|

సాక్షర భారత్‌ అవార్డు సాధించిన అంకిరెడ్డిగూడెం

saakshar-bharatతెంగాణ రాష్ట్రానికి జాతీయస్థాయిలో మరో గౌరవం దక్కింది. అక్షరాస్యత సాధనలో మన గ్రామాు ముందున్నాయి. వందశాతం అక్షరాస్యత సాధించినందుకు గాను న్లగొండజిల్లా చౌటుప్పల్‌ మండంలోని అంకిరెడ్డిగూడెం గ్రామానికి జాతీయ స్థాయిలో సాక్షరభారత్‌ అవార్డు భించింది. బంగారుతెంగాణ సాధనలో తెంగాణ మరో ముందడుగు వేసింది. జాతీయస్థాయిలో 2015 సంవత్సరానికి గాను సంపూర్ణ అక్షరాస్యత సాధించినందుకు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సెప్టెంబరు 9న అంకిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్‌ మల్లేష్‌గౌడ్‌ ఢల్లీిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుమీదుగా ఈ అవార్డు అందుకున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లా నుంచి ప్రతిపాదను వెళ్ళగా ముంబై నుంచి ప్రోఫెసర్‌ ప్రభాకర్‌ చవాన్‌ నేతృత్వంలోని బృందం అంకిరెడ్డిగూడెం గ్రామాన్ని పరిశీలించి కేంద్రానికి సిఫారసు చేసింది. దీనితో ఆ గ్రామానికి ఈ అరుదైన గౌరవం దక్కింది.