జల సంరక్షణలో పురస్కారాలు
ముల్కలపల్లి మండలం, జగన్నాధపురం పంచాయతీకి జల సంరక్షణ చర్యల్లో, జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ స్థాయిలో మరొక అవార్డు సొంతం చేసుకుంది.
ముల్కలపల్లి మండలం, జగన్నాధపురం పంచాయతీకి జల సంరక్షణ చర్యల్లో, జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ స్థాయిలో మరొక అవార్డు సొంతం చేసుకుంది.
దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, తపన కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. వైద్యారోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మనం స్వప్నించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏండ్ల పోరాట చరిత్రనీ, పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్నీ ఘనంగా తలుచుకుందాం.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో సూపర్ స్పెషాలిటి హాస్పటల్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ వేద మంత్రో చ్ఛారణల నడుమ భూమి పూజ చేశారు. ప్రస్తుతం నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జీG2 భవనాన్ని రూ. 184.87 కోట్లతో 3.7 ఎకరాల్లో, 93 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించడం జరుగుతుంది.
వంద రోజుల ‘కంటి వెలుగు’ సంబురాలు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఛైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్‌తో కలిసి కేక్ కట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లపై వరాలజల్లు కురిపించింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ వారికి భారీగా అలవెన్సులు, అడ్వాన్స్‌లు, ఇతర సౌకర్యాలు, సదుపాయాలు కల్పించి ఉద్యోగులను సంతోషపెట్టింది. ఇటీవలే 2.73 శాతం డీఏ మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అలవెన్సులు, అడ్వాన్స్‌లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
సిద్ధిపేట యువతీ, యువకుల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఐటీ కల సాకారమైంది. సొంతగడ్డపైనే సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలన్న స్వప్నం నెరవేరింది. హైదరాబాదు, బెంగళూరు వంటి మహా నగరాలకే పరిమితమైన సాఫ్ట్‌వేర్ కొలువు దరి చేరింది. ఉన్న ఊరును, కన్నవాళ్లను వదిలి ఎక్కడికో వెళ్లకుండా ఉన్న చోటనే కొలువు చేసుకునే అవకాశం దక్కింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించి, సంరక్షించిన ఐదు ప్రముఖ నిర్మాణాలకు 2023 వ సంవత్సరానికి గాను ప్రకటించిన ‘గ్రీన్ యాపిల్’ అవార్డులు లభించాయి.
సంగారెడ్డిజిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో ఆసియాలోనే అతి పెద్ద సామాజిక గృహ వసతి సముదాయాన్ని (టౌన్ షిప్) ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రారంభించారు. పైలాన్‌ను ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ‘తెలంగాణ అమరవీరుల స్మారకం’ ను ప్రారంభించారు.