ఫీచర్స్

యాదికున్నకాడికి..

యాదికున్నకాడికి..

మేము పట్నమొచ్చినం. పట్నం సూసెతంద్కు మేము రాలేదు. సుట్టాలింటికి రాలేదు. కొత్త సైన్మ జూసెతందుకు రాలేదు. సదువుకునె తందుకొచ్చినం. మేము పట్నం రాలేదు. సత్తెన్నతోని వొచ్చినం. గాయిన ఎవ్వరోగాదు.

దాశరథికి అక్షరాభిషేకం

దాశరథికి అక్షరాభిషేకం

అలాగే దాశరథితో మైత్రీబంధాన్ని పెనవేసుకొన్న సమకాలీన సాహితీ మిత్రుల అనుభవాలను, ఆయన కవిత్వాన్ని సవిమర్శకంగా విశ్లేషించిన పరిశోధకుల వ్యాసాలను, తెలంగాణ స్పృహతో ప్రత్యేకించి దాశరథి స్పృహతో రాసిన 108 వ్యాసాలను సేకరించి విలువైన సమాచారన్నంతా భద్రంగా ఒకచోట నిక్షిప్తంచేసి ”సాహిత్య ప్రపంచంలో దాశరథి” గ్రంథాన్ని కూడా తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి పక్షాన డా||గంటా జలంధర్‌రెడ్డి సంపాదకులుగా పాఠకలోకానికి అందించారు.

బహుజన వైతాళికుడు పైడి తెరేష్‌ బాబు

బహుజన వైతాళికుడు పైడి తెరేష్‌ బాబు

పిడుగులు వర్షించి నట్లు కవిత్వం వ్రాసి, వర్తమాన కాలం నరాల్లోకి పిడికెడు కొత్త కాంతిని ఎగుమతి చేసిన అసామాన్య కళాకారుడు పైడిశ్రీ. పూల నుండి పరిమళాల్ని తుంచేసిన మతోన్మాద కుతంత్రాలను ధిక్కరించి, ఊరు నుండి ఉనికిని తుడిచేసిన మనుధర్మ కుట్రదారులపై అక్షర యుద్ధం ప్రకటించి అంబేద్కర్‌ పల్లవైన పాటకు ఆపకుండా చిందేసిన బహుజన వైతాళికుడు తెరేష్‌బాబు.

నరసింగరావు   సినిమాలు

నరసింగరావు సినిమాలు

తెలంగాణా సినిమాకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సాధించి పెట్టిన దృశ్య స్వాప్నికుడు – నరసింగ రావు! అందుకే ఆయన ‘రంగుల కల’ కు ‘మా భూమి’ పులకరించింది. ఆయన చలన చిత్ర ‘ఆకృతి’ కి ‘మట్టి మనుషులు’, ‘దాసి’ వంటి సామాన్యులే కథానాయ కులయ్యారు! ఆయన సృజించిన ‘హరివిల్లు’ని చూసి, ‘మా ఊరు’, ‘ది సిటీ’ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలూ సలామ్‌ చేస్తాయి…