| |

కెరటం ఆదర్శం కావాలి!

vikasmశ్రీ డాక్టర్‌ సి. వీరేందర్‌

ఎలాంటి విధానాలు పాటిస్తే రాబోయే ఉద్యోగాల పోటి పరీక్షలో విజయం సాధించవచ్చు? అని రాజేష్‌ ఆదిలాబాద్‌ నుంచి అడిగాడు.

అలాగే, అనేక మంది విద్యార్థులు తమ సమస్యలపై పలు ప్రశ్నలు వేస్తుంటారు. అందులో కొన్ని ”ఫెయిల్యూర్‌ను ఎలా ఎదుర్కోవాలి? మనకున్న బలహీనతలు, బలాలు ఎలా ఉపయోగించుకోవాలి?

‘ఇలాంటివి, ఈ జవాబులో నేను అన్ని ప్రశ్నలకు జవాబు ఇస్తాను. పోటీ పరీక్షలు కాని, మామూలు పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

  • వచ్చిన అపజయాన్ని, తాత్కాలికం అని గుర్తించు.
  • మీ లక్ష్యం వాస్తవానికి దగ్గరగా నిర్ణయించుకోండి.
  • మీ బలాలను గుర్తించండి, దృష్టి వాటి మీద సారించండి.
  • అనుకున్నది సాధించటానికి భిన్నమైన, మీకు సానుూలమైన పద్ధతులను పాటించండి.
  • పడిన ప్రతిసారి లేవాలి. రెటం ఆదర్శం కావాలి.

లక్ష్య నిర్ధారణ

ఉద్యోగాన్వేషణలో లక్ష్యం ఉద్యోగం సాధించడం. అది గ్రూప్‌-1, ఏఈఈ అనేది పరీక్షను బట్టి మారుతుంది. కాబట్టి గ్రూప్‌-2 ఉద్యోగం కోసం మన ప్రయత్నం మొదలయ్యింది. అయిన తర్వాత.. ఇంకా ఏ లక్ష్యం అంటేె.. మన ప్రిపరేషన్‌ లో భాగంగా ఏ విధంగా, ప్రతిరోజు ఎంత చదవాలి అనే విషయం పట్ల వాస్తవిక దృక్పథం అవసరం.

చాలా మంది విద్యార్థులు ఎదుర్కొనే సమస్య ఏమిటంటే ‘నేను రోజు వారి సిలబస్‌ను నిర్ణయించుకున్నాను. కాని అనుకున్న విధంగా చదవడం పూర్తి కావడం లేదు. ప్రతిరోజు కనీసం 20 శాతం మిగిలిపోతోంది. దాంతో తీవ్రమైన నిరాశ జనిస్తోంది. ఇహ నేను ఈ పరీక్షకు ప్రిపరేషన్‌ పూర్తి చేయలేను. నేను అనుకున్నది సాధించలేను’ అనే భావన రోజు రోజుకు పెరిగిపోతుంది. కాబట్టి మీరకు ఒక శాస్త్రీయ పద్ధతిని పాటించాలి. మనకు ఇష్టమున్నంత సిలబస్‌ ను రోజు నిర్ణయించుకోవడం కాకుండా ఒక వారం ‘అబ్జర్‌ వేషన్‌ పీరియడ్‌’గా పెట్టుకోవాలి. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, మనకు ఎంత సిలబస్‌ పూర్తి చేస్తే బావుంటుందో.. అంత ‘ూ్య’ అనే సిలబస్‌ చదవాలి అని నిర్ణయించుకోవాలి.

చదువు మొదలు పెట్టిన తర్వాత ఎంత సేపు పూర్తి స్థాయి ఏకాగ్రత వుంది, ఎన్నిసార్లు చదువు నుండి లేచాను, రోజులో ఎంత సేపు చదువుపై కూర్చున్నాను, ఎన్నిసార్లు స్నేహితులతో మాట్లాడాలని కోరిక కలిగింది, ఎన్నిసార్లు చదువుకుంటే సంతోషం కలిగింది, తొందరగా చదివెయ్యాలి అని మధ్యమధ్యలో వదిలేసి మనకు ఆసక్తి వున్న పదాలతో ఉన్న పేరాగ్రాఫ్‌ లను చదివామా… వారం రోజులు రికార్డు చేసుకోవాలి.

