ఛుపారుస్తుం
పైకి రాజుబాటలాగానో, కాపు రాజయ్య బాటలాగానో అనిపించినా, లోలోన పరికించి చూస్తే-తనకంటూ పసందైన గీతగల హితగల లోతైన చిత్రకారుడు-మహ్మద్ రుస్తుం.
పైకి రాజుబాటలాగానో, కాపు రాజయ్య బాటలాగానో అనిపించినా, లోలోన పరికించి చూస్తే-తనకంటూ పసందైన గీతగల హితగల లోతైన చిత్రకారుడు-మహ్మద్ రుస్తుం.
గోపి గీసే గీతలలో జీవితం తొణికిసలాడుతుంది. సృజన కుదురువేసుకుని కూర్చుంటుంది. అందం-ఆటవిడుపులా అంతా తానై ఆక్రమిస్తుంది.
ఆమె ఆలోచనలలో కాల్పనికత ఉంది, కమనీయత ఉంది. ఆమె గీసే రేఖలలో జీవం ఉంది. ఆమె శైలి అపురూపమైంది, ఆకర్షణీయమైంది. ఆమె సంప్రదాయాన్ని, సర్రియలిజాన్ని ప్రేమిస్తుంది.
విసుగు, విరామం లేకుండా వ్యాపారాత్మక ధోరణికి దూరంగా, వైవిధ్యభరితమైన విశిష్ట చిత్రాలు గీస్తున్న నిరంతర చిత్రకారుడు మధు శ్రీనివాస రావు దాతర్. వీరు యం.యస్. దాతర్‌గా చిత్రకళాలోకంలో సుపరిచితుడు.
ప్రపంచ ప్రసిద్ధ జానపద చిత్రకారుడు జామినీరాయ్‌ని మించిన సృజనాత్మకశక్తిగల కాపు రాజయ్యకు శిష్యుడై చిత్రకళారంగంలో పాదంమోపి, బాతిక్ హస్తకళలో ‘భేష్’ అనిపించుకుని బాతిక్ బాలయ్యగా స్థిరపడినవాడు- యాసాల బాలయ్య.
పల్లె పట్టులలోని ప్రకృతి అందాలను, పల్లీయుల, గిరిజనుల జీవనశైలిని ప్రతిబింబించే రంగుల చిత్రాలను బహురమ్యంగా చిత్రించడంలో చేయి తిరిగిన చిత్రకారుడు-యల్. నరేంద్రనాథ్.
అఖిలభారత స్థాయిలో మీ చిత్రమేదైనా పోటీకి నిలిచి గొప్ప చిత్రమనిపించుకుందా నాన్న” అన్న కూతురు, వర్థమాన చిత్రకారిణి కరుణ మాటను సవాల్‌గా తీసుకుని, నాలుగు రోజుల్లో నలుగురు మెచ్చే చిత్రం గీసి పోటీకి పంపి కేంద్ర లలిత కళా అకాడమీ అవార్డును సాధించిన సుప్రసిద్ధ చిత్రకారుడు, శిల్పి శ్రీహరి భోలేకర్.
బహుప్రక్రియలలో చిత్రకళా సాధన చేయడం ఆమె నైజం. రెల్లు కాగితంపై, క్యాన్వాస్‌పై తైలవర్ణ చిత్రాలు గీయడంతోపాటు లోహపు పలకలపై చిత్రాలువేసి ప్రతులు రూపొందించడంలో కుట్టుతో, అల్లికతో, కత్తిరింపులతో, కోయడం ద్వారాను చాక్‌పీస్‌తో, కూరగాయలతో సూక్ష్మ శిల్పాలు రూపొందించడంలో, కంప్యూటర్‌పై గ్రాఫిక్ చిత్రాలు వేయడంలోనూ-ఆమెకు మంచి అనుభవం ఉంది.
ప్రవర్థమాన కళాకారుడు కంది నర్సింలు చిత్రాలలోని, శిల్పాలలోని కమనీయమైన, కళ్ళు మిరమిట్లు గొలిపే రంగులు-రేఖల వెనక-కనిపించీ కనిపించని తెలంగాణ పల్లెపట్టులు, సంస్కృతి-సంప్రదాయాలు ఉన్నాయి.
ఆయన అసలుపేరు జగదీశ్. నిజానికి ఆయన ఇవాళ్ళ చింతలులేని జగదీశ్. ఆయన కష్టజీవి. తన ఇష్టమైన పద్ధతిలో జీవితయాత్ర సాగిస్తున్నాడు. భార్యా పిల్లలుంటే ఆటంకాలు ఏర్పడి దృష్టి కేంద్రీకరించలేక కాలం హరించుకుపోతుందని, సదా కళకే అంకితమై అందులోనే తేలిపోతున్నాడు.