| |

సక్సెస్‌ ‘యంత్రం’

tsmagazine
మనిషి అభివృద్ధికి సాయపడే ఒక అద్భుతమైన ‘యంత్రం’ మనిషి తలలో వుంది. దీనిని ఉపయోగించడం తెలిస్తే మనిషి ఏదైనా సాధించగలడు. అయితే ఆ యంత్రాన్ని మన నిర్ణయం ద్వారా, సంకల్పం ద్వారా కదిలించవచ్చు. తన క్రియేటివిటీ ద్వారా, ఇమాజినేషన్‌ ఉపయోగించి ఈ మిషన్‌ను పనిచేయించడం మొదలు పెట్టవచ్చు. అయితే ఇది నిరంతరంగా పనిచేయాలంటే నిరంతరం శ్రమించడం నేర్చుకోవాలి. అదే ‘సక్సెస్‌’ మిషన్‌

ఆటోమేటిక్‌ సక్సెస్‌ మెకానిజం; మిస్సైల్‌ నిర్మాణం మన శరీరాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నిర్మించబడింది. అందుకే ఒక విజ్ఞానం.. ఇంకొక కొత్త టెక్నాలజీకి అంకురార్పణ చేస్తుంది.. ‘నానో మెటీరియల్స్‌’ స్పేస్‌ గ్రాఫ్ట్స్‌లో

ఉపయోగపడుతుందని ఆవిష్కరిస్తే అది గుండె జబ్బులు నివారించే స్టెంట్‌గా, తేలికగా నడవగలిగే కాలిపర్స్‌గా కూడా అవతరించింది. అదేవిధంగా విజ్ఞాన పరంగానూ అభివృద్ధి చెందిన అది మిగతా రంగాల్లో విపరీతమైన ప్రభావం చూపింది. అలాగే.. కమ్యూనికేషన్‌ వ్యవస్థను నుక్కుంటే.. అది మానవజాతిని, సామాజిక సంబంధాలను 100 అడుగుల ముందుకు తీసుకెళ్తుంది. అలాగే మనిషికి తనలో వున్న సక్సెస్‌ మెకానిజం గురించి కూడా అవగాహన కలిగితే, తన జీవితానికి సంబంధించిన నిర్ణయం అతి శక్తివంతంగా మారుతుందని విశ్వాసం కుదురుతుంది.

(1) మెదడు (2) నాడీ వ్యవస్థ.

(1) ఒక రంగంలో అత్యంత ప్రతిభ కలిగివుంటే దానిని మనం అనుకున్న రంగానికి అన్వయించే ప్రయత్నం చేయడం వలన విజయం ఎప్పుడూ మన వెంట ఉంటుంది. అది ఎలా పని చేస్తుందంటే (1) లక్ష్యాన్ని గుర్తించడం దానిని అందుకోవడంకోసం శ్రమించడం

(2) లక్ష్యం ఏమిటో తెలుసుకోవడం, దానిని నిర్ధారించి దానికోసం శ్రమించడం.. ఈ రెండు పనులు మన మెదడు, నర్వస్‌ సిస్టమ్‌ పనిచేయడం ద్వారా జరుగుతాయి.

ఉదాహరణకు: పుస్తకాల సెల్ఫ్‌లోంచి డిక్షనరీని తీసుకోవాలి. వెంటనే బ్రెయిన్‌ పనిచేయడం మొదలు పెడుతుంది. దానికి కాళ్ళ సహాయం, చేతి సహాయం తీసుకుంటుంది. కళ్లు ఆ పుస్తకాన్ని గమనించగానే, చేతికి సిగ్నల్స్‌ పంపిస్తుంది. వెంటనే చెయ్యి స్పందించి పుస్తకాన్ని అందుకుంటుంది.. ఇదే టెక్నాలజీ మనం మిషన్స్‌లో వాడుతున్నాం. ఒక ‘ఆలోచన’ రాగానే ఎలాగైతే శరరంలో కండరాలు స్పందించడం మనం గుర్తిస్తామో… అది శరీరానికి అతి చిన్న వయస్సునుండే ఫీడ్‌ కాబడుతుంది. అప్పటినుండి ఒక ఆలోచన రాగానే ఆ పని చేయడానికి సిద్ధపడతాము. దీన్నే మనం అనుభవం అంటాము, పని చేయగలడం.. చేయలేక పోవడం… ఈ రెండింటినీ వ్యవస్థలకు అనుసంధానం కాకపోవడమే సోమరితనం అంటాము.

రెండవ పద్ధతి:

లక్ష్యం ఏమిటో తెలుసుకోవడం-దానికోసం శ్రమించ డం; ఒక వస్తువుకోసం వెళ్తాం. కరెంట్‌ పోయింది.. అప్పుడు చేతితో వెతుకుతుంటాం.. రకరకాల వస్తువులను చేతితో తడిమి.. మన బ్రెయిన్‌లోవున్న ఆ వస్తువు తాలూకు ఫీడ్‌బ్యాక్‌ను బేరీజు వేస్తాము… అది మ్యాచ్‌ అయితే.. వెంట నే అదే పని నిర్ధారించుకుని దానిని తీసుకొని బయటకు వస్తాము.. ఇలా కనిపించని దానికోసం శ్రమించడం, దానిని సాధించడం జరుగుతుంది.

కాబట్టి, వస్తువులేకాదు.. జీవితంలోనూ సాధించాల నుకున్న విషయాలకు సంబంధించి కూడా ఈ రకంగానే బ్రెయిన్‌ స్పందిస్తుంది.. మన బ్రెయిన్‌కు అనుకున్నది సహేతుకం అయితే దానిని సాధించాలనే ప్రయత్నం మొదలుపెడుతుంది.

ఏకాగ్రత సాధించడం ఎలా?

చదువుకోవాలనే ఆత్రం, చదువుకుంటేనే జీవితం బాగుంటుందని తెలుసు కానీ చదువుదామని పుస్తకం తీసుకొని కూర్చొని, చదవడం మొదటుపెట్టగానే కొంతమంది బ్రెయిన్‌లో ఎన్నో ఆలోచనలు వడి వడిగా తోసుకొనివచ్చి చదవనీయకుండా, వాటిపట్ల ఆకర్షిం చేటట్టు చేస్తాయి.. కొంత సమయం తర్వాత గాని అర్థంకాదు చదవట్లేదని… దీనినుండి బయటపడ డానికి రకరకాల ప్రయత్నలు చేస్తారు సాధ్యం కావట్లేదు.. ఎందుకిలా అవుతుంది.. అస్సలు ఇది వీరిలో చిన్నప్పటినుండి ఇలానే వుంటుంది. 23 సంవత్సరాలు వచ్చిన తర్వాతగాని అర్థం కాదు, చదువుతుంటే ఇలా అన్ని ఆలోచనలు రావడం అంటే ఏకాగ్రత లేకపోవడం అని.. అస్సలు ఏ ఇతర ఆలోచనలు లేకుండా చదు వుపైననే ఏకాగ్రత నిలపటం సాధ్యపడుతుందని చాలా లేటుగా గుర్తిస్తారు. తమ చుట్టూరా వున్న మిత్రులు గంట, రెండు గంటల్లో వాళ్లు అను కున్నవి చదువగలుగుతున్నారు.. తానెందుకు చదవలేకపోతున్నాను. తమకెందుకు ఎక్కువ సమయం పడుతున్నదని విశ్లేషించుకుంటె అప్పుడు అర్థం అవుతుంది. ఇలా జరగడానికి ప్రధాన కారణం చదవాలనే కోరిక తీవ్రంగా లేకపోవడం. బ్రెయిన్‌కు ఉన్న లక్షణం. ‘పూర్తి కాని విషయాలను తీరిక సమయాల్లో, లేదా విపరీతంగా ఫోకస్‌ చెయ్యాల్సిన సమయాల్లో విషయాలు మన ఏకాగ్రతను తనవైపు తిప్పుకుంటుంది’ వాటిని పూర్తి చెయ్యాలి. దానికి ఒక శాస్త్రీయ పద్ధతిని పాటించాలి. అప్పుడు చిత్తం మొత్తం పుస్తకంపైనే నిలుస్తుంది. లేదా విపరీతమైన వత్తిడిలో వున్నప్పుడు మెదడు మనం అనుకున్న వాటిపై దృష్టి పెట్టడానికి సహకరించదు.. మొరాయిస్తుంది.. ఏవేవో సంఘటనలను, బాధాకరమైన వాటిని పట్టుకొచ్చి పుస్తకం ముందు పోస్తుంది.. లేదా వత్తిడికి కారణాలను అన్వేషించకుండా వాటినుండి ఎలా పారిపోవాలనే ఆలోచిస్తుంది. ఎందుకంటే బ్రెయిన్‌కు ఫైట్‌/ఫ్లైయిట్‌ అనే లక్షణం వుంటుంది. నిలబడి పోరాడనప్పుడు.. పారిపోవడానికి దార్లు వెతుకుతుంది… వేరే ఆలోచనలు రావడానికి ప్రధాన కారణం అదే.. దీంట్లోంచి బయటకు రావడానికి కొన్ని పద్ధతులు:

1) చదువుపై కూర్చున్న తర్వాత ప్రస్తుత లక్ష్యం ఏంటో నిర్ణయించుకోవాలి
2) దానిని ఎలా, ఎంత సమయంలో సాధించాలో నిర్ణయించుకోవాలి
3) సాధించే సమయంలో మనకు రాబోయే అవరోధాలు, వాటిని అధిగమించడానికి కావలసిన పరికరాలు/పద్ధతులు

దేనినైనా నిర్మించడానికి కావలసిన పరికరాలు ఉపయోగిస్తాము. ఉదా: టేబుల్‌కు చెక్క, సుత్తి, మొలలు, రంపం.. అలాగే విజయవంతమైన జీవితాన్ని నిర్మించుకునేప్పుడు, తమకి సాయపడే పరికరాలుంటాయనే విషయాన్ని మర్చిపోకూడదు. దానికి కావలసిన గొప్ప పరికరం ఆలోచించడం, ఆలోచించి దానికి అనుగుణంగా పనిచెయ్యడం.

మనం నేర్చుకోవడానికి సిద్ధంగా వుంటే ప్రతీ అనుభవం ఒక పాఠాన్ని నేర్పుతుంది. ‘సామర్థ్యం అనేది ఒక మానసిక స్థితి. మనం ఎంత చెయ్యగలం అనేది, మనం ఎంత చెయ్యగలమని అనుకోవడంమీద ఆధారపడి వుంటుంది. నిజంగా మీరు ఎక్కువ పని చెయ్యగలనని అనుకుంటే మీ మనసు అందుకు అనుగుణంగా ఆలోచించి మీకు మార్గాలను చూపెడుతుంది. ఆ మార్గాలని అన్వేషించి తెలుసుకున్న తర్వాత వాటిని అనుసరించాలంటె, దానికి సరిపోయే నైపుణ్యా లున్నాయా, లేదా! తెలుసుకొని, లేకుంటే ఆ నైపుణ్యాలు నేర్చుకొని, అనుకున్న పనిని సాధించేందుకు ప్రయాణం సాగించాలి. అప్పుడు విజయంవైపు వెళ్తాం.

రోజూ ఎప్పుడు చదవాలి, ఎంతసేపు చదవాలి?

ఎప్పుడు చదవాలి, ఎంత చదవాలి, ఏ సమయంలో చదివితే ఎంతగా గుర్తుంటుంది అనేది చాలా మందికి అవగాహన తక్కువ. నిజానికి ప్రత్యేక సమయాలలో చదివితే బాగా గుర్తుంటుంది అనేది సమయంతో ముడిపెట్టలేము. కానీ మనకు ఏకాగ్రత ఎప్పుడు ఎక్కువగా వుంటే అప్పుడు మాత్రం ఎక్కువ చదవగలం, ఎక్కువ రోజులు గుర్తుండేట్టుగా దానిని అర్థం చేసుకోగలం. ప్రపంచంలో మనుషులు పుట్టుకతోనే మూడురకాల లక్షణాలతో వేర్వేరుగా ఉంటారు. (1) డే మేకర్‌ (2) నైట్‌ మేకర్‌ (3) ఎనీ టైమ్‌ మేకర్‌

1. డే మేకర్‌:

వీరు ప్రొద్దున ఎప్పుడంటే అప్పుడు పెందలకడనే లేవగలుగుతారు, ఆ సమయంలో ఎక్కువ ఏకాగ్రతతో వుంటారు, ప్రొద్దున్నే లేని చదువును చక్కగా మొదలు పెట్టగలుగుతారు. చదివింది కూడా అర్థం చేసుకోగలు గుతారు. మంచి మూడ్‌తో వుంటారు. కానీ, రాత్రిపూట చాలా తొందరగా నిద్రపోతారు. గాఢ నిద్రను కలిగి వుంటారు. రాత్రిపూట అస్సలు చదవలేరు. తొందరగా నిద్రకు రెడీ అవుతారు. ఇంట్లో అందరిచే తిట్లు తింటారు. ఎక్కువ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఉదయం సమయాన్ని సరిగ్గా వాడుకుంటే విజయం వీరిదే.

నైట్‌ మేకర్‌

వీరు రాత్రి అవుతున్నకొద్దీ చాలా యాక్టివ్‌గా మారు తారు, రాత్రి 9 తర్వాతగాని పుస్తకాలు ముట్టరు, కొందరైతే అందరూ పడుకున్న తర్వాత చదువు మొదలు పెడతారు. చాలా ఎక్కువ ఏకాగ్రత 11 తర్వాత దొరుకుతుంది. కానీ రాత్రిపూట చదివితే అస్సలు గుర్తుండదని.. అనవసరంగా నిద్రను వేస్ట్‌ చేసుకుంటున్నారని విమర్శ.. చదవకుండా వూరికే టైమ్‌పాస్‌ చేస్తున్నారని, తాము పడుకున్న తర్వాత ఏం చేస్తున్నాడో.. అనే విమర్శను భరించి చదువును రాత్రిపూటనే కొనసాగించడం అవసరం. అది వీరికి మేలు చేస్తుంది. కానీ ప్రొద్దున అస్సలు లేవలేరు. ఎంత గింజుకున్నా ప్రొద్దున లేవడం కష్టం.

ఎనీ టైమ్‌ మేకర్‌

వీరు ఎప్పుడైనా సరే అవకాశాన్నిబట్టి నిద్రను, చదువును ప్లాన్‌ చేసుకోవాలి.. తల్లిదండ్రులు పట్టుపడితే ప్రొద్దున్నే చదువుకు ప్లాన్‌ చేసుకోవడం అవసరం. వీరికి వారి నిర్ణయం ప్రకారం ఏకాగ్రత కుదురుతుంది. వీరికున్న నిద్ర అలవాటునుపట్టి వీరుచదువును ప్లాన్‌ చేసుకొని దాని ప్రకారం చదువును కొనసాగిస్తే విజయం వీరిదే!

డా|| వీరేందర్‌