|

మృణాళినికి సుశీలా నారాయణరెడ్డి పురస్కారం

tsmagazineహైదరాబాద్‌ నగరలోని రవీంద్రభారతి ప్రధాన మందిరంలో ప్రముఖ సాంస్కృతిక సంస్థ ‘రసమయి’, శ్రీమతి సుశీల నారాయణరెడ్డి ట్రస్టు సంయుక్తంగా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా జరిపే శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కార మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా డా|| సి. నారాయణరెడ్డి రచించిన లలిత గీతాలను స్వరపరిచి కె. రామాచారి, వారి లిటిల్‌ మ్యూజీషియన్‌ బృందం, ప్రముఖ గాయనీగాయకులు చక్కగా పాడి ప్రేక్షకులను మైమరిపించారు.

అనంతరం జరిగిన శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కార మహోత్సవ సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య పాల్గొన్నారు. సభా ప్రారంభకులుగా న్యూఢిల్లీలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డా|| సముద్రాల వేణుగోపాలాచారి, సభాధ్యక్షులుగా పద్మభూషణ్‌ పురస్కార్‌ గ్రహీత డా|| కె.ఐ. వరప్రసాదరెడ్డి, సినారె ముని మనుమరాలు కుమారి వరేణ్య, గౌరవ అతిథులుగా తెలంగాణ సారస్వత పరిషత్‌ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరు శివారెడ్డి, ప్రముఖ రచయిత్రి ఓల్గా తదితరులు పాల్గొన్నారు. ప్రతిఏటా ఇచ్చే శ్రీమతి సుశీలానారాయణరెడ్డి పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి డా|| సి. మృణాళినికి అందజేశారు. 50వేల రూపాయల నగదు, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.

వద్దిరాజనార్దనరాజవు