వాటికి అనుగుణంగా మనం మార్కులు వేేసుకొని వాస్తవాన్ని గుర్తించాలి. చదవగలిగే సిలబస్‌ను మాత్రమే ఎంచు కొని చదవడం అవసరం అంతే కాకుండా ముందుగా ప్రామాణికంగా వున్న పుస్తకాలు చదవడం, చదువుకున్నప్పుడు బిట్స్‌ బిట్స్‌గా నోట్‌ రాసుకోవడం, కోచింగ్‌కు వెళ్తె వాళ్ళు ఇచ్చిన మెటీరియల్‌ చదువుతూ, నోట్స్‌లో కొత్త పాయింట్స్‌ రాసుకుంటూ, నోట్స్‌ క్వాలిటీ పెంచుకుంటూ పోవడం, తర్వాత సినాప్సిస్‌ను చదివి నోట్స్‌లో ఉన్న దానితో పోల్చిచూసుకొని, తరువాత తప్పులు చేసినా వాటిని ఎందుకు తప్పుగా ఆన్సర్‌ పెట్టామో తెలుసుకొని అర్థం చేసుకున్న తర్వాత, నిర్ణీత సమయం పెట్టుకొని మనకు మనమే ఒక పరీక్ష పెట్టుకోవాలి. 100 ప్రశ్నలు సాధిస్తే ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకొని, మిగతా ప్రశ్నలు ఎందుకు తప్పు పోయాయో, మన నోట్స్‌ను పరీక్షించుకోవాలి. మళ్ళీ చదవాలి. మళ్ళీ పరీక్ష పెట్టుకోవాలి. కనీసం 80 శాతం సరియైన జవాబులు వస్తే ప్రిపరేషన్‌ సరిగ్గా జరుపుకున్నట్లు, రాబోయే పరీక్షలో విజయం సాధించటానికి కావలసిన ప్రిపరేషన్‌ నిజాయితీతో ూడినదని నమ్మాలి.

మీ బలాలను గుర్తించండి, దృష్టి వాటి మీద సారించండి

విద్యార్థిగా మీ బలాలు ఏమిటో ఒక్కసారి శోధించి గుర్తించండి. ‘నేను ఏ పద్ధతిలో చదవగలను, నేర్చుకోగలను.. వినడం, చదవడం, రాస్తూ చదవడం, చదువుతూ చెప్పడం.. ఇందులో ఏ పద్ధతి అనువుగా వుందో.. ఏ పద్ధతి ద్వారా ఇప్పటి వరకు నేర్చుకోవడం జరుగుతుందో’ గుర్తించి దాని ద్వారా నేర్చుకోవడం మొదలు పెట్టాలి. నేర్చుకోవడంలో నిజాయితీ వుండాలి. సిలబస్‌ పూర్తి చెయ్యాలన్న ధ్యాసలో పూర్థిస్థాయిలో నేర్చుకున్నా, తర్వాత నేర్చుకోవచ్చు లే అనే ధ్యాసతో వాయిదా వేయకుండా చదవడం కొనసాగించాలి. సబ్జెక్టులో ఏది బాగా వస్తుందో గుర్తించాలి. ఇబ్బంది పెడుతున్న అంశాలను నిరంతరం తోటి విద్యార్థులతో చర్చించడం, వీలయితే అధ్యాపకులతో కఠినంగా వున్నవాటిని తిరిగి చెప్పించుకోవడం చెయ్యాలి.

నేర్చుకోవడాన్ని ‘¬ం కమింగ్‌’ అంటారు. ఉదాహరణకు:- ఉదయాన్నే కళాశాలకు ఇంటి నుండి చేరుకున్నావు.. కళాశాల అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరావు. మార్గమధ్యలో రోడ్డు రిపేరు చేస్తున్నారు. ఆ దారి మూసి వేశారు. అప్పుడు ఏం చేస్తాం? వేరే దారి వెతుక్కుంటాం. అది లేదంటే ఇంకో దారి.. ఇలా ఎంతసేపు వెతుక్కుంటాం.. ఇంటికి చేరేంత వరకు.. అప్పుడు కాని హాయిగా వుండదు.. నేర్చుకోవడం అలాంటిదే.. ఒక పద్ధతిలో నేర్చుకోలేక పోయాం.. ఇంకొక పద్ధతి లేదా మరొక పద్ధతి.. ఇలా ఎన్నిసార్లు ప్రయత్నించాలి అంటే.. నేర్చుకునేంత వరకు.. అప్పుడు మనసుకు హాయిగా వుంటుంది. మనం నేర్చుకునే దానిని ఇలా! అర్ధం చేసుకుంటే మనలో ఎంతో నిజాయితీ పెరుగుతుంది. నేర్చుకోవడంలోని సంతోషం అనుభవంలోకి వస్తుంది. మనలో ఏకాగ్రత ఎంత వుంది. తిరిగి గుర్తుకు తెచ్చుకొనే శక్తి ఎంత వుందో బేరీజు వేసుకొని వాటిపై శ్రద్ధ పెడితే అవి ఎన్నోరెట్లు మనకు సహాయం చేసి మనల్ని విజయ తీరాలు చేరుస్తాయి.

అనుకున్నది సాధించటానికి భిన్నమైనా సరే. సానుూల పద్ధతులు పాటించాలి. పోటీ పరీక్షల్లో విజయం సాధించటం అంటె నిరంతరం మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడంపై శ్రద్ధ పెట్టడం.. పరీక్షకు సన్నధ్దం కావటానికి విద్యార్థికి వుండాల్సినవి ఏకాగ్రత, పట్టుదల, నిజాయితితో చదవడం. వీటిని రక్షించుకుంటూ, ఇంకా అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందో ఆ పనులను చెయ్యాలి. అప్పుడు మనం చేసే పని మనకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

అలసిపోకుండా, విసుగు రాకుండా శ్రమించడంలోని మాధుర్యం మనసొంతం అవుతుంది. అప్పుడు అగ్రస్థానంలో నిలబెట్టే నైపుణ్యాలు మన సొంతం అవుతాయి.

పడిన ప్రతిసారి లేవాలి – కెరటం ఆదర్శం కావాలి.. కొత్త పని నేర్చుకుంటున్నప్పుడు, మనం ఎదుగుతున్నప్పుడు తప్పటడుగులు వేయడం, పడిపోవడం సహజం.. వెంటనే లేవడం కూడా అంతే సహజం.. కాబట్టి మనం పరీక్షలు రాసే సమయంలో ఒక్కోసారి తక్కువ మార్కులు వస్తాయి. నిరాశ పడకుండా లేదా నిరాశ పడిన వెంటనే ఎందుకు తక్కువ వచ్చాయో.. ఎక్కడ మార్పుకు అవకాశముందో వెదకాలి. దానిని పట్టుకోవాలి. దానిని మార్చాలి. మళ్ళీ ప్రయత్నించాలి.. చిన్నప్పుడు సైకిల్‌ తొక్కుతున్నప్పుడు ఎలా కిందపడతాం. వెంటనే లేచి మళ్ళీ సైకిల్‌ తొక్కుతాం. దానిపై ఆధిపత్యం వచ్చేంతవరకు నేర్చుకుంటూనే వుంటాం. మనకు ఆ లక్షణం ఉంది. మన చుట్టు పక్కల వాళ్ళ ప్రభావంతో నిరాశకు ఆజ్యం పోయకుండా రక్షించుకుంటూ, మనలో వున్న పట్టుదలను గుర్తించుకుంటూ పని చేస్తే.. ఇలా వచ్చే చిన్న అపజయాలు తాత్కాలికమని గుర్తిస్తూ ప్రయాణం కొనసాగించండి… విజయం మీదే..