మహిళల చేతికి క్యాబ్‌ స్టీరింగ్‌

  • ‘షీ క్యాబ్స్‌’ అందించిన మంత్రి హరీశ్‌ రావు

By: పి. విజయలక్ష్మి

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నరు అనడానికి నిదర్శనంగా సంగారెడ్డి జిల్లా మహిళలు స్టీరింగ్‌ పట్టుకుని క్యాబ్స్‌ నడపడానికి సిద్ధమయ్యారు. ఎస్సీ కార్పొరేషన్‌ సబ్సిడీ, కెనరా బ్యాంక్‌ ఆర్థిక సహకా రంతో జిల్లాలో 18 మంది మహిళలకు ‘‘షీ క్యాబ్స్‌’’వాహనాలను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు అందించారు.

రాష్ట్రంలోనే తొలిసారిగా సంగారెడ్డి జిల్లాలో షీ క్యాబ్స్‌ పథకాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని మహిళలకు నెల రోజుల పాటు డ్రైవింగ్‌ లో శిక్షణనిచ్చి, 80 శాతం సబ్సిడీతో షీ క్యాబ్స్‌ వాహనాలు అందించారు. ఈ పథకానికి 25 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా, 25 మందికి డ్రైవింగ్‌ లో శిక్షణ ఇచ్చి లైసెన్స్‌లు  ఇచ్చారు. అందులో క్యాబ్స్‌ నడపడానికి ఆసక్తి కనబరిచిన 18 మందికి  జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌ రావు షీ క్యాబ్స్‌ను ప్రారం భించి 18 మంది మహిళా లబ్ధిదారులకు ప్రొసీడిరగ్స్‌, వాహన తాళాలు అందించారు. ఊబర్‌ క్యాబ్స్‌ మహిళలకు ధైర్యం కల్పించేందుకుగాను రూ.10 వేలు ఇన్సెంటివ్‌ ప్రకటించింది. అదేవిధంగా మహిళా డ్రైవర్ల రక్షణకు షేర్‌ ఇట్‌ యాప్స్‌లో జిపిఎస్‌ విధానం, మొబైల్‌ ఫోన్‌, పెప్పర్‌, గొడుగు లాంటి వసతులను ఏర్పాటు చేసింది. ఊబర్‌ క్యాబ్స్‌ యాజమాన్యం ప్రయాణికుల వివరాలు, చార్జీల వివరాలు తెలిపే ఏర్పాట్లు చేశారు.

కార్లు పొందిన మహిళలకు ఆసక్తి ఉంటే పరిశ్రమల యాజ మాన్యాలతో మాట్లాడి జిల్లాలోని పరిశ్రమల్లో పనిచేసే అధికారులు ప్రయాణించేందుకు షీ క్యాబ్స్‌ వాహ నాలను నెలవారి అద్దె ప్రాతిపదికన వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తా మని మంత్రి తెలిపారు. ప్రతి నెల మహిళలకు ఫిక్సిడ్‌గా డబ్బు అందు తుందని దాంతో వారికి లాభదా యకంగా ఉంటుందన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ 90 శాతం సబ్సిడీతో సంక్షేమ పథకాలు అందిస్తుండగా, మరికొన్నింటికి వంద శాతం సబ్సిడీ ఇస్తుందని, మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మంత్రి సూచించారు.మహిళలు ధైర్యంగా కారు నడిపి అభివృద్ధి సాధిస్తే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబనతో కుటుంబాలకు బాసటగా నిలవాలని ఆకాంక్షించారు.

షీ క్యాబ్స్‌ ప్రారంభించిన అనంతరం మంత్రి హరీశ్‌ రావు లబ్ధిదారు తేజస్విని కారులో కూర్చుని కొద్దిసేపు తిరిగారు. తేజస్వినికి  రూ.500 ఇచ్చి విజయవంతంగా ముందుకు సాగాలని దీవించారు. క్యాబ్స్‌ పొందిన మహిళలు అందరికీ ఆదర్శంగా అన్ని మెళకువలతో కారు నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యాలకు చేర్చడమే కాకుండా వారు క్షేమంగా ఇంటికి చేరాలని మంత్రి కోరారు.

కుటుంబానికి ఆసరాగా నిలుస్తా                                                                                                               సంగారెడ్డి తార డిగ్రీ కళాశాలలో చదువుతున్నాను. కుటుంబానికి ఆసరాగా ఏదో ఒక వ్యాపారం చేయాలని అనుకున్నా కానీ పెట్టుబడికి కావాల్సిన ఆర్థిక స్థోమత మా కుటుంబానికి లేదు. ప్రభుత్వ  షీ క్యాబ్స్‌ పథకం గురించి తెలిసి దరఖాస్తు చేసుకున్న.ఆ పథకానికి ఎంపికయ్యాను. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా డ్రైవింగ్‌ లో  శిక్షణ ఇప్పించి లైసెన్స్‌ ఇచ్చారు. ఇప్పుడు కారు కూడా వచ్చింది. కలలో కూడా ఊహించని విధంగా కారు ఓనర్‌ అయ్యే అదృష్టం దక్కింది. కుటుంబానికి ఆసరాగా నిలుస్తారు అని నమ్మకం వచ్చింది.                                                                        
- బి. ప్రవల్లిక, చేర్యాల్‌,కంది మండలం సంగారెడ్డి జిల్లా 

సీఎం దయతో కారు ఓనర్‌ను అయ్యాను
షీ క్యాబ్స్‌ పథకంతో నేను కారు ఓనర్‌ ను అయ్యాను. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ అందించి బ్యాంకు వారి సహకారంతో కార్లు అందించారు. నెల రోజులు ఉచితంగా డ్రైవింగ్‌ లో శిక్షణ ఇవ్వడంతో పాటు లైసెన్సు ఇప్పించారు. ఈ పథకంతో నా కాళ్ళ పై నేను నిలబడి బ్రతికేలా కారును అందించి ప్రోత్సహించిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు నేను, నా కుటుంబం రుణపడి ఉంటాం: పి. మధురమ్మ, చేర్యాల మండలం సంగారెడ్డి

సీఎం మాకు దేవుడు
ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి కోసం వివిధ శిక్షణ కార్యక్రమాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. నా భర్త ఓనర్‌ కమ్‌ డ్రైవింగ్‌లో శిక్షణకు దరఖాస్తు చేయాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఎస్బిఐ ఆధ్వర్యంలో నెలరోజులపాటు డ్రైవింగ్‌ లో శిక్షణ ఇచ్చారు. కారు ఓనర్‌లను చేసిన సీఎం మాకు దేవుడు లాంటి వాడు. కస్టమర్లను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తాను: వనంపల్లి మంజుల కొండాపూర్‌ మండలం, సంగారెడ్డి

బ్రతకడానికి భరోసా దొరికింది
ప్రభుత్వం అందించిన క్యాబ్‌లతో మా బ్రతుకులకు భరోసా లభించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణనిచ్చి కార్లు అందజేశారు. ఊబెర్‌ క్యాబ్‌ యాజమాన్యం క్యాబ్‌ రక్షణ కోసం జిపిఎస్‌ ఏర్పాటు చేసి మొబైల్‌ ఫోన్‌, పెప్పర్‌ మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఎక్కడికి వెళ్లాలన్నది బుక్‌ చేస్తే ప్రయాణికులను వారి గమ్యాలకు చేరుస్తాం. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటా. మా కుటుంబంతో సంతోషంగా ఉంటాం: తుడుం వనమాల, బోరపట్ల, హత్నూర మండలం, సంగారెడ్డి

అమ్మను పోషించడానికి ఆధారం దొరికింది
నా 11 సంవత్సరాల వయసులో నాన్న మరణించారు. అమ్మ కూలి పనికి వెళ్లి కష్టపడి నన్ను చదివించింది. పేపర్లో షీ క్యాబ్స్‌ పథకం గురించిన ప్రకటన చూశాను. దరఖాస్తు చేశాను. అందులో ఎంపికై శిక్షణ పొందాను. సబ్సిడీపై కారు ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారం అంతా, ఇంత అని చెప్పలేం. ఆడపిల్లల విషయంలో అన్నీ తానై ఆలోచిస్తున్న సీఎంకు సదా రుణపడి ఉంటా. అమ్మకు అన్నివిధాలా అండగా ఉండి చూసుకుంటాను: గొర్లకాడి వసంత, జుల్కల్‌, కంది మండలం, సంగారెడ్డి

ఎవరి రికమండేషన్‌ లేకుండా కారు అందించారు
గతంలో ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందాలంటే ఎవరో ఒకరి రికమండేషన్‌ కావలసి వచ్చేది.కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఏ పథకాలలోనైనా అర్హత ఉంటే ఎలాంటి రికమండేషన్‌ లేకుండా ఎంపిక జరుగుతుంది. డ్రైవర్‌ కం ఎన్‌పవర్‌మెంట్‌ పథకంకు దరఖాస్తులను ఆహ్వానించి, డ్రైవింగ్‌లో శిక్షణనిచ్చి క్యాబ్‌లను అందించారు. క్యాబ్‌లకు ఓనర్‌లను చేసిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌ రావుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్న: పట్నం అరుణ, సంగారెడ్డి

ఆనంద పరవశంలో తేలియాడుతున్నా
కేసీఆర్‌ ప్రభుత్వం తనకు మూడు కానుకలు ఇచ్చిందని, నాన్న లేని లోటు తీర్చిన కల్యాణలక్ష్మి, అమ్మ లేకుండా పురుడు పోసిన కేసీఆర్‌ కిట్‌, పుట్టింటి కానుకగా షీ క్యాబ్స్‌ అందించి తన బ్రతుకు బాటకు పునాదులు వేసి భరోసా కల్పించిందన్నారు. కళ్యాణ లక్ష్మి రూపంలో రూ.51 వేలు అందుకుంటే, పురుడుపోసుకున్నప్పుడు కేసీఆర్‌ కిట్‌ అందించి తల్లిదండ్రులు లేని లోటు తీర్చారని, 8 లక్షల విలువైన క్యాబ్‌ అందించారు. మొదటి ప్రయాణికు డుగా రూ.500 ఇచ్చి సుఖంగా, సంతోషంగా ఉండమని దీవించిన మంత్రి హరీశ్‌ రావు మాటలు తీపి జ్ఞాపకాలుగా మిగులుతాయన్నారు. తన జీవితంలో వెలుగులు నింపిన కేసీఆర్‌కు, బ్రతుకు పై భరోసా కల్పించిన హరీశ్‌ రావుకు జీవితాంతం రుణపడి ఉంటానంటుంది తేజస్విని: పాతర తేజస్విని, సంగారెడ్డి