|

సీఎం ఆకస్మిక తనిఖీ

tsmagazineహైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌ లో నిర్మాణంలో ఉన్న పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. 7 ఎకరాల విస్తీర్ణంలో 20 అంతస్తులు, 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణం పనులు అనుకున్నంత వేగంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరిత గతిన నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సీఎం కోరారు. కేవలం శాంతి భద్రతల పర్యవేక్షణకే కాకుండావిపత్తుల నిర్వహణ, పండుగలు- జాతరల నిర్వహణ తదితర కార్యక్రమాలను కూడా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షించవచ్చని సీఎం అన్నారు. దేశంలో మొదటి సారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటూ ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తుందని సీఎం చెప్పారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, ఆర్‌ అండ్‌ బి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఆరోగ్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, డిజిపి మహేందర్‌ రెడ్డి తదితరులున్నారు.