సైబర్‌ సెక్యూరిటీ పరిశోధనకు అనువైనది హైదరాబాద్‌

ktrసైబర్‌ సెక్యూరిటీలో పరిశోధనకు హైదరాబాద్‌ సరైన కేంద్రమని, ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. జూలై 31న ఎన్‌ఐఐటి చైర్మన్‌ రాజేంద్ర సింగ్‌ పవార్‌తో హైదరాబాద్‌లో సమావేశమైన మంత్రి కెటిఆర్‌ వివిధ అంశాలపై చర్చ జరిపారు.

ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్‌ విద్యను అందించేందుకు ముందుకు రావాని, ఇప్పటికే సైబర్‌ సెక్యూరిటీ రంగంలో పరిశోధను చేసేందుకు అమెరికాకు చెందిన ప్రసిద్ధ కార్నెగీమెలన్‌ యూనివర్సిటీతో చర్చించామని నిట్‌ చైర్మన్‌కు తెలిపారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో సైబర్‌ సెక్యూరిటీ సబ్జెక్టుతో ప్రత్యేక కోర్సు ప్రారంభించే యోచన చేస్తున్నదని, సైబర్‌ సెక్యూరిటీ రంగంలో సీఎస్‌ రావు అకాడమీతో ఎంవోయూ కుదుర్చుకున్న విషయాన్ని మంత్రి వివరించారు.

మాస్టర్‌ కార్డ్స్‌ కంపెనీ, ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలో టాటా గ్రూప్‌ ఏర్పాటు చేయనున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రిసెర్చ్‌ సెంటర్‌ు సైబర్‌ సెక్యూరిటీ పరిశోధనకు ప్రోత్సాహం ఇస్తున్నాయన్నారు. టీ హబ్‌ ద్వారా కేవలం అకడమిక్స్‌లోనే కాకుండా పరిశోధనకు కూడా అవకాశం ఇస్తామన్నారు.

హైదరాబాద్‌లో అన్ని సౌకర్యాలున్నందున సైబర్‌ సెక్యూరిటీ రంగంలో పరిశోధనకు కేంద్రంగా ఎంచుకోవాని కోరారు. ఈ విభాగంలో కీలక పాత్ర వహించే సైబర్‌ వారియర్స్‌ తయారీలో ప్రైవేటు కంపెనీలు సైతం ముందుకు వచ్చాయని కెటిఆర్‌ తెలిపారు.

కాగా, నాస్కామ్‌ సైబర్‌ సెక్యూరిటీ టాస్క్‌ ఫోర్స్‌కు సారథ్యం వహిస్తున్న నిట్‌ చైర్మన్‌ పవార్‌ సైబర్‌ సెక్యూరిటీ విషయంలో తెలంగాణ ప్రభుత్వ చొరవను అభినందించారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంతో సైబర్‌ సెక్యూరిటీ సహా ఇతర రంగాల్లో తమ భాగస్వామ్యాన్ని ప్రకటిస్తామని పవార్‌ హామీ ఇచ్చారు.

అభివృద్ధే ధ్యేయంగా నగరాల మధ్య పోటీ

సాంకేతిక రంగం అభివృద్ధికి తెంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. హైదరాబాద్‌లో టెక్‌వేవ్‌ సంస్థ విస్తరణ కేంద్రాన్ని ఆగస్టు 1వ తేదీన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందాంటే డాటా అనలిటిక్స్‌ పార్కు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, దీనికి తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు ఉంటుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అడ్వాన్స్‌డ్‌ టెక్నాజీతో దేశవ్యాప్తంగా విస్తృత సమాచారాన్ని సేకరించేందుకు డాటా అనలిటిక్స్‌ అవరసమన్నారు . డాటా అనలిటిక్స్‌ పార్కు ఏర్పాటు అనుమతి కోరుతూ ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఈఎస్‌సీఐ) బోర్డుకు ప్రతిపాదన పంపామన్నారు.

భారీస్థాయి ఐటీ పరిశ్రమను ప్రోత్సహిస్తూనే, చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీకు ప్రభుత్వం అన్ని అవకాశాు కల్పిస్తుందన్నారు. ఇందుకుగాను కొండాపూర్‌లో ఎస్‌ఎంఈ టవర్‌ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. గతంలో దేశాల మధ్య పోటీ ఉండేదని, ఇప్పుడు నగరాల మధ్య అభివృద్ధే ధ్యేయంగా పోటీ నెకొందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌, బెంగుళూరు, షాంఘై, హాంకాంగ్‌ నగరా మధ్య పోటీ ఉందన్నారు. ఐటీ పరిశ్రమను సమర్థవంతంగా నడుపుతున్న నిర్వాహకులను ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్‌ అభినందించారు.