చిత్రకారులు

రంగుల రేఖల రసరమ్య గీతాలు

రంగుల రేఖల రసరమ్య గీతాలు

ప్రాదేశిక చిత్రకారుడుగా తన కళా జీవితాన్ని విద్యార్థి దశలోనే ప్రారంభించిన పెండెం గౌరీశంకర్‌ పల్లెపట్టులోని ప్రకృతికి, పడుచులకు, ప్రేమికులకు, దంపతులకు, పులువురు ప్రముఖులకు, పట్టణాలలో బతుకుభారమైన అట్టడుగు వర్గాల ప్రజానీకానికి తన చిత్రాలలో వాస్తవిక దృష్టితో చోటు కల్పించాడు.

చిత్రకారులకు  నిర్దిష్ట దృక్పథం అవసరం

చిత్రకారులకు నిర్దిష్ట దృక్పథం అవసరం

పల్లెపట్టులలోని స్త్రీపురుషుల నిత్యజీవితం, సుఖదు:ఖాలు, కోపతాపాలు, అందులోని శృంగారం  కె. లక్ష్మాగౌడ్‌ చిత్రాలలోని వస్తువు. ఇలా సరికొత్త కోణంనుంచి భారతీయ సంస్కృతిని తన చిత్రాలలో ప్రతిబింబించే సృజనాత్మక చిత్రకారుడు కె. లక్ష్మాగౌడ్‌ ఎప్పటికప్పుడు వివిధ చిత్రకళా ప్రక్రియలు చేపట్టి తనకొక విశిష్టస్థానాన్ని పదిలం చేసుకున్న నిత్యనూతన చిత్రకారుడు కూడా.

కుంచెలో వైకుంఠం!

కుంచెలో వైకుంఠం!

కుంచెతో చేసిన పనితనం, పోయిన పోకడలు ప్రశంసనీయమైనవి. ఎర్రని, పసుపుపచ్చని, ఆకుపచ్చని ప్రాథమిక వర్ణాలను తీసుకుని భావోద్వేగంతో ఆయన చిత్రించిన పల్లీయుల చిత్రాల మల్లెల వాసనలు కళాహృదయులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఒక్కొక్క చిత్రాన్ని నాలుగైదు రోజులపాటు విశ్రాంతిలేకుండా వేయగల సమర్థుడు వైకుంఠం.

చూడచక్కని ‘కొండపల్లి’ చిత్రాలు

చూడచక్కని ‘కొండపల్లి’ చిత్రాలు

1924 జనవరి 7వ తేదీన వరంగల్‌ జిల్లా పెనుగొండలో పుట్టిన శేషగిరిరావు రూపకల్పనచేసిన పోతన, నన్నయ్య, రామదాసు, అన్నమయ్య, వేమన, నాగార్జున, తెలుగుతల్లి, భాగమతి, ఆండాళ్‌ చిత్రాలు ఆయన ప్రతిభావ్యుత్పత్తులకు ఆనవాళ్ళు. ఆయన వేసే రేఖలలో, రంగులలో జీవం తొణికిసలాడుతుంది. అందుకే`ఆయన వేసిన చిత్రాలు పండితులేకాదు, పామరులు చూసినా ఎంతగానో మురిసిపోతారు.

సృజనాత్మక శిల్పి, చిత్రకారుడు ! పి.టి. రెడ్డి

సృజనాత్మక శిల్పి, చిత్రకారుడు ! పి.టి. రెడ్డి

పాకాల తిరుమల్‌రెడ్డి అంటే ఆయనెవరో ఎవరికీ తెలియదు. పి.టి.రెడ్డి అంటే చిత్రకళా ప్రపంచంలో ఆయన తెలియనివారు బహుశా ఉండరు. ‘‘నిండుమనంబు నవ్య నవనీత సమానము, పల్కుదారుణ ఖండలశస్త్రతుల్యము’’ అన్న పద్యం బహుశా ఈయనను చూసి చెప్పిందేమో అనిపించేది.

తెలంగాణా జీవన చిత్రాలు

తెలంగాణా జీవన చిత్రాలు

తెలంగాణ జీవనాన్ని, జీవన వృత్తులను, జీవన సౌందర్యాన్ని తనలోకి ఒంపుకొని దృశ్యబద్ధం చేసిన చరిత్రకారుడాయన! కళా జీవితం అంటే తాను నమ్మిన సిద్ధాంతాలను తాను పుట్టిన భూమిని, భూమికను విడవకుండా, తన ఎనభై ఏడేళ్ళ జీవితాన్ని కళామతల్లికి అంకితం చేసి ప్రపంచ చిత్రకళా పటంలో తెలంగాణ జీవితాన్ని పదిల పరిచిన చిత్రకళా తపస్వి కీ.శే. డా॥ కాపు రాజయ్య గారు.