‘యాదగిరి’ క్షేత్రానికి రూ. 100 కోట్లు

yadagiriguttaతిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 400 ఎకరాలలో నృసింహ అభయారణ్యం పేరుతో పార్కులను అభివృద్ధి చేయనున్నారు. 1600 ఎకరాల విస్తీర్ణంలో కల్యాణ మంటపాలు, ధ్యాన మందిరాలు, వేదపాఠశాలలు, కాటేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గుడిగోపురాన్ని స్వర్ణగోపురంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాదగిరిగుట్ట సమగ్రాభివృద్ధికి ఈ బడ్జెట్‌లో రూ. 100 కోట్లు ప్రతిపాదించారు.

ఇందుకోసం ఈ బడ్జెట్‌లో రూ. 50 కోట్లు ప్రతిపాదించారు.

  • శ్రీ వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 100 కోట్లు, రైతు బడుల కోసం రూ. 10 కోట్లు, క్రాప్‌ కాలనీల అభివృద్ధికి రూ. 20 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
  • శ్రీ రైతులకు పెట్టుబడుల వ్యయం తగ్గించేందుకు, సౌకర్యంగా ఉండి ఉత్పత్తి పెరిగేందుకు కమతాల ఏకీకరణ చేపట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
  • శ్రీ గ్రీన్‌హౌజ్‌ కల్టివేషన్‌ రైతులకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ చుట్టుప్రక్కల దాదాపు వెయ్యి ఎకరాలలో పైలట్‌ ప్రాజెక్టుగా గ్రీన్‌హౌజ్‌ కల్టివేషన్‌ ప్రారంభించనున్నారు. గ్రీన్‌హౌజ్‌ల ఏర్పాటు కోసం 75 శాతం సబ్సిడీగా అందిస్తారు. ఇందుకోసం ఈ బడ్జెట్‌లో రూ. 250 కోట్లు ప్రతిపాదించారు.
  • శ్రీ సూక్ష్మ సేద్యానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటుకు ఎస్‌.సి., ఎస్‌.టిలకు వందశాతం, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను ఈ బడ్జెట్‌లో రూ. 250 కోట్లు ప్రతిపాదించారు.
  • శ్రీ కోళ్ళ పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పిస్తూ, కోళ్ళ పరిశ్రమను నిర్వహించేవారిని కూడా ప్రభుత్వం రైతులుగానే గుర్తిస్తోంది. వీరికి కూడా విద్యుత్‌ సబ్సిడీ అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ బడ్జెట్‌లో రూ. 20 కోట్లు ప్రతిపాదించారు.
  • శ్రీ డిమాండ్‌కు తగినంతగా మన రాష్ట్రంలో పాల ఉత్పత్తి జరగడంలేదు. ఈ విషయంలో రైతులను ప్రోత్సహించేందుకు, పాల ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన చర్యలకోసం ఈ బడ్జెట్‌లో రూ. 16.30 కోట్లు ప్రతిపాదించారు