|

విజయ్‌ దేవరకొండ 25 లక్షల విరాళం

tsmagazine
ప్రముఖ చలనచిత్ర కథానాయకుడు విజయ్‌ దేవరకొండ మంత్రి కెటి రామారావును బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిశారు. తనకు లభించిన తొలి ఫిలింఫేర్‌ అవార్డును వేలం వేసి వచ్చిన నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తానని ప్రకటించిన విజయ్‌ దేవరకొండ ఈ మేరకు 25 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాలని మంత్రి కేటీ రామారావును కోరారు. తన కుటుంబ సభ్యులతో మంత్రిని కలిసిన విజయ్‌ ఈమేరకు చెక్కును మంత్రికి అందించారు. 25 లక్షల రూపాయల భారీ విరాళం అందించిన విజయ్‌ దేవరకొండను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఒక మొక్కను అందించిన మంత్రి తెలంగాణ ప్రభుత్వ హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని విజయ్‌ను కోరారు. దీంతోపాటు పురపాలక శాఖ తరఫున చేపట్టిన జలం జీవం కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణం లోనూ పాల్గొని, ఈ అంశం పైన ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని మంత్రి కోరారు. ఈ మేరకు త్వరలోనే జలమండలి అధికారులతో ఒక కార్యక్రమంలో పాల్గొంటానని మంత్రికి విజయ్‌ దేవరకొండ హామీ ఇచ్చారు.