హరీష్‌ రావు జాతీయ రికార్డు

tsmagazine
రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికల్లో మంత్రి హరీష్‌ రావు సిద్ధిపేట నియోజక వర్గం నుండి 1లక్షా 18వేల 699 ఓట్ల మెజారీటీ సాధించి దేశంలోనే రికార్డు నెలకొల్పారు. ఆయన ఆరు సార్లు సిద్ధిపేట నియోజక వర్గం నుండి ఎంపిక కాగా ప్రతిసారి తన మెజారిటీని పెంచుకుంటూ ఈ ఎన్నికల్లో ఏకంగా లక్షపైగా మెజారిటీతో సిద్ధిపేట పేరును జాతీయ స్థాయిలో మారుమ్రోగించారు. ఎన్నికలు ప్రకటించినప్పటినుండి కూడా హరీష్‌ రావు తాను లక్షపైగా మెజారిటీ సాధించాలనే పట్టుదలతో నియోజక వర్గంలో విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు తాను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. చివరకు హరీష్‌ రావు కృషి ఫలించి సిద్ధిపేట ఓటర్లు లక్షపైన మెజారిటీ ఇచ్చి ఆయన కోరికను నెరవేర్చారు. పిన్న వయస్సులో ఆరు సార్లు శాసన సభ్యునిగా ఎన్నిక కావడం కూడా ఈయన సాధించిన ఒక రికార్డు.

ఇక ఈ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు యాభైవేలకు పైగా మెజారిటీ సాధించారు. వారి వివరాలు..
tsmagazine