|

21 దేశాలలో బతుకమ్మ

 

 

 

 

 

 

గచ్చిబౌలి లోని గ్లోబల్‌ పీస్‌ ఆడిటోరియంలో తెలంగాణ భాషా సాంస్క తిక శాఖ, బ్రహ్మకుమారీలు సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ సంబురాలలో భాగంగా ‘గ్లోబల్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌’ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్‌.కె. జోషి, పర్యాటక, సాంస్కతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బ్రహ్మకుమారీలతో కలిసి ప్రారంభించారు. బతుకమ్మ సంబురాల విశ్వ వ్యాప్తికి బ్రహ్మ కుమారీలు చేస్తున్న కషిని అభినందించారు. బతుకమ్మ వేడుకలకు వివిధ దేశాల నుంచి వచ్చిన బ్రహ్మ కుమారీ లు నిర్వహించిన కళా ప్రదర్శనలు అద్భుతంగా

 

 

 

 

 

 

 

 

 

ఉన్నాయన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్‌.కె. జోషి.సాంస్కతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, బతుకమ్మ సంబురాలను విశ్వవ్యాప్తం చేసే కార్యక్రమములో భాగంగా గత ఏడాది 15 దేశాల నుంచి, ఈ సంవత్సరం 21 దేశాలలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ బతుకు చిత్రం మార్చే పండుగ బతుకమ్మ అన్నారు. తెలంగాణకు పరిమితమైన బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడానికి ప్రభుత్వం బ్రహ్మ కుమారీలతో కలసి అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. వివిధ దేశాల నుండి వచ్చిన బ్రహ్మకుమారీలు, బతుకమ్మ సంబురాలలో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్క తిక కార్యక్రమాల ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నాయి.

రవీంద్ర భారతిలో
రవీంద్రభారతి లో తెలంగాణ భాషా సాంస్క తిక శాఖ, బ్రహ్మకుమారీలు సంయుక్తంగా ‘గ్లోబల్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌’ పేరుతో నిర్వహించిన బతుకమ్మ సంబురాలను పర్యాటక, సాంస్కతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం బ్రహ్మ కుమారీలతో కలిసి ప్రారంభించారు. బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. బతుకమ్మ వేడుకలలో భాగంగా 25 దేశాల నుంచి 75 మంది విదేశీ మహిళలు బతుకమ్మ అడి పాడారు. వివిధ దేశాల నుండి వచ్చిన బ్రహ్మకుమారీలు బతుకమ్మ సంబరాలలో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కతిక కార్యక్రమాల ప్రదర్శన అందరిని అకుట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాంస్క తిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ, జస్టీస్‌ అమర నాథ్‌ గౌడ్‌, సంతోష్‌ దిదిలతో పాటు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు.