గోడు తీరింది.. గూడు దక్కింది..!
ఇంటింటా పాచి పని చేసే ఫర్జానా..!
పెట్రోల్ బంకులో పనిచేసే స్వాతి..!
40 ఏండ్ల సంది రిక్షా తొక్కుతూ బతికే జానేమియా..!
అంట్లు తోమే హేమక్క..! బీడీలు చుట్టే అరుణక్క..!
టైరు పంచరు వేసే తాజోద్దీన్..!
గొడ్డలి, గడ్డపారలు తయారుకై సుత్తె కొట్టే శాంతమ్మ..!
మక్క కంకులు అమ్ముతూ కూలీ జీవనం గడిపే కనకవ్వ..
ఇలా ఎంతోమంది అభాగ్యుల ఆత్మ గౌరవాలకు ప్రతీకగా సిద్ధిపేట డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సాక్షాత్కరిస్తున్నాయి. తెలంగాణ నిరుపేదల సొంతింటి కలను తీరుస్తానన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గుండెల నిండా సంతోషాన్ని నింపిన అద్భుత కట్టడాలు ఇవి. ఏ పని చేసినా ప్రజాసేవే పరమావధిగా భావించే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పట్టుదలకు ప్రతిరూపాలు ఈ పేదోళ్ల పెద్ద ఇండ్లు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మానస పుత్రిక రెండు పడకల గదుల ఇళ్లు. జీG2 తరహాలో సిద్ధిపేటలో నిరుపేదల కోసం నిర్మించిన ఈ గృహ సముదాయానికి కేసీఆర్ నగర్ గా నామకరణం చేశారు. ఇది ఇప్పుడు ఒక కొత్త నగరంగా వెలిసింది. గుక్కెడు నీళ్లు, బుక్కెడు బువ్వకేడ్చిన వారి గోడును తీర్చి సంతోషాల ‘గూడు’లో ప్రవేశం చేయించింది. పేదోడి ఇళ్లు.. పెద్దోడి భవంతిలా మారిన రోజు కళ్ల ముందు సాక్షాత్కరించింది. ఇది మన తెలంగాణ ప్రజా సర్కారు. మాటలు కాదు, చేతల్లో చూడు అంటూ యావత్ భారతావనికి తెలంగాణ రాష్ట్రం నేడొక దిక్సూచిలా మారితే.. సిద్ధిపేట రోల్ మాడల్ గా నిలిచింది. మొత్తం 2460 ఇళ్లకు గానూ ఏక కాలంలో 160 ఇళ్లలో సామూహిక గృహా ప్రవేశాలు జరిపి యావత్ ప్రపంచం మరోసారి తెలంగాణ వైపు చూసేలా ‘‘డబుల్ బెడ్ రూమ్’’ సంబురాలు జరిగాయి. ‘‘మా బాధలు పోగొట్టిన సారూ, మా కల నెరవేర్చిన సర్కారు అంటూ తమ అందమైన బృందావనాన్ని ‘కేసీఆర్ నగర్’ గా ఆత్మీయ నామకరణం చేసుకున్న తీరుపై ప్రత్యేక కథనం..

స్వంత ఇంటి కల ప్రతి నిరుపేద జీవితంలో తియ్యని గుర్తు.! అదీ అన్ని వసతులతో దేశంలోనే రోల్ మోడల్ ఇళ్లు దక్కితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది. సీఏం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో సిద్ధిపేట పట్టణ నిరుపేదల ముఖాన సంతోషం వెల్లివిరిసింది. సంపన్నులు నిర్మించుకొనే గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇండ్లు కట్టి, ఇంటింటికి పైపు లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం చారిత్రాత్మక ప్రక్రియకు నిదర్శనంగా మారింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీతో పేదల స్వంతింటి కల నెరవేరింది. ఏళ్లుగా ఎదురుచూసిన గూడు గోడు సాకారమైంది. ఆధునిక వసతులతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి వెళ్లిన ప్రజల ముఖాన చిరునవ్వులు వెల్లివిరిశాయి.

కట్టిన ఇళ్లు, పెట్టిన పొయ్యి..!
మిమ్మల్ని కొత్త ఇంట్లోకి తోలుతున్నాం. ప్రతీ నిరుపేద సంతోషంగా ఆత్మ గౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం.! కట్టిన ఇళ్లు, పెట్టిన పొయ్యితో.. పేదోళ్ల వంటింట్లో పైపు తిప్పితే గ్యాస్ వచ్చే విధానంతో ముందుకు వెళ్దామని మంత్రి హరీశ్ సూచన మేరకు పేదలకు ఇచ్చే ఇళ్లను సకల హంగులతో తీర్చిదిద్దారు. నల్లా తిప్పితే నీళ్లు వచ్చినట్లుగానే.. పైపు తిప్పితే గ్యాస్ వస్తున్నది. కేసీఆర్ నగర్ లో నిర్మించిన రెండు పడకల గదుల ప్రత్యేకత ఇది. పేదలకు పంపిణీ చేసే ఇళ్లలో పైపు లైను ద్వారా గ్యాస్ సరఫరా చేయడం రాష్ట్రంలో ఇక్కడే మొదటిసారి. టోరెంట్ కంపెనీకి బాధ్యత అప్పగించి ప్రతి ఇంటికీ పైపులు అమర్చారు. ఇక్కడి భవన సముదాయంలోనే డీఆర్ఎస్- డిస్ట్రిబ్యూటరీ రెగ్యులేటరీ సిస్టమ్ స్టేషను ఏర్పాటు చేపట్టారు. ప్రతీ రెండు నెలలకు ఒక్కసారి బిల్లు చెల్లింపులు చేసేలా మీటర్ల ద్వారా వినియోగాన్ని లెక్క కట్టేలా చర్యలు తీసుకున్నారు. ఈ విధానంతో సిలిండర్ ద్వారా వాడుతున్న గ్యాస్ కంటే 15 నుంచి 20 శాతం ఆదా కానున్నదని సంస్థ ప్రతినిధులు వివరించారు.
హైదరాబాదు లాంటి నగర తరహాలో సంపన్నుల ఇండ్లకు పేదల ఇండ్లు సరిసమానమే అన్నట్లుగా సిద్ధిపేట కేసీఆర్ నగర్ వేదికగా మారింది. సిద్ధిపేట పట్టణ శివారు నర్సాపూర్ వద్ద 45 ఎకరాల్లో రూ.162 కోట్లతో జీG2 పద్ధతిన 2460 ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. విశాలమైన ప్రదేశంలో ప్రతీ బ్లాకులో 12 ఇండ్లు చొప్పున 205 బ్లాకులు నిర్మించారు. కమ్యూనిటీ హల్, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్, పోలీస్ ఔట్ పోస్ట్, ప్రతి ఇంటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మురికి నీటి శుద్ధీకరణ ప్లాంట్, 24 గంటల పాటు నీటి సరఫరా, తాగునీటి ట్యాంకు, చుట్టూ ప్రహరీ గోడ, పిల్లల కోసం పార్కు తదితర వసతులతో డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ నగర్ ఆదర్శంగా నిలిచేలా ఇందుకోసం రూ.163 కోట్లు వెచ్చించారు. ఇళ్ల కేటాయింపు తర్వాత నిర్వహణ సమస్యలు తలెత్తకుండా కమీటీలను ఏర్పాటు చేయనున్నారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
నిజమైన నిరుపేదల ఎంపికలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో పారదర్శకంగా ప్రక్రియను చేపట్టి అర్హులను గుర్తించింది. ఇక్కడ నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్లకు 11వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాహన, ఇంటి రిజిస్ట్రేషన్లు, ఆస్తిపన్ను చెల్లింపులు.. ఇలా రకరకాల పద్ధతుల్లో దరఖాస్తుదారుల వివరాలను వడబోసి అర్హులను గుర్తించారు. అలా ఒక జాబితా రూపొందించి వాటిని పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రదర్శించి, అభ్యంతరాలు ఉంటే తెలపాలని ప్రజలను కోరారు. వారిలో ఇప్పటి వరకు 1354 మంది లబ్ధిదారులను నిజమైన నిరుపేదలుగా తేల్చారు. 33 రకాల పద్ధతులలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి తొలి దశలో 1341 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా వీరిలో 144 మంది లబ్ధిదారులను తొలివిడత ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ చేతులమీదుగా సామూహిక గృహ ప్రవేశాలు జరిపారు.
హారతి పట్టి స్వాగతించిన మహిళలు
ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదల ఆత్మ గౌరవం పెంపొందేలా చేసి, సామూహిక గృహ ప్రవేశాలకు హాజరైన తమ ప్రియతమ ముఖ్యమంత్రి కేసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ప్రాంగణంలో అడుగుపెట్టడంతో భవంతిపైనున్న ప్రజలు పరవశించి పోయారు. ప్రతి ఇంటా సంప్రదాయ బద్ధంగా మంగళ హారతులు పట్టి కుంకుమ తిలకం దిద్దుతూ.. ప్రతి ఇంటా ఆడ పడుచుల ఆనందోత్సాహాల నడుమ మహిళల జయ ధ్వానాలు, యువకుల కేరింతలు, చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా కేసీఆర్ నగర వాసులంతా ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఆ సన్నివేశం నిజంగా సంబురమయమైన ఘట్టం.
కార్తీక మాసం దశమి గురువారం సరిగ్గా వేకువ జాము నుంచే గృహ ప్రవేశాలు మొదలుకాగా, మధ్యాహ్నం 12.30 గంటలకు తొమ్మిదో బ్లాకులోని మూడో నెంబరులో ఉండే స్వాతి నివాసానికి వెళ్లి సీఏం కేసీఆర్ గృహ ప్రవేశాన్ని ప్రారంభించారు. వీరి వెంటే మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, హరీశ్ రావులు తొమ్మిదో బ్లాకులోని 1, 2, 4, 5 నివాసాలలో గృహా ప్రవేశాలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటా గుమ్మడికాయ కొడుతూ.. కొత్త ఇంట్లో దేవుడికి పూజలు చేసి, నూతన గృహాల్లో శుభ సూచకంగా సత్యనారాయణ వ్రతం జరుపుకున్నారు. మామిడి తోరణాలు, బంతిపూలతో గృహాలను అలకరించిన తీరుతెన్నులు చూసి, కొత్త ఇంట్లోకి వచ్చారని ఎట్లా అనిపిస్తోందని స్వాతి, సిక్కులోల్ల రాజ్ కోర్ కుటుంబీకులు, ఇతర లబ్ధిదారులతో సీఏం కేసీఆర్ ఆత్మీయంగా ముచ్చటించారు.
కేసీఆర్ నగర్లో నిర్మించిన గృహాల్లో సీఏం పర్యటనలో ప్రజానీకం ఆద్యంతం ఉత్సహంగా, అట్టహాసంగా ఉల్లాసంగా కనపడ్డారు. కేసీఆర్ నగర్ పైలాన్ ఆవిష్కరణ మొదలు నుంచి కేసీఆర్ నగర్లోని ఫంక్షన్ హాల్, సమీకృత మార్కెట్, వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని తిరిగి వెళ్లేదాకా మా గృహ ప్రవేశాలు జరిపిన అభిమాన దేవుళ్లని.. వెన్నంటే ఉంటూ బ్రహ్మరథం పట్టిన ప్రజానీకానికి సీఏం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు ప్రత్యేక అభివాదాలు తెలిపారు.
లబ్ధిదారులు తమ ఇళ్లను అందంగా అలంకరించి సంప్రదాయంగా పూజలు జరిపి కుటుంబ సభ్యులు, సీఏం కేసీఆర్, మంత్రులతో కలిసి సంతోష వాతావరణంలో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు. శాసన సభ్యుడిగా, మంత్రిగా ఈ ప్రాంత పేదలకు స్వంతింటి కల నిజం చేశాననే తృప్తి తన జీవితంలో సుస్థిరంగా నిలిచి పోయిందని మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఏం కేసీఆర్ ముందుగా డబుల్ బెడ్ రూమ్ పైలాన్ ఆవిష్కరించి, ఆ తర్వాత ఫంక్షన్ హాల్, డబుల్ గృహ ప్రవేశాలు జరిగే కార్యక్రమంలో పాల్గొన్నారు.
లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు..
తల రాతలు రాసేది బ్రహ్మ దేవుడైతే తమలాంటి పేదోడికి గూడు కల్పించిన సీఏం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు కూడా తమకు అభినవ బ్రహ్మ దేవులేనని పట్టణ ప్రజలు వేవేల జేజేలు పలికారు. మొన్నటి దాక కిరాయి ఇండ్లు..! ఇవాళ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వచ్చాయని, నిన్నటి దాక దశ దిశ లేని తమ జీవితాలకు.. తెలంగాణ సర్కారు దేవుడిలా వచ్చి శాశ్వత గూడునిచ్చిందని గృహ ప్రవేశాలు జరిపిన లబ్ధిదారుల నుంచి సంబురం వ్యక్తమైంది. మా కలలో కూడ ఊహించని..సంబురంతో.. ఇండ్లిచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు సర్కారు పది కాలాలు సల్లంగా ఉండాలని దీవెనలు ఇచ్చారు. నయా పైసా ఖర్చు లేకుండా.. గృహ ప్రవేశాలు చేసే లబ్ధిదారుల కుటుంబీకులకు స్వంత అన్నయ్యలామంత్రి హరీశ్ రావు ఆశీర్వదిస్తూ నూతన వస్త్రాలను బహుకరించి గృహ ప్రవేశాలు చేయించడం విశేషం.
సంపాదించిన 2, 3వేలు కిరాయికే పోతుండే: కొడిమ్యాల స్వాతి, దేవేందర్
రెండేండ్ల సంది పెట్రోలు బంకులో పనిచేస్తే 5వేలజీతం వస్తుంది. వచ్చినదాంట్లో 2, 3వేలు కిరాయి కట్టడానికే పోతుండే. మా భర్త దేవేందర్ బతుకుదెరువు కోసం దారాల కంపనీలో పని చేస్తారు. ఇంటి యజమాని కిరాయి పెంచుతామని చెప్పడంతో ఇప్పటికీ 3 ఇండ్లు మారినం. ఇయ్యాల మాకు డబుల్ బెడ్ రూమ్లు ఇచ్చి మా జీవితంలో వెలుగు నిండింది. మా ఇళ్లు ప్రారంభోత్సవానికి సీఏం కేసీఆర్ సారే వచ్చి చేయడం మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంటూ తమ సంబురాన్ని పంచుకున్నది.
ఇయ్యాల నా దుఃఖం తీరింది: సర్వరీ బేగం
50 రూపాయలు నుంచి ఇయ్యాల 3 వేల రూపాయల దాక కిరాయిలు కట్టిన. కేసీఆర్, హరీశ్ రావు దయతో ఇయ్యాల నా దుఃఖం తీరింది. బతికున్నంత కాలం అల్లా కేసీఆర్, హరీశ్ రావు అచ్చా రహెన.
బహుత్ బార్ ఘర్ మే మిర్చి అచార్ సే ఖానా ఖాతేతే: టైరు పంచర్ చేసే తాజోద్దీన్
ఒక్క టైరు పంచర్ వేస్తే పెద్ద బండ్లు వంద, 150 రూపాయలు వచ్చేవి. తమ్ముడు షపీ ఆటో నడిపి, వెల్డింగు పని చేసి సాయంగా ఉండటంతో బతుకు దెరువు కొనసాగేది. నెలంతా కష్టపడ్డ 5వేల రూపాయలు దాకా కిరాయికే పోయేది. అమ్మ, బాపు యూసుఫ్, షాహేదాలు బుడాపన్మే హోకే బహుత్ తఖిలీఫ్ హువా. బహుత్ బార్ ఘర్ మే మిర్చి అచార్ సే ఖానా ఖాతేతే. మగర్ ఆజ్ హమే మాకు 23వ నెంబరు బ్లాకులో 3వ నెంబరు ఇళ్లు ఇచ్చిండ్రు. సీఏం కేసీఆర్, ఔర్ హరీశ్ రావు సాబ్ కో బహుత్ షుక్రియా.
సీఏం కేసీఆర్, హరీశన్న..సౌ సాల్ జీనా: ఫర్జానా
ఘరోమే బర్తనా దోనేకో.. జాతేతే.. పెద్దోళ్ల ఇండ్లలో పాచి పనికి వెళ్లి పని చేస్తే వచ్చిన జీతం 2వేలు ఇళ్లు కిరాయికే కట్టేది. మా ఆయన ఘరోమే కరెంటు ఫిట్టింగ్ కామ్ కర్కే.. ఘర్ చలాతే. ఆజ్ హామారే ఆవాజ్ సున్కే హామారీ తఖ్లీఫ్అల్లాకే రూప్ మే సీఏం కేసీఆర్, హరీశన్ననే దూర్ కర్దియా. హమే పేట్ బర్ ఖుషీ మిలీ.సీఏం కేసీఆర్ సాబ్, హరీశన్న..సౌ సాల్ జీనా.
దేవుడు మా గోడు చూసిండు: శాంతమ్మ, కేశవులు
నాకు నలుగురు కొడుకులు, ఒక బిడ్డ. అందరం ఇదే పని చేస్తేనే ఇళ్లు గడిచేది. సిద్ధిపేటలోని వెంకటేష్ కళామందిర్ దగ్గర రెక్కలు, ముక్కలు చేసుకుని రోజంతా కష్టపడి మా ఆయన, నేను కలిసి గొడ్డలి, గడ్డపారలు కొడితే వంద, రెండొందలు, ఎప్పుడో ఒక్కసారి మూడొందలు వచ్చేవి. వచ్చిన పైసలలో సగం ఇళ్లు కిరాయికే పోయేది. దేవుడు మా గోడు కష్టాన్ని చూసిండు. మాకుసొంత ఇళ్లు ఇప్పించిండు. ఈ సర్కారు, హరీశన్న సల్లగుండాలే.
ఇళ్లులేని లోటు తీరింది: అరుణ- బీడీ కార్మికురాలు
మా ఆయన రెగ్జిన్ బ్యాగులు కుట్టే పని చేసేవారు. తోమ్మిదేండ్ల కింద పక్షవాతం వచ్చి ఇంట్లోనే మంచాన పడ్డారు. పిల్లల చదువు కోసం అప్పులు చేసి వాటిని కట్టలేక మస్తు తిప్పలు అయ్యేది. మా దుఃఖం ఎవ్వరికీ చెప్పలేక పోయినం. 20 ఏండ్ల సంది బీడీలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నా.. ఇంటి కిరాయిలకే 3వేల రూపాయలు పోతుండే. ఇయ్యాల కేసీఆర్, హరీశ్ రావు సారూ దయతో మాకు 21వ బ్లాకు 10వ నెంబరులో ఇళ్లు వచ్చి.. ఇళ్లు లేని లోటు తీరింది.
ఎకీ కమ్రేమే గౌసీయా, బేటా బహూ చోటే దో బచ్చే రహేతే తే: జానేమియా, రిక్షా కూలీ
40 సాల్సే రిక్షా చలారహు. లగ్ బగ్ పచ్చీస్ సాల్ రిక్షా ఛలాయా. అబ్ ఆటో ఆకే రిక్షా బంద్ హువా. వడ్డెర కాలనీ, ఎన్జీఓ కాలనీ మె అబ్ టెంట్ హౌస్మే రిక్షా ఛలా రహహు. ఎకీ కమ్రేమే గౌసీయా ఔర్ మై, మేరా బేటా బహూ చోటే దో బచ్చే రహేతే తే. ఏకీ కమ్రేకా కిరాయ్ 700 సే లేకే అబ్ తఖ్ 1500 బన్ రహేతే. హరీశ్ రావు సాబ్ కే దువాసే అబ్ హమారా గరీబీ దూర్ హో గయీ. అల్లా ఉన్కో అచ్చా రకే.
గుడిసెలో బతికేటోల్లం: రాజ్ కోర్, జీవన్ సింగ్
ఇయ్యాల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లులో సంతోషంగా ఉన్నాం. 50 ఏళ్లుగా గుడిసెలో బతికేటోల్లం. ఇయ్యాల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లులో సంతోషంగా ఉన్నాం. మాకు నలుగురు కొడుకులు.ముగ్గురు వేరే చోట బతికేందుకు వెళ్ళిపోయారు. కొడుకు, బిడ్డలతో కలిసి 40 ఏండ్ల నుంచి గుడిసెలోనే జీవనం కొనసాగిస్తున్నాం. ఇండ్ల పొయ్యిలు, గరిటెలు తయారు చేసి వాటిని అమ్ముకుంటూ బతికే గూడు లేని మాకు గూడిచ్చిన దేవుండ్లు సీఏం కేసీఆర్, హరీశ్ రావు సార్లూ సల్లంగా ఉండాలే.