|

రూ.83 కోట్లతో పాతబస్తీ అభివృద్ధి

tsmagazine
హైదరాబాద్‌ పాత నగరంలో రూ. 83కోట్ల విలువైన పలు అభివద్ధి పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి. రామారావు ప్రారంభించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, హైదరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు అసదుద్దీన్‌ ఓవైసీ, ఎమ్మెల్యేలు మోజం ఖాన్‌, పాషాఖాద్రీ, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌,tsmagazine
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డా.బి.జనార్ధన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ. 8 కోట్ల వ్యయంతో శాలిబండ సిగ్నల్‌ నుండి మూసాబౌలి జంక్షన్‌, సిటీ కాలేజ్‌ జంక్షన్‌ నుండి పురానాపూల్‌ వరకు నిర్మించే బి.టి రోడ్డు
tsmagazine
రీ-కార్పెటింగ్‌ పనులను మంత్రి కె.టి.ఆర్‌ పురానాపూల్‌ వద్ద ప్రారంభించారు. క్రంబ్‌ రబ్బర్‌ మోడిఫైడ్‌ బిటుమిన్‌ (సి.ఆర్‌.ఎం.బి) సాంకేతిక పరిజ్ఞానంతో 3,070 మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ రోడ్డు వల్ల పాతబస్తీ నుండి ప్రయాణించే వాహనాలు, ప్రయాణికులకు సౌకర్యం అవుతుంది. ఎస్‌.ఆర్‌.డి.పిలో భాగంగా రూ. 69కోట్ల వ్యయంతో నిర్మించనున్న బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను కె.టి.ఆర్‌ ప్రారంభిం చారు. 682 మీటర్ల పొడవు, ఆరు లేన్ల వెడల్పుతో నిర్మించే ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం వల్ల పురానాపూల్‌ నుండి జూపార్కు వెళ్లే మార్గంలో 90శాతం ట్రాఫిక్‌ సులువుగా వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. 2019 వరకు పూర్తయ్యే ఈ ఫ్లైఓవర్‌తో 2034 సంవత్సరం వరకు ట్రాఫిక్‌ సమస్యలు వుండకుండా వుండే విధంగా ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని చేపట్టారు. అనంతరం కిషన్‌బాగ్‌ కుంటలో నూతనంగా నిర్మించిన పార్కును మున్సిపల్‌ శాఖ మంత్రి ప్రారంభిం చారు. రూ. 6.20కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ పార్కు వల్ల పాత బస్తీవాసులకు ఆహ్లాదకరమైన ఉద్యానవనం అందుబాటులోకి వచ్చింది.