|

రైతన్నకు నమస్కారం!

రైతన్నా! నీకు నా రాగ నమస్కారం!
అనవరతం నీకు అనురాగ నమస్కారం! ||రై||
ఎగుడు దిగుడు నేలనంత ఎంతో శ్రమించి
సాగుచేయు నీకు సాష్టాంగ నమస్కారం ||రై||
వర్షము రాగానె మిగుల హర్షముతో
దుక్కిదున్ను నీకు-నాగలికి నమస్కారం ||రై||
మట్టినంత నీటితో మెత్తగాను తడిపి
నారు నాట్లు వేసే చేతులకు నమస్కారం ||రై||
కలుపు మొక్కలను తీసి ఏపుగాను పెంచి
రేబవలూ కాచే రెక్కలకు నమస్కారం! ||రై||
కోత కొచ్చిన పంటను తూర్పారబట్టీ
ఇండ్లకు చేర్చే నీ బండ్లకూ నమస్కారం! ||రై||
దేశానికి అన్నం పెట్టే రైతన్నలకూ
‘వడ్డెపల్లి’ చేయాలి పాద నమస్కారం! ||రై||

-డా|| వడేపల్లి కృష్ణ

tsmagazine