అక్షర తపస్వి అమూల్య రచనలు
ఆచార్య ఎస్వీ రామారావు సాహిత్య పథంలో అనునిత్యం పయనించే సహృదయుడైన బాటసారి. ఎనిమిది పదులు దాటిన వయసులోనూ అక్షర సేద్యాన్ని కొనసాగిస్తున్న అరుదైన సారస్వత కృషీవలులు. అనేక గ్రంథాలు రచించినా, ‘‘నేను వ్రాసినదే తుదివాక్యం అన్నభావంతో నేను పుస్తకాలు వ్రాయను.