ముఖ్యాంశాలు

కొత్తగా 33 బీసీగురుకులాలు 15 బీసీ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు….

కొత్తగా 33 బీసీగురుకులాలు 15 బీసీ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు….

తెలంగాణ విద్యా వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులను అమలుపరుస్తున్నారు. జిల్లాల్లో వున్న బీసీ విద్యార్థినీ, విద్యార్థుల కోసం మరో 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ డిగ్రీ రెసిడెన్షియల్‌ కాలేజీల ఏర్పాటు కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గోల్కోండలో వజ్రోత్సవ కేతనం

గోల్కోండలో వజ్రోత్సవ కేతనం

భారతదేశం 75 ఏండ్ల వజ్రోత్సవాలను పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రగతి భవన్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ పతాకావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, పలువురు నాయకులు సీఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సైబర్‌ నేరాల కట్టడికి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సి

సైబర్‌ నేరాల కట్టడికి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సి

రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్‌ ఆధారిత నేరాలను మరింత సమర్ధవంతంగా కట్టడి చేసేందుకుగాను పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో  ప్రత్యేకంగా సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్సి విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు  డిజిపి మహేందర్‌ రెడ్డి వెల్లడించారు.

ప్రగతి పథంలో పారిశ్రామిక రంగం… పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక

ప్రగతి పథంలో పారిశ్రామిక రంగం… పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక

2021-22 సంవత్సరానికి గాను తెలంగాణ పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విడుదల చేశారు

ఈవీ కేంద్రం తెలంగాణ : మంత్రి కేటీఆర్‌

ఈవీ కేంద్రం తెలంగాణ : మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో  ఈవీ, ఎనర్జీ స్టోరేజీ పాలసీని తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెచ్చిన ఈ పాలసీ అత్యుత్తమంగా ఉండడం వల్ల ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల స్థాపనకు తెలంగాణనే ఎంచుకుంటున్నారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.

ఇప్పుడు భారత్‌ అగ్రదేశాల చెంతన డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో 24 వేల కోట్ల పెట్టుబడి

ఇప్పుడు భారత్‌ అగ్రదేశాల చెంతన డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో 24 వేల కోట్ల పెట్టుబడి

భారత దేశ చరిత్రలో తొలిసారిగా డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో తెలంగాణకు భారీ పెట్టుబడి దక్కింది. 24 వేల కోట్ల రూపాయలను తెలంగాణలో డిస్‌ప్లే ఫ్యాబ్‌ కోసం పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఎలెస్ట్‌ కంపెనీ ప్రకటించింది. 

ఇక ‘ధరణి’ సమస్యలకు చెల్లు

ఇక ‘ధరణి’ సమస్యలకు చెల్లు

రాష్ట్రవ్యాప్తంగా వున్న వ్యవసాయ భూములన్నింటిని క్రమబద్దీకరించే ఉద్దేశంతో ‘భరణి’ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్‌ ప్రారంభించిన తర్వాత భూముల అమ్మకాలు కొనుగోళ్ళు కాలయాపన లేకుండా విజయవంతంగా జరుగుతన్నప్పటికీ, అక్కడక్కడా కొన్ని సమస్యలు ఇప్పటికీ ఉత్పన్నమవుతున్నాయి.

న్యాయ వ్యవస్థ బలోపేతానికి కేసీఆర్ కృషి ప్రశంసనీయం

న్యాయ వ్యవస్థ బలోపేతానికి కేసీఆర్ కృషి ప్రశంసనీయం

న్యాయవ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ కొనియాడారు.

మంత్రి వర్గం కీలక నిర్ణయాలు

మంత్రి వర్గం కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకున్నది. ఆదివాసి, గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, సారపాక, భద్రాచలం గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించాలనే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 

త్వరితగతిన సెక్రటేరియట్‌ నిర్మాణ పనులు: సీఎం

త్వరితగతిన సెక్రటేరియట్‌ నిర్మాణ పనులు: సీఎం

కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు.