|

మార్చి11న అన్ని గ్రామాలలో పాస్‌ పుస్తకాల పంపిణీ

tsmagazineరాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మార్చి 11న ఒసాేరి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరగాలని, దీనికొరకు ప్రతీ గ్రామంలో ఒక నోడల్‌ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, శాసనమండలి ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అందరు ప్రజా ప్రతినిధులను, జిల్లా పరిషత్‌ అధ్యక్షులను, జెడ్పీటీసీ సభ్యులను, మండలాధ్యక్షులను, కలెక్టర్లను, జాయింట్‌ కలెక్టర్లను భాగస్వాములను చేయాలని సీఎం అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని ూడా ఆయన చెప్పారు. ప్రతీ గ్రామానికి ఆ గ్రామ రైతుల పాస్‌ పుస్తకాలు ఒక రోజుముందరగానీ, అదే రోజు ఉదయాన కానీ చేర్చాలని, దీని కొరకు ప్రతీ గ్రామానికి ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు.

ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు పరుస్తున్న పలు కార్యక్రమాల గురించి, ఇటీవలె

పూర్తయిన భూ రికార్డుల ప్రక్షాళన గురించి, పంచాయతీరాజ్‌ ఎన్నికల గురించి, పంచాయతీ నిర్వహించాల్సిన విధుల గురించి, మునిసిపల్‌ చట్టం సవరణ గురించి మాట్లాడారు.

సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు ఈటల రాజేందర్‌, జూపల్లి కృష్ణారావు, నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మారావు, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఎంపీ . శేవరావు, అన్నిజిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, జిల్లాపంచాయతీ అధికారులు, పలువురు ఉన్నతాధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

భూ రికార్డుల ప్రక్షాళనలో 93 శాతం భూమి, 92 శాతం ఖాతాలు వివాద రహితమైనవని తేలింది. ఇక మిగిలింది చాలా తక్కువ మాత్రమే. ఫిబ్రవరి నెల చివరికాల్లా ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్లు, కలెక్టర్లు నిర్వహించే రెవిన్యూకోర్టుల స్థానంలో జిల్లా మొత్తానికి ఒ ఒక రెవిన్యూ కోర్టు వుండాలి. రెవిన్యూ రికార్డుల నిర్వహణలో మార్చి 12నుంచి విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఇంతవరకు ఈ దిశగా జరిగినదంతా స్థిరపడాలి. ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్‌ శాఖ ఉండాల్సిన అవసరం లేదు. మొత్తం రాష్ట్రంలో రోజువారీగా జరిగే రిజిస్ట్రేషన్లు రెండున్నరవేల నుండి నాలుగువేల వరకు ఉంటాయి. ఇందులో 60శాతం పట్టణ ప్రాంతాల్లో, 40 శాతం గ్రామీణ ప్రాంతాల్లో వుంటాయి. ఇక ముందు ఇప్పుడున్న 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అదనంగా 443 మండల కార్యాలయాలు ూడా రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలు చూస్తుంటాయి. మొత్తం 584 మండలాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలుంటాయి. రిజిస్ట్రేషన్‌ తర్వాత మ్యుటేషన్‌కు నెలలకొద్దీ సమయం పట్టాల్సిన అవసరం ఇకముందు వుండదు. కోర్‌ బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. కొనుగోలు దారు, అమ్మకందారు పాస్‌ పుస్తకాల్లో తక్షణమే ఎంట్రీలు, మార్పులు, చేర్పులు జరుగుతాయి. దీనికొరకు ఎక్కువ సామర్థ్యం కల కంప్యూటర్లు, సర్వర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇద్దరికీ పాస్‌బుక్కులు కొరియర్‌ ద్వారా ఇంటి పంపుతాం. ‘ధరణి’ వెబ్‌సైట్‌లో వెంటనే అప్‌డేట్‌ అవుతుంది అని సీఎం చెప్పారు.

