అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే: అసెంబ్లీలో కేసీఆర్
ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలని, వారి మద్దతు తమకు పూర్తిగా ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీలో స్పష్టం చేశారు. తాము రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోను ఘన విజయం సాధిస్తున్నామని, ప్రజలు తమ పాలనకు బ్రహ్మరథం పడుతున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు.