. సినిమా ఇంతటితో అయిపోతుంది. కానీ ఆ తర్వాత పోచమ్మ మరణం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.
ఈ సినిమాకి నరసింగరావు కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వాన్నే కాక, సంగీతాన్ని కూడా అందించి, కాంక్రీట్‌ జంగిల్‌లోని ‘మానవీయం’ అన్న పేరుతో మనిషితనం మాత్రం రోజు రోజుకీ పడిపోతున్న తీరుని, జీవితంలోని కఠోరవాస్తవిక దృశ్యాలతో, తెరకెక్కించాడు. ‘మట్టి మనుషులు’ సినిమా జాతీయస్థాయిలో ‘‘ఉత్తమ తెలుగు సినిమా’’గా 1990లో అవార్డును గెల్చుకుంది.

రాళ్ళు వినిపించే నిశ్శబ్ద సంగీతం ` ఆకృతి
హైదరాబాద్‌ నగరం బిర్యానీ, బ్యాంగిల్స్‌, ముత్యాలకు ప్రసిద్ధి. కానీ వీటన్నింటికన్నా ముందు వేలాది ఏళ్ళ నుండి ఇది శిలలకు, కొండరాళ్ళకు ప్రసిద్ధి. రుతువులకు, కాలమార్పులకు లోనై ఎండకు ఎండి, వానకు తడిసిన, ఈ శిలలు ప్రకృతి శిల్పకారుడి చేతిలో వింత వింత ఆకృతులుగా, వైవిధ్య రూపాలతో అలరారుతున్నాయి. ఈ ప్రాకృతిక సౌందర్యాన్ని ఈ బండరాళ్ళ విలక్షణ అందాలను ఆసరా చేసుకొని నర్సింగరావు రూపొందించిన డాక్యుమెంటరీ ` ‘ఆకృతి’!
‘‘భాష అన్ని భావాలను పలికించగలదు. కానీ భావాలు భాషాతీతమైనవి. వాటి విషయములోల భాష ‘హ్యాండీక్యాపే’ అని సాహిత్యకారులు చెపుతారు. అలాంటి భాషాతీతమైన భావాలను, భావనలను ఎన్నింటినో ఈ డాక్యుమెంటరీలోని శిలలు మౌనంగా వ్యక్తీకరిస్తుంటాయి. మెదడుతో కాకుండా మనసుతోను, అంతర్నేత్రాలతోనూ చూసి అనుభూతి చెందాల్సిన నైరూప్యత సౌందర్యాన్ని మన కళ్ళ ముందు సాక్షాత్కరింపచేయడంలో నర్సింగరావు దృక్కోణం అద్వితీయం.
తెరపై ఓ మిస్టికల్‌ పోయెట్రీని ఆవిష్కరించిన ఈ ‘ఆకృతి’ హరిప్రసాద్‌ చౌరాసియా అందించిన వేణుగానం దృశ్యశ్రవణానం దాన్ని కలిగిస్తుంది. ఈ ‘ఆకృతి’కి దర్శకత్వం`స్క్రీన్‌ప్లేలనే కాక సహసంగీత దర్శకత్వాన్ని నరసింగ్‌రావు వహించడం విశేషం.
11 నిమిషాల నిడివిగల ఈ డాక్యుమెంటరీ జాతీయ స్థాయిలో స్పెషల్‌ జ్యూరీ అవార్డును (1991), ఆంధ్రప్రదేశ్‌ రజత నంది పురస్కారాన్ని (1991) గెల్చుకుంది. ‘సేవ్‌ ది రాక్స్‌ సొసైటీ’ వంటి సంస్థల స్థాపనకు ప్రేరణనిచ్చిన ఈ డాక్యుమెంటరీ, సామాజిక ప్రయోజనాన్ని కూడా సాధించడమే కాక, టెహరాన్‌, జెరూసలెం, మ్యూనిక్‌, బ్రాటిఫ్ల్వావా వంటి ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడిరది.

పిల్లల-మనోవిశ్వంలో-కురిసిన-చిరుజల్లు1పిల్లల మనోవిశ్వంలో కురిసిన చిరుజల్లు ` హరివిల్లు
ప్రపంచవ్యాప్తంగా కళాకారులకు, సృజనకారులందరికీ ఓ మధురమైన అబ్సెషన్‌`బాల్యం! అవధులులేని ఉత్సాహం, కల్మషం లేని ఉత్తేజం, స్వచ్ఛమైన ఉద్వేగం, చిన్న చిన్న పను ల్లోని ఉల్లాసం బాల్యం సొంతం! ‘‘బాల్యమంటే ఆశ్చర్యాల పుట్ట. అను భూతుల నెలవు’’ అని భావించే నర్సింగరావు తన బాల్యాన్ని తన లాంటి ఎంతోమంది బాల్యాలని తెరపై ‘రివిజిట్‌’ చేయించిన సినిమానే ` ‘హరివిల్లు’!
చలం, టాగోర్‌ వంటి సాహితీస్రష్టలు బాల్యంపై రాసిన కథలు, గాథలను చదివి, వాటిలో తన బాల్యాన్ని సందర్శించిన నర్సింగరావు వెండితెరై పరిచిన బాల్యపు అనుభూతుల జల్లు ` ఈ ‘హరివిల్లు’! నయం కాని వ్యాధితో మరణానికి చేరువైన ఓ బాలుని జీవన చిత్రమే ఈ సినిమా. ‘‘జీవితాన్ని హత్తుకునే స్వభావాన్నీ, మనుషులని ప్రేమించే తత్వాన్ని, ప్రకృతిలో ఇమిడిపోయే తన్మయత్వాన్ని ప్రసాదించే బాల్యా’’నికి నర్సింగ్‌రావు ఇచ్చిన కానుక ` ఈ సినిమా.
ఈ సినిమాకు కథ, స్క్రీన్‌్‌ప్లే, దర్శకత్వంతో పాటు సంగీతాన్ని కూడా సమకూర్చి ఈ కథలోని బాలుడి జీవన సంఘర్షణని, సింబాలిక్‌ దృశ్యాలతో, ఈస్థటిక్‌ సన్నివేశాలతో రూపొందించిన తీరుకు, ప్రతి ప్రేక్షకుడూ తన బాల్యంతో ఐడెంటిఫై అవుతాడు.
‘ప్రపంచ సినిమా’లో బాలల చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ని లుస్తున్న సినిమాలు ఇరాన్‌ సినిమాలు. అలాంటి ఇరాన్‌ సిని మాలలోని సెన్సిబిలిటీస్‌ని, మానవ సంబంధాలలోనని గాఢతని, పిల్లలలో ఉండే సహజమైన ఉత్సుకత, ఉద్విగ్నతలని సరళంగా, సుందరంగా ఆవిష్కరించిన ఈ సినిమా బాలల చిత్రాలలో తనదైన ప్రత్యేకతను సాధించి, ‘ది ఛైల్డ్‌ ఇన్‌ అస్‌, స్టిల్‌ ఎలైవ్‌’ అనే మాటలని నిజం చేసింది.

తెలంగాణా సినీవైతాళికుడు
ప్రజా కళాకారుడుగా జీవితాన్ని మొదలెట్టి రంగస్థలం, వీధినాటకాలతో సామాన్య ప్రజలను చైతన్య పరిచే నటుడిగా ఎదిగి, సినీరంగంలలోకి ప్రవేశించి తను చేసిన ప్రతి పనిలోనూ, కళలోనూ తనదైన ప్రత్యేక ముద్రను సొంతం చేసుకున్న మనోకళాకారుడు` నరసింగరావు. ఆయన తీసిన సినిమాలు రాశిపరంగా, సంఖ్యాపరంగా తక్కువే అయినప్పటికీ, ఆ సినిమాలలో ఆయన చిత్రీకరించిన జీవితాల విస్త ృతి మాత్రం అనంతమే అని చెప్పాలి. ఆయన తన సినిమాల్లో కేవలం ఒక వ్యక్తినో, వ్యక్తుల సమూహాన్నో కాక, వ్యవస్థ అనే బిగ్గర్‌ క్యాన్వాస్‌లో వ్యక్తి సంఘర్షణను సామాజిక,ఆర్థిక, రాజకీయ, సాంస్క ృతిక కోణాలలోంచి ఆవిష్కరించారు. అందుకే ఆయన సినిమాలలో ఒక తరం తెలంగాణా జీవితం అంతా ప్రతీకాత్మకంగా, కళాత్మకంగా, వాస్తవికత పునాదులపై దృశ్యమానం అయింది.
‘‘సినిమానీ, జీవితాన్ని వేరువేరుగా చూడటం నాతోకాదు. నాకు సినిమాయే లైఫ్‌… లైఫ్‌ అంటే సినిమానే’’ అని చెప్పే నరసింగరావు ఒక సినిమా తీయడానికి ముందు చేసే ప్రీ ప్రొడక్షన్‌ రీసెర్చ్‌ కొన్ని గ్రంథాలయాలను నింపేంత స్థాయిలో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన సినిమాల్లోని ప్రతీ ఫ్రేమ్‌లో తెలంగాణా గుండె చప్పుడు వినిపిస్తుంది… తెలంగాణా బతుకు చిత్రం దర్శనమిస్తుంది. తెలంగాణా
సంస్క ృతి ప్రవహిస్తుంది… ఆయన నరనరాన, కణకణాన నిండి ఉన్న తెలంగాణా తనమే ఆయనను తెలంగాణా నేపథ్యంగా ఈ అద్భుత కళాఖండాలను సృష్టించేలా చేసింది తెలంగాణ సినిమాను అంతర్జాతీయ వేదికపై సగర్వంగా నిలబెట్టింది. అందుకే నరసింగరావు తెలంగాణా కళాకారుడు మాత్రమే కాదు ‘‘తెలంగాణా సినీ వైతాళికుడు’’ అనడం సత్యదూరం కాదు!
శుభం