పారిశ్రామిక వేత్తలు ఫిదా
ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతంగా ముందుకు తీసుకుపోవడంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్-ఐఐసీ) విజయవంతంగా దూసుకువెళుతోంది. పరిశ్రమల ఏర్పాటుకు భూముల గుర్తింపు, భూసేకరణ, కేటాయింపులతో పాటుగా కొత్త పారిశ్రామికవాడల ఏర్పాటు, అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోంది.