10 రోజులు 17 కంపనేలు..

ఇది శుభారంభం.

ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టుమని పదిరోజుకే 17 కంపెనీకు అనుమతి పత్రాను అందజేసి రికార్డు సృష్టించింది. నూతన పారిశ్రామిక విధానంలో అనుమతు ప్రక్రియ వేగవంతంగా జరగటం పట్ల పరారిశ్రామిక వర్గాు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.

పరిశ్రమకు సంబంధించిన పక్కా సమాచారంతో దరఖాస్తు సమర్పిస్తే నిర్ణీత గడువుకంటే ముందుగానే అనుమతు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. అనుమతుల్లో ప్రభుత్వం చూపుతున్న వేగాన్ని పారిశ్రామికవేత్తు అందుకోవాన్నారు. జూన్‌ 23న సచివాయంలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో టి.ఎస్‌.ఐపాస్‌ విధానం క్రింద 17 కొత్త పరిశ్రమకు అనుమతు మంజూరు పత్రాను అందజేశారు. తెంగాణ పారిశ్రామిక పురోగతి సాధించే స్వర్ణ యుగానికి ఈ రోజు నాంది పలికామని ముఖ్యమంత్రి చెప్పారు.

పెట్టుబడుకు స్వర్గధామంగా తెంగాణను మార్చేవిధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించామని సి.ఎం చెప్పారు. యువతకు ఉపాధి కల్పించడం, రాష్ట్రాన్ని అన్నివిధా అభివృద్ధి పరచేందుకు అవసరమైన ఆర్ధిక పరిపుష్టి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కొత్త పారిశ్రామిక విధానానికి అనుగుణంగా పరిశ్రమ స్థాపనకు ముందుకువస్తున్న పారిశ్రామిక వేత్తను ముఖ్యమంత్రి అభినందించారు. పరిశ్రమకు కావల్సిన భూమి, నీరు, విద్యుత్‌ వంటి మౌలిక వసతు కల్పిస్తూ అనుమతు సరళతరం చేశామని, అనుమతు పొందినవారు వెంటనే పరిశ్రమ పనును ప్రారంభించాని కె.సి.ఆర్‌ కోరారు.

అనుమతు పొందిన ఈ పరిశ్రమ ద్వారా 1500 కోట్ల రూపాయ పెట్టుబడు, 4000 మందికి ఉపాధి అవకాశాు భిస్తాయి.

అనుమతు పొందిన పరిశ్రమలో మెదక్‌ జిల్లాలో ఐ.టి.సి ఆహార శుధ్ధి, ప్రీమియర్‌ వోల్టాయిక్‌ విద్యుదుత్పాదన, పయనీర్‌ టార్‌ స్టీల్‌, సోలిత్రో ఔషధ పరిశ్రమ, కోవీలెట్‌ ఔషధ పరిశ్రము ఉన్నాయి. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో భావన సౌరవిద్యుత్‌, ఉషాస్‌ వెంచర్‌, వ్యాూలాబ్‌ సౌరవిద్యుత్‌, హెచ్‌.ఐ.ఎల్‌ ప్లాస్టిక్‌ పరిశ్రమ, డూరాలిన్‌ టెలీకాం, స్నేహ కోళ్ళపరిశ్రమ ఉన్నాయి. న్లగొండ జిల్లాలో దొడ్ల డెయిరీ, జనీ పోర్ట్‌ ల్యాండ్‌ సిమెంట్‌, రంగారెడ్డి జిల్లాలో నూజెన్‌ పొగాకు, ఈపిఆర్‌ ఔషధపరిశ్రమ, ఐజెంట్‌ ఔషధపరిశ్రమ, నిజామాబాద్‌ జిల్లాలో ఎమ్మెసెన్‌ ఔషధపరిశ్రమ ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రు జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస రెడ్డి, కె.తారక రామారావు, తుమ్మ నాగేశ్వర రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, పరిశ్రమ కార్యదర్శి అరవింద కుమార్‌, పరిశ్రమ కమీషనర్‌ మాణిక్‌ రాజ్‌, టి.ఎస్‌ఐఐసి ఎండి నరసింహారెడ్డి, జి.హెచ్‌.ఎం.సి కమీషనర్‌ సోమేష్‌ కుమార్‌ తదితయి పాల్గ్గొన్నారు.

అనంతరం, పరిశ్రమ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రాష్ట్రానికి అనేక జాతీయ, అంతర్జాతీయ పరిశ్రము రాబోతున్నాయని, ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు. టిఎస్‌ ఐపాస్‌ విధానం మన దేశంలోనేగాక అంతర్జాతీయంగా కూడా ప్రశంసు అందుకుంటోందన్నారు.