విజయ మెగా డెయిరీకి భూమిపూజ

రాష్ట్రంలో పాడిపంటలకు మరింత ప్రోత్సాహం

చిన్న సన్నకారు రైతాంగానికి, పాడి పరిశ్రమకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర పాడి పరిశ్రమ, సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని రావిర్యాల గ్రామంలో 32 ఎకరాల విస్తీర్ణంలో 246 కోట్ల వ్యయంతో తెలంగాణ విజయ డెయిరీ ఆధ్వర్యంలో అత్యాధునిక మెగా డైరీ ప్రాజెక్ట్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ,  తెలంగాణ రాష్ట్రంలో సహకార రంగానికి సంబంధించి పాడి పైన ఆధార పడే సన్నకారు, చిన్నకారు రైతాంగానికి చేయూత నివ్వాలనే సంకల్పంతో విజయ డెయిరీ ప్రారంభమైనదని తెలిపారు.  

2014  తెలంగాణ రాష్ట్రం రాకముందు విజయ డెయిరీ మూతపడే పరిస్థితి ఏర్పడిరదని అన్నారు. అప్పట్లో ఒకలక్ష లీటర్ల పాలు సేకరించేవారని,  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత  ముఖ్యమంత్రి  కె.సి.ఆర్‌  నాయకత్వంలో రైతాంగాన్ని ప్రోత్సహించి ఆర్థికంగా తోడ్పాటునందించడంతో, నేడు  దేశంలో ఫ్రైవేట్‌ పోటీ రంగంలో విజయ డెయిరీ మొదటి స్థానంలోఉందన్నారు.  2014లో 300 కోట్ల రూపాయల టర్నోవర్‌ ఉండేదని నేడు అది 750 కోట్ల రూపాయలతో విజయపథంలో ముందుకు వెళుతోందన్నారు. నాలుగున్నర లక్షల లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతోందని అన్నారు. విజయ మెగా డెయిరీ ప్రాజెక్టును రెండు సంవత్సరాలలో పూర్తి చేయాలనే లక్ష్యం ఉండగా ఒకటిన్నర సంవత్సరంలో పూర్తి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆలోచన అని అన్నారు. 8లక్షల లీటర్లవరకు ఈ ప్రాంతంలో కొత్త టెక్నాలజీ ఉత్పత్తులను నిర్వహిస్తున్నామని, విజయ డెయిరీ ఉత్పత్తులు 28 వరకు ఉన్నాయని, మన రాష్ట్రంలో నే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, ఢల్లీి, ముంబయిలో డిమాండ్‌ ఉన్నాయని తెలిపారు. ఒకవైపున సన్నకారు చిన్నకారు రైతులను ప్రోత్సహిస్తూ,  అదేవిధంగా వేలాది మంది యువతీ యువకులకు ఉపాధి  కల్పిస్తున్నామని మంత్రి తలసాని అన్నారు.సీజన్‌ ఉన్న లేకున్నా ప్రభుత్వ రంగంలో 365 రోజులు పాలను సేకరిస్తున్నామని, ఫ్రైవేట్‌ రంగంలో 365 రోజులు పాల సేకరణ చేయరని అన్నారు. పాడి రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పిస్తోందని అన్నారు.

రైతులను ఆదుకునేందుకు సబ్సిడీపై పాడి పశువులు, ఉచితంగా నట్టల మందు,ఇతర  మందులు ఇవ్వడం జరుగుతోంది. మెడికల్‌ క్యాంపులను ప్రభుత్వం నిర్వ హిస్తోందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతాంగానికి ఉచితంగా 24 గంటల కరెంటు కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఆయన అన్నారు. రైతు బంధు రైతు, బీమా వంటి పథకాలను ప్రభుత్వం కల్పి స్తోందన్నారు. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2000 విజయ అవుట్‌ లెట్లు ఉన్నాయని, 600 పార్లర్లు వీటిని ఇంకా పెంపొందించు కుంటూ ముందుకు వెళుతున్నామని ఆయన అన్నారు. 2లక్షల 13వేల మంది రైతులు సహకార సంఘంలో ఉన్నారన్నారు. చనిపోయిన గేదెల స్థానంలో ఇన్సూరెన్స్‌ ద్వారా గేదెలను అందజేస్తామని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని అన్నారు.  కుల వృత్తులను ప్రభుత్వం చేయూతనిస్తుందని అన్నారు. విజయ డైరీకి సంబంధించిన 14 రకాల ఉత్పత్తులను మంత్రి మార్కెట్‌లోకి విడుదల చేశారు. 

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచే భాగంగా పాడి పంటలు రెండు బాగుండాలని సంకల్పంతో విజయ మెగా డెయిరీ శంకు స్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలని, గొల్ల కురుమల ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశ్యంతో గొర్రెలను ఇవ్వడం జరుగు తోందన్నారు. 11వేల కోట్ల రూపాయలుతో గొర్రెలను ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఇంతకు ముందు చేపలు కావాలంటే ఈస్ట్‌ గోదావరి నుంచి తీసుకు రావాల్సి వచ్చేదని, ఇప్పుడు మన చెరువులు, కుంటలలో తెలంగాణలో ఎక్కడకు వెళ్లినా చేపలు దొరుకుతున్నాయని అన్నారు. వృత్తి ఏదైనా ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కొత్తగా పాడి పరిశ్రమ పెట్టుకునే వారికి సబ్సిడీ కింద పాడి రుణాలను ఇస్తే  బాగుంటుందని అన్నారు.  మన వ్యవస్థని మనం కాపాడు కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయ డెయిరీని బలోపేతం చేసుకొని దానిపైన వచ్చిన లాభాలు రైతులకు వస్తాయని తెలిపారు.  ప్రతి పాడి రైతు విజయ డెయిరీకి పాలు ఇచ్చే విధంగా రైతులను ప్రోత్సహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఇగ్గె మల్లేశం, సురభి వాణి దేవి, జిల్లా చైర్పర్సన్‌ తీగల అనిత రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, అడిషనల్‌ డైరక్టర్‌ రాంచందర్‌, టీఎ స్‌ఎస్‌ ఎల్డిఏ సీఈఓ మంజువాణి,  జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, మత్స్య శాఖ కమిషనర్‌ లచ్చిరాం, తుక్కుగూడ మున్సిపల్‌ ఛైర్మన్‌ మధుమోహన్‌, వైస్‌ ఛైర్మన్‌ వెంకన్న, విజయ డైరీ ఛైర్మన్‌ లోక భూమారెడ్డి, విజయ డైరీ ఎండి శ్రీనివాస్‌ రావు, సహకార సంఘాల సభ్యులు, రైతులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.