|

సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు

సమస్యలకు-ఆత్మహత్యలే-పరిష్కారం-కాదు‘సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఇప్పుడున్న రైతుల కష్టాలు రేపుండవు, ధైర్యంగా ఉండండి, మీకు సర్కారు అండగా ఉన్నది. ఇక మీదట ఏ ఒక్క రైతు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడవద్దని చేతులు జోడించి వేడుకుంటున్న’ అని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతు ఆత్మహత్యకు ప్పాడితే వారి భార్యా, పిల్లలు, కుటుంబ పరిస్థితి ఏమిటని, వాళ్లు రోడున పడరా? అని అప్పు బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఉద్దేశించి అన్నారు. జూలై 22న మెదక్‌ జిల్లా గజ్వేల్‌లోని టీవైఆర్‌ గార్డెన్‌లో జరిగిన సమావేశంలో హరీశ్‌ మాట్లాడారు. రైతుకుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా కలుసుకుని సమస్యలు అడిగి జిల్లా అధికారులతో అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించారు. ప్రభుత్వం నుంచి ఒక్కొక్క కుటుంబానికి పరిహారంగా లక్ష రూపాయల చెక్కును 12 మందికి అందజేశారు. మరో 50వేల రూపాయలను అప్పు కింద జమచేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత బాధిత కుటుంబాలతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు.

గజ్వేల్‌ నియోజక వర్గంలోని ఆరు మండలాల నుంచి వచ్చిన రైతు కుటుంబ సభ్యులను, వితంతు, వృద్దాప్య పింఛన్‌ అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి 35 కిలోల రేషన్‌ బియ్యం, ఇళ్ళు లేనివారికి ఐఏవై పథకం కింద ఇల్లు, స్త్రీ నిధి కింద రెండు బర్రెలు, వ్యవసాయం చేస్తున్న వారికి ఉచితంగా విత్తనాలు, ఎరువు మంజూరు చేశారు. ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో చదువుకుంటున్న ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబాల పిల్లల ఫీజు మాఫీ చేయిస్తామని, గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చుదువుకుంటున్న పిల్లలను, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చేర్పిస్తామని, తక్షణమే యాజమాన్యాలతో మాట్లాడాలని కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జాను ఆదేశించారు.

బోరుబావున్న వారికి స్ప్రింక్లర్లు అందిస్తామని, ఇంటర్‌ పూర్తి చేసిన ఇద్దరు యువకులకు కానిస్టేబుల్‌ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అప్పు బాధలతో తల్లిదండ్రులను కోల్పోయి రోడ్డున పడ్డామని జగదేవ్‌పూర్‌ మండం చేబర్తికి చెందిన భాస్కర్‌, భానుచందర్‌, విజయక్ష్మి మంత్రి ఎదుట కన్నీళ్లు పెట్టుకోవడంతో 10వేల రూపాయలు వ్యక్తిగతంగా అందజేశారు.