చిలక పలుకులు

book2అధ్యాపకుడు, కవి, రచనా వ్యాసకర్త అయిన గ్రంథకర్త డా|| యన్‌. రామచంద్ర కలంనుండి వెలువడిన ‘చిలుకపలుకులు’ రచనా సంపుటి, అందరూ చదవదగిన మంచి కవితా సంపుటి.

ఇందులో శతక ప్రక్రియలా కవిత్వం సాగుతూ, ముచ్చటగా మూడుపాదాలతో సాగిన ఈ కవితా సంపుటికి ”చిలుకా” అనే మకుటాన్ని జోడించారు కవి.

ఇందులో ఎక్కువగా ప్రకృతి, వర్ణన, మానవ పుట్టుక, పూర్వోత్తరాలు, ఆధ్యాత్మిక తత్వ భావజాలాన్ని తన ఈ హస్తాక్షర కవితా సంపుటిలో, నిష్పక్షపాతంగా పొందుపరిచినారు.

ఒకచోట

పేగుబంధము చిదుమ

బిడ్డ గొంతు నులుము

పేద దుస్థితి కనుమ – చిలుకా! అని అంటాడు.

ఇక్కడ పేరు ఖంఢము… పేద దుస్థితిని అర్థభావజాలాన్ని మనకందించాడు కవి.

-కె. శ్రీనివాస్‌

రచయిత: డా.యస్‌.రామచంద్ర

పేజీలు: 84, వెల: రూ. 80

ప్రతులకు: 26905, పద్మాలయ, సాహితీ మిత్రమండలి, నరేంద్ర నగర్‌, ప్రొద్దుటూరు, కడపజిల్లా