‘ధరణి’ వెబ్‌సైట్‌ను ప్రపంచంలో ఏ మూలనుండైనా చూడవచ్చు. భూరికార్డుల ప్రక్షాళన పూర్తయిన నాటినుండి మార్చి 12 వరకు చోటు చేసుకుంటున్న క్రయవిక్రయాల వివరాలు కలెక్టర్లు అప్‌డేట్‌ చేసి ధరణిలో ఎక్కించాలి. మార్చి 12నుండి కోర్‌ బ్యాంకింగ్‌ విధానం మొదలవుతుంది. పహాణీ కాలవ్స్‌ు ూడా తగ్గించాం. పహాణీలో వాడే మురాఠీ పదాలను తీసేసి సరళమైన తెలుగు పదాలను ఉపయోగించుతాం. కలెక్టర్‌ వ్యవస్థ ఇంకా బలోపేతం కావడానికి చర్యలు తీసుకుంటున్నాం అని సీఎం తెలిపారు.

సమావేశం ప్రారంభంలో, భూరికార్డుల ప్రక్షాళనను విజయవంతంగా పూర్తి చేసినందుకు రెవిన్యూ మంత్రిని, రెవిన్యూ కార్యదర్శిని, ప్రక్షాళన కార్యక్రమ ప్రత్యేక అధికారిని, కలెక్టర్లందరినీ, జాయింట్‌ కలెక్టర్లను ముఖ్యమంత్రి . చంద్రశేఖరరావు ప్రత్యేకంగా అభినందించారు. వారికి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి: మనం ఎన్నో పనులుచేస్తుంటాం. కానీ, ఇంత గొప్పగా చేయలేం. చాలా పనులు వాయిదా వేస్తాం కానీ ఇది సాహసంతో చేశాం. దేశమంతా మనల్ని అభినందిస్తున్నది. మనం కొత్త రాష్ట్రమైనా దేశానికి ఆదర్శమయ్యాం. చాలామందికి మనమీద వున్న అనుమానాలు పటాపంచలయ్యాయి. ఈ స్ఫూర్తి ఇలానే కొనసాగాలి. మున్ముందు ూడా పూర్తిగా అవినీతిరహితంగా జరగాలి అని అన్నారు.

పంచాయితీరాజ్‌ గురించి ప్రస్తావించిన సీఎం

”పంచాయితీ ఎన్నికలు తప్పకుండా నిర్వహించాలి. గ్రామ పంచాయితీల ఏర్పాటుకు పంచాయితీ జిల్లా అధికారులు పంపిన ప్రతిపాదనలకు అనుగుణంగా భౌగోళిక హద్దులు ఏర్పాటు చేయాలి. రాజ్యాంగం అదే చెపుతున్నది. న్యాయస్థానాల లిటిగేషన్‌కు తావు ఇవ్వకుండా గ్రామ పంచాయతీలు ఏర్పాటు కావాలి. దీన్ని శాసన ప్రక్రియ ద్వారా చేయబోతున్నాం. ఇప్పుడు 8684 గ్రామపంచాయతీలున్నాయి. మరో నాలుగువేలు ఏర్పాటు కావచ్చు”.

”మనం చాలా విషయాల్లో విజయం సాధించాం. కానీ గ్రామాలను పరిశుభ్రంగా వుంచుకోలేకపోయాం. దీనిమీద ఎన్నో విమర్శలు ూడా వచ్చాయి. ఇది అవసరమా? పనిచేసే పంచాయితీరాజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. దీనికొరకు ఎన్నో రకాల చర్చలు జరిపాం. ఇంకా జరుపుతున్నాం. ప్రత్యక్ష ఎన్నికా? పరోక్ష ఎన్నికా? అని ూడా చర్చిస్తున్నాం. సర్పంచ్‌ను పనిచేసే సర్పంచ్‌గా ఎలా చేయగలగాలి? ఒకప్పుడు జిల్లా కలెక్టరుకు ఎన్నో అధికారాలు వుండేవి పంచాయితీలమీద. ఇప్పుడు నియంత్రణ లేకుండా పోయింది. ఈ నిస్సహాయస్థితి నుండి బయటపడాలి. పంచాయితీరాజ్‌ ఎంతో గొప్పగా రూపొందించబడిన మహత్తరమైన ఉద్యమం. అది ఇప్పుడు అంతరించిపోయింది. ఏ గ్రామానికి పోయినా పెంటకుప్పలుగా వుంటున్నది. గ్రామపంచాయితీకి, ఈ నేపథ్యంలో ఏమేమి పనులు అప్పచెప్పాలో ఆలోచన చేయాలి. ఈ సందర్భంగా మునిసిపల్‌ చట్టానికి ూడా సవరణలు చేద్దామన్న ఆలోచన చేస్తున్నాం”.

అసాధారణమైన పనులు చేసే శక్తియుక్తులు, దేన్నైనా సాధించే పట్టుదల రాష్ట్రానికి వుందని అంటూ ముఖ్యమంత్రి, ప్రభుత్వం చేపట్టి అమలు పరుస్తున్న అనేక కార్యక్రమాల గురించి, సాధించిన విజయాల గురించి కలెక్టర్లకు తెలియజేశారు. ఈ విషయాలను చెప్తూ సీఎం… సమగ్ర కుటుంబ సర్వే ఒక్కరోజులో చేయగలిగాం. విద్యుత్‌ సమస్యను పూర్తిగా అధిగమించి ఇప్పుడు వ్యవసాయానికి ూడా 24 గంటలు కరెంటు ఇవ్వగలుగుతున్నాం. తాగునీటి సమస్యకు అతి తక్కువ కాలంలో పరిష్కారం కనుక్కున్నాం. భూరికార్డుల ప్రక్షాళన విజయవంతంగా వేలం వందరోజుల్లో పూర్తి చేయగలిగాం. దీనికి ప్రజలు వందశాతం తృప్తిగా వున్నారు. ప్రభుత్వమే తమ ముంగిటకు వచ్చి,లంచాలు లేకుండా, తమ భూమికి రక్షణ కల్పించింది అని వారంటున్నారు. గొర్రెల పంపకం విషయంలో చాలా మంది ఎన్నో అనుమానాలు వ్యక్తం చేసినా 35 లక్షల గొర్రెలను పంచాం. వాటికి పుట్టిన పిల్లలతో కలిపి ఇప్పుడు రాష్ట్రంలో అదనంగా 50 లక్షల గొర్రెలున్నాయి”.

”రైతుల కష్టాలు తొలగించడానికి చాలా చర్యలు చేపట్టాం. కల్తీ విత్తనాలు లేకుండా చేసాం. కల్తీ ఎరువులు,పురుగుల మందుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. రైతుకు పంట పెట్టుబడిని ఎకరానికి రూ.8,000 ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. ప్రధానమంత్రి మోదీ మన పథకాన్ని ప్రశంసించారు. రైతులకు మద్దతు ధర విషయంలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం వాటిని గ్రామ,మండల స్థాయిలో ఏర్పాటు చేశాం. రైతులు ఒక సంఘటిత వ్యవస్థగా ప్రస్తుతం లేనందున వారు పండించిన పంట మార్కెట్‌లోకి తేవడానికి, అమ్మడానికి ఈ సమితులు ఎంతగానో

ఉపయోగపడతాయి. సమన్వయ సమితుల ద్వారా పంటల కాలనీల విధానం తీసుకురాగలం. 2600 పైగా ఏఈవోలను నియమించాం. మండల ఏఈవోలకు అగ్రానమిస్టులుగా శిక్షణ ఇస్తున్నాం. ఎక్కువ ఉత్పత్తి సాధించే పంటలు పండిస్తాం. మార్కెట్‌కు పంట వచ్చే ముందర లైసెన్సు కొనుగోలుదారు,లేదా కమిషన్‌ ఏజెంట్‌తో సమన్వయ సమితి సభ్యులు మాట్లాడి ధర నిర్ణయిస్తారు. ఎం.ఎన్‌.పి.రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు.రైతులందరూ ఒరోేజు మార్కెట్‌కు రాకుండా వంతుల చొప్పున రోజుకు కొందరు వచ్చే ఏర్పాటు చేసి, వారు పంటను సులువుగా అమ్ముకొని డబ్బులు తీసుకునే ఏర్పాటు చేస్తారు. 71,75,096 మంది రైతుల ఖాతాదారుల సమస్యలను ప్రభుత్వం సమర్థవంతంగా పట్టించుకుంటాం”.

పంచాయతీరాజ్‌ విషయాన్ని ప్రస్తావిస్తూ ”రాష్ట్రస్థాయి ఆర్థిక కమిషన్‌ను ఏర్పాటు చేశాం. రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 2000 కోట్లనిధులు టాేయిస్తాం. ఫిబ్రవరి నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం పరిశీలిస్తున్నాం. ఎన్నికల విధివిధానా లను శాసనసభలో ప్రవేశపెట్టనున్న బిల్లులో పొందుపరుస్తాం.12 మార్చి నుండి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తాం. చిన్నగ్రామ పంచాయితీకి (500 వరకు జనాభా) రూ. 5 లక్షలు, తర్వాత స్థాయి పంచాయతీకి రూ. 10 లక్షలు అలా స్థాయిని బట్టిరూ.15 లక్షలు, రూ. 20 లక్షలు,రూ. 25లక్షలు ప్రభుత్వం సమూరుస్తుంది. వందశాతం పన్నులు వసూలు చేయిస్తుంది. జాతీయస్థాయి ఆర్థిక సంఘం నిధులు ఉపయోగించుకుంటాం. నరేగా (ఉపాధి హామీ) నిధులతో గ్రామాల్లో ఆస్తులను సమూర్చుకుంటాం. గ్రామానికిఇలా ఇంత పెద్ద మొత్తంలో నిధులు సమూర్చుకుంటాం. దీనికితోడు ఎమ్మెల్యే, ఎంపీ, నిధులు ూడా గ్రామాభివృద్ధికి ఉపయోగించుకుంటాం. మనం పట్టుబడితే పరిశుభ్ర, అభివృద్ధికరమైన గ్రామీణ తెలంగాణను సాధించుకోగలం” అని సీఎం చెప్పారు.

కలెక్టర్ల సమావేశంలో చర్చకొచ్చి నిర్ణయం తీసుకున్న మరికొన్ని అంశాలు- సీఎం సూచనలు

 • షెడ్యూల్డ్‌, ప్లెయిన్‌ ఏరియాల్లో సాదా బైనామాలు ఇంతవరకు దరఖాస్తు చేసుకున్నంతవరకు పూర్తి చేయాలి.
 • ఆరోఎఫ్‌ఆర్‌ ప్రతిపాదనలు జిల్లాలవారీగా ప్రభుత్వానికి పంపిస్తే వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
 • జిల్లాలవారీగా భూ ప్రక్షాళనకు సంబంధించి ఇంమేన్నా సమస్యలుంటే వాటిని ప్రభుత్వానికి పంపాలి.
 • మార్చి 12 తర్వాత సాదా బైనామా దరఖాస్తులు స్వీకరించడం జరుగదు. భూ బదలాయింపులన్నీ రిజిస్ట్రేషన్‌ ద్వారా కానీ, వారసత్వ హక్కుగా మ్యుటేషన్‌కానీ జరగాలి.
 • కొత్తగా సబ్‌ రిజిస్ట్రార్‌ బాధ్యతలు అప్పగిస్తున్న 443 తహశీల్ధారులకు, ప్రస్తుతం పనిచేస్తున్న 141 మంది సబ్‌ రిజిస్ట్రార్‌లకు, రిజిస్ట్రేషన్‌ కొత్త విధానంలో, ఐటీ అప్లిషేన్లలో శిక్షణనివ్వాలి.
 • 12 మార్చి తర్వాత బ్యాంక్‌ రుణాల కొరకు పట్టాదారుపాస్‌ పుస్తకాలు తాకట్టు పెట్టుకోూడదు. ‘ధరణి’ వెబ్‌సైట్‌లో వివరాలు చూసుకోవాలి.
 • భూ సంబంధమైన సమస్యలు చాలా సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇప్పుడు ఆ చిక్కులన్నీ తొలగిపోవాలి. ఈ సమస్యల్లో ప్రధానమైంది అసైన్డ్‌ భూములు. ఈ ప్రక్రియ గతంలో చాలా అశాస్త్రీయంగా జరిగింది. దరిమిలా చాలామంది దగ్గరనుండి ధనవంతులు కొనుగోలు చేశారు. చాలా అవకతవకలు ూడా జరిగాయి. ఈ విషయంలో ఏం చేయాలనే విషయంలో ఒక విధానం రూపొందించాలి. రెవిన్యూశాఖ గైడ్‌లైన్స్‌ రూపొందించాలి. వీటికి అనుగుణంగా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు తమ జిల్లాల్లో పరిశీలించి తగువిధంగా నిర్ణయం తీసుకోవాలి. అసైన్డ్‌ భూముల విషయంలో మానవత్వ కోణంలో ఆలోచించాలి.
 • గ్రామాలు బాగుపడటానికి పంచాయితీ వ్యవస్థ ఎలా వుండాలో అనే దానిమీద కలెక్టర్లు వాళ్ళ సూచనలు, సలహాలు పంచాయితీరాజ్‌ కార్యదర్శికి పంపాలి. సర్పంచ్‌ల నుంచి పని రాబట్టుకోవటానికి ఏం చేయాలనే విషయంపై జిల్లా పంచాయితీ అధికారులు సూచనలు ఇవ్వాలి. అలాగే పంచాయితీలను సరిగ్గా పనిచేయించి సత్ఫలితాలను సాధించడానికి ఏం చేయాలనే విషయమై సూచనలు, సలహాలు ఇవ్వాలి.
 • చాలా జిల్లాలకు 2-4 లక్షల జనాభా మాత్రమే వుంది. ప్రతి జిల్లాలో వున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాల స్థితిగతులు కంప్యూటరైజ్‌ చేయాలి. ఈ వివరాల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌లో టాేయించిన విధంగా నిధులు వృధా కాకుండా ఉపయోగపడాలి.
 • పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు రూపొందిస్తుంది. ఇవి ముఖ్యంగా ఆరోగ్య, వైద్యరంగంలో వుంటాయి.
 • 2020కల్లా తప్పకుండా కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తుంది ప్రభుత్వం. ఈ సంవత్సరం డిసెంబర్‌ చివరి చాలా భాగంకు కాళేశ్వరం నీళ్లు వస్తాయి.
 • గొర్రెల పంపకం పథకం పకడ్బందీగా అమలవు తున్నందుకు కలెక్టర్లను, ఇతర సంబంధిత అధికా రులను సీఎం అభినందించారు.ఇప్పటి 38,28,987 గొర్రెల పంపిణీ జరగ్గా, వీటికి అదనంగా 14,56,376 గొర్రె పిల్లలు పుట్టాయి. మొత్తం ఇంతవరకు 52,79,363 గొర్రెలు అదనంగా రాష్ట్రంలో చేరాయి. ఇది పెద్ద కార్యక్రమం. ఇదొక సంచార బ్యాంక్‌లాంటిది. రాబోయే రోజుల్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మాంసం ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటది. గొర్రెల పెరుగుదలతో పాటు వాటికి అవసరమైన దాణా గడ్డిని ూడా పెంచాలి. జిల్లాల్లో వున్న పండ్ల తోటల వివరాలు సేకరించి అక్కడ గడ్డి పెంచే ఆస్కారం పరిశీలించాలి.
 • స్థానిక తక్షణ అవసరాలకోసం పెద్ద జిల్లాల కలెక్టర్లకు రూ. 1.5 కోట్లు,చిన్న జిల్లాలకు రూ. 1 కోటి టాేయించాలి.