|

వరుణిక కారుణ్యం

tsmagazineఅమ్మ పాలంత స్వచ్ఛమైనవి చిన్న పిల్లల మనసులు. కల్మషం లేని ఆ పసి హృదయాల్లో ఎదుటివారికి చేతనైనంత సహాయం చేయాలన్న ఆలోచనలే ఉంటాయి. పదేళ్ల వరుణిక కూడా అలాంటిదే. ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా, నేనున్నానంటూ ముందుకొచ్చి సహాయం చేసే ఐటి శాఖ మంత్రి కే. తారకరామారావు అంటే వరుణికకు ప్రత్యేక అభిమానం. కేటీఆర్‌ చేస్తున్న మంచి పనుల గురించి మీడియాలో వచ్చే వార్తలను రెగ్యులర్‌ గా చూస్తున్న వరుణిక, తాను కూడా చేతనైనంత సహాయం చేయాలనుకుంది. ఇదే విషయాన్ని తన తండ్రి గడ్డంపల్లి రవీందర్‌ రెడ్డి కి తెలిపింది. తన పుట్టిన రోజు సందర్భంగా తండ్రి గడ్డంపల్లి రవీందర్‌ రెడ్డి ఖర్చు చేయాలనుకున్న లక్ష రూపాయలను పది మంది మంచికి ఉపయోగించాలనుకుంది. ఇదే విషయాన్ని తండ్రి రవీందర్‌ రెడ్డికి చెప్పింది. చిన్న వయసులోనే తన కూతురు పెద్దమనసును అర్థం చేసుకున్న రవీందర్‌రెడ్డి, వరుణికను మనస్ఫూర్తిగా అభినందించారు. వరుణికతో కలిసి మంత్రి కేటీఆర్‌ ను బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిశారు. బేబీ వరుణిక ఈ సందర్భంగా తన తండ్రి ఇచ్చిన లక్ష రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. ఇక నుంచి తన ప్రతీ పుట్టిన రోజు నాడు పది మందికి ఉపయోగపడే పనులు చేస్తానని మంత్రి కేటీఆర్‌ తో వరుణిక చెప్పింది. చిన్న వయసులోనే వరుణిక అలవరుచుకున్న సామాజిక స్పృహను మంత్రి కేటీఆర్‌ ప్రశంసించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతోపాటు ఒక చిన్న మొక్కను ఆమెకి బహుమతిగా అందించారు.