|

ముంబయిలో కె.సి.ఆర్‌. జన్మదిన వేడుకలు

kcr-birthday-celebrationముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17న పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ముంబయిలో ఉన్న ముఖ్యమంత్రికి ప్రధాని నరేంద్ర మోది ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ట్విట్టర్‌లో కూడా కె.సి.ఆర్‌.కు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు.

గవర్నర్‌ నరసింహన్‌, ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉదయాన్నే ఫోన్‌ చేసి కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్‌ సి.హెచ్‌. విద్యాసాగర్‌ రావు దంపతులు కేక్‌ తెప్పించి కెసిఆర్‌తో కట్‌ చేయించారు. ముఖ్యమంత్రి గౌరవార్థం తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందానికి గవర్నర్‌ లంచ్‌ ఏర్పాటు చేశారు. పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ముంబయిలోని ప్రసిద్ద సిద్ధి వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబయిలో కెసిఆర్‌కు మంత్రులు హరీష్‌ రావు, జోగురామన్న, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌ రెడ్డి, వినోద్‌ కుమార్‌, పాటిల్‌, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, నీటిపారుదల శాఖ కార్యదర్శి జోషి, ఇఎన్‌సి మురళీధర్‌, రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డి తదితరులు స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు.