|

మెరుగైన వైద్యంతో ఆరోగ్యభాగ్యం

kcrsప్రజలకు మెరుగైన వైద్యం అందించడం తన ప్రధాన కర్తవ్యంగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ బడ్జెట్‌లో వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి పెద్దపీట వేసింది.

సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంవల్ల ప్రైవేటురంగంలో ఆసుపత్రులు పెద్దఎత్తున వచ్చాయి. వైద్యం ఖరీదు అయిపోయింది. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది.

ప్రజారోగ్యాన్ని కాపాడటానికి, ప్రభుత్వ ఆసుపత్రులను బాగుచేసి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడం కోసం ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి తీసుకొనే చర్యలలో భాగంగా ఈసారి బడ్జెట్‌లో రూ. 2282.86 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఈ కేటాయిం పులు రూ. 1277.39 కోట్లుగా ఉండటం గమనార్హం.

  • హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు చెరో రూ. 100 కోట్లు.
  • శ్రీ సుల్తాన్‌బజార్‌, పెట్లబురుజు మెటర్నిటి ఆస్పత్రుల అభివృద్ధికి రూ. 50 కోట్లు
  • శ్రీ నీలోఫర్‌ ఆస్పత్రికి రూ. 30 కోట్లు
  • శ్రీ కింగ్‌కోఠి ఆసుపత్రికి రూ. 25 కోట్లు
  •  రాష్ట్రంలో 42 ఏరియా ఆస్పత్రుల స్థాయి పెంచేందుకు ఒక్కో ఆస్పత్రికి కోటి రూపాయలు.
  • శ్రీ కంటి, మానసిక, ఛాతి, ఇ.ఎన్‌.టి ఆసుపత్రుల అభివృద్ధికి రూ. 40 కోట్లు
  • శ్రీ మెడికల్‌ కళాశాలల భవనాల నిర్మాణానికి రూ. 152 కోట్లు
  • శ్రీ వరంగల్‌లో ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు కూడా ఆర్థికమంత్రి ప్రకటించారు.