విలీనం నుండి విభజన దాకా

తొలిసారి ప్రశాంతంగా తెలంగాణ బంద్‌

తొలిసారి ప్రశాంతంగా తెలంగాణ బంద్‌

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ నేతల డిమాండ్లను, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవడంలేదని ఇందిర, చవాన్‌ల హైదరాబాద్‌ పర్యటనల తర్వాత అర్థమవుతున్నది. బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయకపోగా ఆయనకు మరింత మద్దతును అందించే దిశగా కేంద్రంలోని మంత్రులు, జాతీయ కాంగ్రెస్‌ నేతలు పావులు కదుపుతున్నారు.

చవాన్‌తో చర్చలు విఫలం

చవాన్‌తో చర్చలు విఫలం

రెండు రోజుల పర్యటనను ముగించుకొని ఢిల్లీ చేరుకున్న దేశీయాంగమంత్రి వై.బి. చవాన్‌ ప్రధాని ఇందిరతో సమావేశమై తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆమెకు వివరించారు. ఆయా నేతలతో, బృందాలతో జరిపిన చర్చల సారాంశాన్ని వివరిస్తూ ‘‘తెలంగాణ నేతలంతా రాష్ట్రపతి పాలన కోరతున్నారని’’ ప్రధానితో చెప్పినట్లు పత్రికలు వెల్లడించాయి.

రాష్ట్రపతి పాలన పెడితేనే చర్చలు

రాష్ట్రపతి పాలన పెడితేనే చర్చలు

‘‘తక్షణం రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టినట్లయితే ఇలాంటి చర్చలకు వీలుకలుగుతుంది’’ అని చెన్నారెడ్డి సూచించారు. ‘‘రాష్ట్రపతి పాలన ఎప్పుడు రావాలని మీరు కోరుతున్నాం’’అని చవాన్‌ ప్రశ్నించగా, డా॥ చెన్నారెడ్డి తమ చేతి గడియారం వంక చూచి ‘‘ఇప్పుడు 7 గంటలకు పది నిముషాలు తక్కువగా ఉంది. 7 గంటలకు రాష్ట్రపతిపాలన వస్తే నేను ఆనందిస్తాను.

ఉద్యమ విరమణకై ప్రధాని ఇందిర ఒత్తిడి

ఉద్యమ విరమణకై ప్రధాని ఇందిర ఒత్తిడి

కేంద్ర ఇంటెలిజెన్స్‌ అధికారులు పరిస్థితి విషమిస్తున్న తీరును ప్రధాని దృష్టికితేగా, పొద్దున్నే ఆఫ్ఘనిస్తాన్‌కు పోవాల్సి వున్న ప్రధాని ఇందిరాగాంధీ అకస్మాత్తుగా 4వ తేదీ రాత్రి పదిగంటలకు ప్రత్యేక విమానంలో చొక్కారావుతో కలిసి హైదరాబాద్‌కు వచ్చినారు.

ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం

ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం

తెలంగాణ ప్రజా సమితి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన డా॥ మర్రి చెన్నారెడ్డి 1969 మే 26వ తేదీనుంచి ప్రత్యేక తెలంగాణ ఆందోళన ‘‘రెండవ దశ’’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తొమ్మిది తెలంగాణా జిల్లాల్లోనూ (అప్పటికింకా రంగారెడ్డి జిల్లా ఏర్పడలేదు) ప్రజలు, విద్యార్థులు జట్లుజట్లుగా తెలంగాణ మంత్రుల, శాసనసభ్యుల ఇళ్ళ ఎదుట సత్యాగ్రహం, ధర్నా జరుపుతారని, అంచెలవారి నిరాహారదీక్షలు కూడా తిరిగి ప్రారంభమవుతాయని చెన్నారెడ్డి ప్రకటించారు.

ఉద్యమ సారధిగా డాక్టర్‌ చెన్నారెడ్డి

ఉద్యమ సారధిగా డాక్టర్‌ చెన్నారెడ్డి

డుదలైన నేతలను, వెంకట్రామారెడ్డిని అభినందించడానికి డా॥ మర్రి చెన్నారెడ్డి తొలిసారి బర్కత్‌పురలోని తెలంగాణ ప్రజా సమితి కార్యాలయానికి వచ్చారు. 1968 సెప్టెంబర్‌ నుంచి ఉద్యమ సన్నాహాలు ప్రారంభించిన శ్రీధర్‌రెడ్డి, పుల్లారెడ్డి వంటి ఉస్మానియా విద్యార్థి నాయకులు ఉద్యమ నాయకత్వం బాధ్యతల్లో రాజకీయ నాయకులు వుండకూడదని, వెనుక ఉండి విద్యార్థులను నడిపించాలని కోరుతున్నారు.

ఉద్యమంపై తూటాల వర్షం..

ఉద్యమంపై తూటాల వర్షం..

1969 జనవరి 20న శంషాబాద్‌లో ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపి ఆరుగురిని గాయపర్చినారు. ఇద్దరు తీవ్రంగా గాయపడినారు. పోలీసులు తుపాకీ కాల్చడం 1969 ఉద్యమంలో ఇదే తొలి సంఘటన.

ఉద్యమంలో తొలి అడుగు

ఉద్యమంలో తొలి అడుగు

తెలంగాణ నేతలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికే హైదరాబాద్‌ కాంగ్రెస్‌ కమిటీని నీలం సంజీవరెడ్డి రద్దు చేసారు. సమితి ప్రెసిడెంట్‌ పదవి కావాలన్నా ఆంధ్రా నేతల అండదండలు కావాల్సి వచ్చింది తెలంగాణ నేతలకు!