చిత్రకారులు

కళాఖండాలతో ఖండాంతర ఖ్యాతి

కళాఖండాలతో ఖండాంతర ఖ్యాతి

ఆయన అసలుపేరు జగదీశ్‌. నిజానికి ఆయన ఇవాళ్ళ చింతలులేని జగదీశ్‌. ఆయన కష్టజీవి. తన ఇష్టమైన పద్ధతిలో జీవితయాత్ర సాగిస్తున్నాడు. భార్యా పిల్లలుంటే ఆటంకాలు ఏర్పడి దృష్టి కేంద్రీకరించలేక కాలం హరించుకుపోతుందని, సదా కళకే అంకితమై అందులోనే తేలిపోతున్నాడు.

వృత్తి ప్రవృత్తి ఒకటైన శిల్పి

వృత్తి ప్రవృత్తి ఒకటైన శిల్పి

మహబూబ్‌నగర్‌ జిల్లా తెల్కపల్లికి చెందిన సంప్రదాయ శిల్పి – యర్రగిన్నిల జగదీశ్వరాచారి. జంగమ్మల పుత్రుడు. ఈ ప్రవర్థమాన శిల్పి – శివరామాచారి. ఆయన బాల్యమంతా తన తండ్రి రూపొందించే దేవుడి శిల్పాలు చూసి ప్రభావితుడైనాడు. తండ్రి దగ్గరే విగ్రహాలను నిగ్రహంగా రూపొందించే కిటుకులు తెలుసుకున్నాడు.

భరత్‌యాదవ్‌ ‘మహిషబంధం’

భరత్‌యాదవ్‌ ‘మహిషబంధం’

‘తిలకాష్ట మహిషబంధం’ అని వ్రాయని కావ్యానికి నామకరణంచేసి తెనాలి రామకృష్ణ కవి ప్రత్యర్థి కవిని అలనాడు చిత్తు చేసినా, ఈనాడు-‘మహిషబంధం’కు కావ్యగౌరవం కలిగిస్తూ సృజనాత్మక చిత్రాలను గీస్తున్న వర్ధమాన కళాకారుడు-సాయం భరత్‌యాదవ్‌.

భరత్‌’భూషణం’

భరత్‌’భూషణం’

నిజానికి రెండు కళలలో తనదైన ముద్రవేసిన భరత్‌భూషణం ‘సాధనమున పనులు ససకూరు ధరలోన’ అని మరోమారు రుజువు చేసి చూపాడు. ఇటీవల కాలంలో మందంగా రంగులను అద్దుతూ ‘ఇంపాస్టో’ పద్ధతిలో రూపొందిస్తున్న చిత్రాలు ఆయనను ఉత్తమశ్రేణి చిత్రకారుల జాబితాలోకి తీసుకువెళ్ళాయి.

రుధిరవర్ణపు నిండుచంద్రుడు

రుధిరవర్ణపు నిండుచంద్రుడు

దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఒక యేడాది ముందు-పున్నమినాడు పుట్టినందుకు తల్లిదండ్రులు మైదం సోమలక్ష్మి-రంగయ్యలు చంద్రుడు అని పేరు పెట్టారు. అది కాస్తా స్కూల్లో చేరేనాటికి చంద్రేశ్వర్‌ అయింది. మెట్రిక్‌ పరీక్ష వ్రాసి సర్టిఫికెట్‌ చేతికందేసరికి ఆ పేరు – చంద్రశేఖర్‌గా మారింది.

తనకు తానే అద్దంపట్టుకునే శిల్పి

తనకు తానే అద్దంపట్టుకునే శిల్పి

శిల్పాలకు నమూనాలుగా నిలవడంతప్ప, కలకాలం శిల్పులుగా నిలబడే మహిళలు అరుదు. అయినా, ఆ రంగంలో అహో! అనిపించే అపురూపమైన శిల్పాలు చెక్కి, సమకాలీన శిల్పకళా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని స్వంతం చేసుకున్న ప్రవర్ధమాన శిల్పి – రోహిణీరెడ్డి.

సృజనాత్మక చిత్రకారుడు జయంత్‌

సృజనాత్మక చిత్రకారుడు జయంత్‌

చేయితిరిగిన చిత్రకారుడు జయంత్‌ కుంచెలో సృజనాత్మకత పాలెక్కువ. వాస్తవానికి ఆయన వాస్తవ వాద చిత్రకళారీతిలో తర్ఫీదుపొంది పట్టాలు సాధించినా, ఇవాళ ఆయన వివక్త రూపాలకు ప్రాధాన్యతనిస్తూ తనకంటూ ఒకానొక ప్రత్యేక స్థానాన్ని చిత్రకళాలోకంలో పదిలంచేసుకున్నాడు.

స్వభావమే భావమైన చిత్రాలు

స్వభావమే భావమైన చిత్రాలు

ఈ లక్షణాలన్నింటితో ఆయన బొమ్మవేస్తే వెనకటికి మన తొలి కార్టూనిస్టు తలిసెట్టి రామారావు. కవుల రచనలు చదివి ‘కావ్య నాయిక బొమ్మ’ వేసినట్టే ఉంటుంది. అయితే ఆ చిత్రంలో ఉన్నది – విచిత్రవేషంలో ముస్తాబైన ‘మన శంకర్‌’ అని ఎంతమంది గుర్తుపడతారు!

ఆయన ఇల్లే ఓ కళా నిలయం

ఆయన ఇల్లే ఓ కళా నిలయం

ఆయనను చూడగానే – నల్లని ఫ్రేము సులోచనాలు, ఆ వెనక ఆలోచనాలోచనాలు, రెండు ప్రక్కల చెవులను, మెడను పూర్తిగా కప్పివేస్తూ తళతళ మెరిసే తెల్లని ఒత్తయిన పైకి దువ్విన జులపాలు, కళామర్మాన్ని ఇట్టే పసిగట్టే నిండైన ముక్కు, ఎదుటివారి స్పందనలకు వెంటనే ప్రతిస్పందిస్తుంటే వంతపాడే వదనం, ఎప్పుడూ ఎదో పని చేసే రెండు చురుకైన చేతులు మాత్రమే కన్పిస్తాయి.

మీసాల కృష్ణుని రూపకర్త

మీసాల కృష్ణుని రూపకర్త

తెలంగాణలో 20వ శతాబ్దపు పూర్వార్ధంలోనే పౌరాణిక పాత్రలకు అపూర్వరూపకల్పన చేసిన తొలితరం చిత్రకారుడు మార్చాల రామాచార్యులు. ఇంటిపేరు ఆసూరి కారంచేడు.