|

మహిళల సత్యాగ్రహం.. అరెస్టులు

ఆకుపచ్చని-పొద్దు-పొడువాలే1969 జూన్‌ 19న తెంగాణ సమస్యపై ఏదో ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశం తీసుకునే అవకాశం వున్నందున రెండు రోజు ముందే పిసిసి అధ్యక్షుడైన కాకాని వెంకటరత్నంను వెంటబెట్టుకుని ఢల్లీికి చేరుకున్నారు బ్రహ్మానందరెడ్డి.

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులైన నిజలింగప్పతో, ప్రధానికి సన్నిహితంగా వున్న మరో ముఖ్యనేత కామరాజ్‌తో బ్రహ్మానందరెడ్డి సమావేశమై రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడినట్లు, బంద్‌ సందర్భంగా శాంతి భద్రతకు ఎలాంటి ముప్పు వాట్లికుండా సమర్థవంతంగా అదుపు చేయగలిగినట్లు గొప్పు చెప్పుకున్నారు.

తెంగాణ సమస్యపై కేంద్రనాయకు సహాు తీసుకోవడానికై తాను ఢల్లీి వచ్చినట్లు పత్రిక వారికి చెప్పుకున్న ముఖ్యమంత్రి, ఇందుకు భిన్నంగా తెంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితులో ఇవ్వకూడదని కేంద్రనాయకుకు తానే సహా ఇచ్చారు.

ఒక ప్రక్కన బ్రహ్మానందరెడ్డి నిజలింగప్పతో సుదీర్ఘంగా చర్చిస్తున్న సమయంలోనే రాష్ట్రం నుండి తెంగాణ ఇవ్వవద్దని నిజలింగప్పను కోరుతూ వందలాది టెలిగ్రారు వచ్చినాయి. ఇతర కేంద్ర నాయకుకు కూడా అసంఖ్యాకంగా ఇలాంటి టెలిగ్రాంలే వచ్చాయి. ఈ టెలిగ్రాంలలో ‘‘రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే ప్రతిపాదన అనుచితమ’’ని, ‘‘పార్టీ నాయకత్వంలో మార్పు తెస్తే మొత్తం రాష్ట్రంలోనే కాంగ్రెస్‌పార్టీ నాశనమై పోగద’’ని హెచ్చరించారు. ఈ టెలిగ్రారు బ్రహ్మానందరెడ్డి సృష్టించినవే.

ఒక ప్రక్కన తెంగాణ ఎన్‌.జి.ఓ.ు వారం రోజు నుండి నిరవధికంగా సమ్మె చేస్తుంటే తను సృష్టించిన పోటీ సంఘంతో ‘‘తెంగాణ డిమాండ్‌ను తాము వదిలివేస్తున్న’’ట్లు ప్రకటన చేయించిన ముఖ్యమంత్రి ఢల్లీిలో ‘‘తెంగాణ ఎన్‌.జి.ఓ.ు తమ తెంగాణ కోర్కెను ఇప్పుడు విడిచిపెట్టినార’’ని విలేఖరు తో అన్నారు. ‘‘తెంగాణలో ముల్కీకు కేటాయించిన 2వే ఉద్యోగాలో వెయ్యి ఉద్యోగాు ముల్కీకే ఇచ్చినట్లు’’ చెప్పినారు. తెంగాణకు తానేమి అన్యాయం చేయడంలేదనే అభిప్రాయాన్ని ఢల్లీి మీడియాకు కలిగించే ప్రయత్నం చేసినారు బ్రహ్మానందరెడ్డి. ‘‘పరిస్థితి చక్కబడిన తర్వాత తెంగాణ నాయకునికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి రాజకీయ సర్దుబాట్లు చేస్తామని’’ తెలిపినారు. అంటే ఢల్లీి వర్గాల్లో ‘‘కొంతమంది పదవు కోసమే తెంగాణ ఉద్యమాన్ని లేవదీసార’’నే అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేశారు.

మరో ప్రక్కన ‘‘తెంగాణ ప్రజకు నిరాశ కల్గించడం ప్రమాదకరమని’’ కేంద్రాన్ని చెన్నారెడ్డి హెచ్చరించారు. 19న ఢల్లీిలో జరుగనున్న కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశం ఎజెండాలో తెంగాణ అంశం వున్న దృష్ట్యా ఆయన ఈ ప్రకటన చేశారు. లింగంపల్లిలోని సమితి కార్యాయంలో చెన్నారెడ్డి పత్రిక వారితో మాట్లాడుతూ ‘‘ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది. అటు పార్టీ, ఇటు ఆంధ్ర ప్రభుత్వం తమ స్వంత లోకంలోనే జీవిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
డా॥ చెన్నారెడ్డి ఇచ్చిన పిుపునందుకొని 1969 జూన్‌ 17వ తేదీన తెంగాణ జిల్లాల్లో, జంటనగరాల్లో పెద్ద ఎత్తున మహిళు, నాయకు కుటుంబ సభ్యు సత్యాగ్రహాు చేశారు.

హైదరాబాద్‌ మేయర్‌ కుముద్‌ నాయక్‌ మొదటి సత్యాగ్రహ జట్టుకు నాయకత్వం వహించి ఆబిడ్స్‌లోని నెహ్రూ విగ్రహం వద్దకు వస్తుంటే నిషేధాజ్ఞు ధిక్కరించారనే నెపంతో ఆమెను, సహచర మహిళను అరెస్టు చేశారు పోలీసు. హైదరాబాద్‌ ప్రథమ పౌయి, ఒక మేయర్‌ సత్యాగ్రహం చేయడం, అరెస్టు కావడం దేశ చరిత్రలో ప్రథమం. ఫ్లకార్డు పట్టుకొని ‘జైతెంగాణ’ అని నినదిస్తూ ఆమె వీధుల్లో నడిచింది. మేయర్‌ అరెస్టుకు నిరసనగా అప్పటికప్పుడు రెండు వే మంది కార్పొరేషన్‌ సిబ్బంది, కార్మికు సమ్మెకు దిగినారు. ఉద్యమనేత డా॥ చెన్నారెడ్డి సతీమణి సావిత్రీదేవి ఆధ్వర్యంలో రెండోజట్టు సుల్తాన్‌ బజార్‌లో సత్యాగ్రహం చేసింది. మాజీ ఉపముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి మూడో కూతురు స్నేహతా రెడ్డి మూడో జట్టుకు నాయకత్వం వహించారు. నాల్గో కూతురు సాధన, మనుమరాళ్ళు అనురాధ, అరుణ, కోడు విమ, పెద్దకూతురు సుమిత్రారెడ్డి తదితయి ఈ సత్యాగ్రహ జట్టులో ఉన్నారు. చెన్నారెడ్డి సతీమణితో సహా ఈ మహిళందరినీ పోలీసు అరెస్టు చేసినారు.

సచివాయం వద్ద రిపబ్లికన్‌ పార్టీ కార్యదర్శి, ఎం.ఎల్‌.ఏ ఈశ్వరీ బాయి మరో 25 మంది మహిళు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. పోలీసు వాహనాు రావడంలో జాప్యం జరగడం వన వీరంతా రోడ్డుపై కూర్చోవడంతో ట్రాఫిక్‌ కు అంతరాయం ఏర్పడిరది.మోజంజాహి మార్కెట్‌ వద్ద మాజీమంత్రి సదాక్ష్మి, మాజీ ఎం.ఎల్‌.ఏ, శాంతాబాయి మరికొందరు సత్యాగ్రహం చేశారు.

తెంగాణ ప్రజాసమితి మహిళా విభాగానికి చెందిన క్ష్మీరెడ్డి చార్మినార్‌ క్రాస్‌ రోడ్‌ వద్ద సత్యాగ్రహం జట్టుకు నాయకత్వం వహించారు. సికింద్రాబాద్‌, బొల్లారం, కంటోన్మెంట్‌ తదితర ప్రదేశాల్లో, జిల్లా కేంద్రాల్లో, పట్టణాలో సత్యాగ్రహంలో మహిళు పెద్ద సంఖ్యలో పాల్గొని అరెస్టయినారు.

వ్యానుల్లో మహిళను పోలీసు తీసికెళ్తుంటే ఇంత మంది మహిళు సత్యాగ్రహంలో పాల్గొనడం పట్ల డా॥ చెన్నారెడ్డి, కొండాక్ష్మణ్‌ తదితర నేతు హర్షధ్వానాు చేశారు.

జూన్‌ 17ను ‘తెంగాణ మహిళా దినం’ గా ప్రజాసమితి పరిగణించి వివిధ ప్రాంతాల్లో సత్యాగ్రహాు చేయడానికి వివిధజట్లను ఎంపిక చేసింది.

బంద్‌, సత్యాగ్రహాు శాంతియుతంగా జరిగి జయప్రదం కావడంతో చెన్నారెడ్డి జూన్‌ 19నుంచి తెంగాణ ఉద్యమం తాుకా స్థాయికి విస్తరించాని సంకల్పించారు. సమష్టి సత్యాగ్రహాకు పిుపు నిచ్చారు. ఉద్యమంలో ఇదొక ‘ముపు’గా చెన్నారెడ్డి అభివర్ణించారు. తెంగాణ నేతు వెంకటస్వామి, అంజయ్యు ఢల్లీిలో నిజలింగప్ప, కామరాజ్‌, జగ్జీవన్‌రాంను కలిసి తెంగాణ పరిస్థితిని వివరించారు. గత 6 నొగా తెంగాణలో పోలీసురాజ్యం నెకొన్నదని, శాంతిభద్రతు సన్నగ్లిు తున్నాయని, బ్రహ్మానందరెడ్డిని గద్దె దింపాని, రాష్ట్రపతి పానను విధించాని ఈ నేతు కోరినారు.

మార్క్సిస్టు వ్యతిరేకత:

తెంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ కకత్తాలో జరిగిన మార్క్సిస్టు పార్టీ పోలిట్‌బ్యూరో ప్రకటన చేసింది. ‘‘వేర్పాటు వాదు ప్రారంభించిన ద్వేషించే ఉద్యమాన్ని అరికట్టడానికి గట్టి చర్యు తీసుకోవా’’ని ప్రభుత్వాన్ని కోరింది. ‘‘1947`48 నాటి రజాకార్ల దుష్క ృత్యాను పోలిన విధంగా డా॥ చెన్నారెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తు దోపిడీు, హింసాకాండ, దౌర్జన్యాు సాగిస్తున్నార’’ని ఈ ప్రకటనలో తెలిపారు.

‘‘రక్తం చిందించి సాధించిన విశాలాంధ్రను పరిరక్షించుకోవా’’ని ప్రజకు మార్క్సిస్టు పిుపునిచ్చారు. మరో కమ్యూనిస్టు పార్టీ అయిన సి.పి.ఐ. రాష్ట్ర శాఖ మాత్రం బ్రహ్మానందరెడ్డిని గద్దె దింపాని, వెంటనే రాష్ట్రపతి పానను ఏర్పాటు చేయానే తెంగాణవాదుతో గొంతు కలిపి ఇటు తెంగాణలో, అటు ఆంధ్రలోనూ ధర్నాు, నిరాహారదీక్షు సాగిస్తూ తమపై పడిన ‘‘తెంగాణ ద్రోహు’’నే అపవాదును ఎంతో కొంత తొగించుకునే ప్రయ త్నం చేస్తున్నారు. జూన్‌ 18 నుంచి పికెటింగ్‌ ఉద్యమం జరపా ని సిపిఐ పిుపు నిచ్చింది. ఈ పికెటింగ్‌ ఉద్యమానికి చండ్ర రాజేశ్వరరావు, ఆరుట్ల కమలాదేవి నాయకత్వం వహించారు.

ఢల్లీిలో ఉన్నతస్థాయి చర్చు

ఢల్లీిలోనే మకాం పెట్టిన ముఖ్యమంత్రి జూన్‌ 18న ప్రధాని, దేశీయాంగమంత్రి, లోకసభ స్పీకర్‌గా వున్న నీం సంజీవరెడ్డితో తెంగాణ సమస్యపై చర్చించారు. తెంగాణ రాష్ట్రాన్ని ఏ పరిస్థితిలోనూ ఏర్పాటు చేయవద్దని, కావాంటే సమైక్య రాష్ట్రంలోనే తెంగాణ ప్రయోజనాకు తగిన రక్షణ వుండగదని తెంగాణ ప్రజకు హామీనిచ్చే పథకం గురించి ఆలోచిస్తే మంచిదని పెద్దకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు బ్రహ్మానంద రెడ్డి. ‘‘తనను ఎందుకు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోవసిందిగా కోరరాద’’నే విషయంలో బ్రహ్మానంద రెడ్డి అదనపు కారణాను కూడా ప్రధానికి వివరించారు.
రాష్ట్రంలోని శాసనసభ్యులో మెజారిటీ సభ్యు మద్దతు చూరగొన్న నాయకున్ని రాజీనామా యివ్వమనడం ప్రజాస్వామ్య విరుద్ధమని బ్రహ్మానంద రెడ్డి అన్నారు. కేంద్రం పూర్తి స్వేచ్ఛను యిచ్చిన పక్షంలో సత్వరం సాధారణ పరిస్థితి పునరుద్ధరణకి తనకు ఎట్టి చిక్కుండవని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే వుంటూ అహింసాయుత ఆందోళన లేక రాజ్యాంగ బద్ధమైన పరిష్కార మార్గా పట్ల ఎట్టి గౌరవం లేనివారి అరెస్టు పట్ల వున్న భయసందేహాు తనకు అవరోధంగా వున్నట్లు బ్రహ్మానందరెడ్డి కేంద్ర నాయకుకు వివరించారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి సమావేశం

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశానికి హాజరై తెంగాణపై చర్చించాని చెన్నారెడ్డిని, కొండా క్ష్మణ్‌ను మరికొందరు తెంగాణ కాంగ్రెస్‌ నాయకును కాంగ్రెస్‌ అధ్యక్షు నిజలింగప్ప ఆహ్వానించారు. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గం వైఖరి దృష్ట్యా చర్చు నిరుపయోగమని చెన్నారెడ్డి, కొండాక్ష్మణ్‌ బాపూజీు నిజలింగప్ప ఆహ్వానాన్ని తిరస్కరించారు.
జూన్‌ 19న సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ 2 గంటపాటు తెంగాణ సమస్యపై చర్చించింది. కేవం దామోదరం సంజీవయ్య తప్ప ఏ ఒక్క నేత కూడా బ్రహ్మానందరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ‘‘ప్రత్యేక తెంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశానికే హానికరమ’’ని దాదాపు నేతంతా అభిప్రాయపడగా, ‘‘బ్రహ్మానందరెడ్డి పరిస్థితిని అదుపు చేయడంలో విఫమైనందున రాష్ట్రపతి పానతప్ప మరో ప్రత్యామ్నాయం తనకు కనిపించడం లేద’’ని సంజీవయ్య అన్నారు. మరునాడు జరిగే సమావేశానికి చొక్కారావును, నూక రామచంద్రారెడ్డిని ఆహ్వానించారు.

(సశేషం)
(వచ్చే సంచికలో
చెన్నారెడ్డి, కొండా క్ష్మణ్‌ అరెస్టు `
రాజమండ్రి జైుకు తరలింపు)