జాంబవతీకుమార శృంగార విలాసము
శుభాంగీ దుర్యోధనుల పుత్రికయైన లక్షణను జాంబవతీ శ్రీకృష్ణుల కుమారుడగు సాంబుడు పరిణయమాడుట అనే ముఖ్య కథను 5 ఆశ్వాసాల్లో 1162 గద్య పద్యాలలో రసవంతంగా రచించిన కవి ఆసూరి మరింగంటి వెంకట నరసింహా చార్యులు.
శుభాంగీ దుర్యోధనుల పుత్రికయైన లక్షణను జాంబవతీ శ్రీకృష్ణుల కుమారుడగు సాంబుడు పరిణయమాడుట అనే ముఖ్య కథను 5 ఆశ్వాసాల్లో 1162 గద్య పద్యాలలో రసవంతంగా రచించిన కవి ఆసూరి మరింగంటి వెంకట నరసింహా చార్యులు.
రంగ కృష్ణమాచార్యులు – జి. యాదగిరి అగాధమైన జలనిధిలో ఆణిముత్యం, మట్టిలో మాణిక్యం బయటపడినప్పుడు గానీ సమాజంలో రాణించాలంటే ఆయనకు సంబంధించిన వర్గం, స్తోత్ర బృందం వగైరా సహకరించాల్సిందే. ఎల్లమ్మ రంగాపురంలాంటి కుగ్రామాల్లో…
శ్రీమహావిష్ణువు దశావతారాలలో ప్రత్యేకత కల్గినట్టిది నరసింహావతారం – ఇది నాల్గవ అవతారం. భక్త పాలన కొరకు భగవంతుడు నృసింహావతారం దాల్చి స్వల్పకాలం మాత్రమే వర్తించి ప్రసిద్ధుడైన స్వామిని గూర్చి పోతన్న ‘లోకరక్షైకారంభకు భక్తపాలన…
దేవాలయంవున్నప్పుడు ఆదేవుని పేర స్తోత్రం, శతకం. లేదా ప్రబంధం, ఇంకా ఇతర ప్రక్రియల సాహిత్యం వెలువడటం సర్వసామాన్యమైనా – ఆయా కవుల రచనా సామర్థ్యం, కథా వస్తువు కారణంగా అవి వ్యాప్తి చెందుతాయి….
ముద్రితమైన, అముద్రితమైన ఆయుర్వేద గ్రంథాలను పరిశీలించినపుడు క్రీస్తుశకం 15-16 శతాబ్దాలనుండి వస్తువుల గుణాలను తెలిపే నిఘంటువులు, రోగనిదానం చికిత్సలను వివరించు గ్రంథాలు ఎక్కువగా సంకలనం చేయబడినట్లు అవగతమౌతుంది.
ఈ పేరెత్తగానే ‘మీరజాలగలడా నాయానతి…’ ఇత్యాది చందాల కేశవదాసు పాట మన మదిలో నిలుస్తుంది. చాలా కాలంనాడే మరింగంటి వెంకట నరసింహాచార్య కవి (క్రీ.శ. 1770) తన బహురచనలలో నొకటిగా ఈ కథను సుమారు 1040 ద్విపదలలో రచించారు
ఇష్టదేవతాస్తుతి, సుదర్శన పాంచజన్యాది ఆయుధస్తుతి, అనంత గరుడ విష్వక్సేన శఠగోప రామానుజ వరవరముని మొదలైన వైష్ణవ ఆళ్వారుల ఆచార్యుల స్తుతితోబాటు తనకు విద్యాగురువైన దరూరి లక్ష్మణాచార్యులు, ఆధ్యాత్మిక గురువైన మరింగంటి లక్ష్మణదేశికుల స్తుతి ఉన్నాయి.
నల్లంతిఘళ్ చక్రవర్తుల ఠంయాల లక్ష్మీనరసింహాచార్యుల వారి పేరులో మొదటి రెండు ఇంటి పేర్లు, మూడవది బిరుదనామం ఇదే తర్వాత కాలంలో ప్రధాన గహ నామమైంది.
వైదిక కార్యక్రమాల ఆరంభంలో స్మార్త సంప్రదాయంవారు ‘గణపతి’ పూజ చేసినట్టే శ్రీవైష్ణవ సంప్రదాయంలో విష్వక్సేనారాధన అనేది ఒక సంప్రదాయం. విష్వక్సేనుడు శ్రీమహావిష్ణువునకు సర్వసైన్యాధ్యక్షుడు.
నల్లగొండ జిల్లా పెదవూర మండలానికి చెందిన ‘సిరిసెనగండ్ల’ గ్రామ పర్వతంపై నెలకొన్న లక్ష్మీనరసింహస్వామి సన్నిధి చాలా ప్రాచీనమైనది. కుతుబ్‌షాహీ సుల్తానులకన్న పూర్వం నుండి వున్న మరింగంటి కవులు ఈ స్వామిని కొలిచి తమ గ్రంథాలను అంకితమిచ్చారు.