సీఎంను రప్పించిన గంగదేవిపల్లె

cm-kcrగంగదేవిపల్లె ప్రజలు తమ గ్రామానికి ముఖ్య మంత్రిని రప్పించుకోగలిగారంటే ఇక్కడి ప్రజలలో ఉన్న చైతన్యమేనని, తమ గ్రామాన్ని చక్కగా తీర్చిదిద్దుకుని, అభివృద్ధిబాటలో పయనింపచేశారని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. ఆగస్టు 17న వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లె గ్రామంలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. సంఘటితశక్తి ఎంతటి కఠినమైన పనినైనా సులభంగా సాధించగలుగుతుందన్నారు. అందుకే గంగదేవిపల్లెను చూడడానికి దేశ,విదేశాల నుంచి ప్రముఖులు వచ్చి పోతున్నారంటే ఈ గ్రామప్రజల సంఘటితశక్తి ఖండాంతరాలకు వ్యాపించిందని అన్నారు.

గంగదేవిపల్లెను రాష్ట్రంలోని మిగతా గ్రామా ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకుని, వారిలాగా తమ గ్రామాలను కూడా తీర్చిదిద్దుకోవాలన్నారు. గ్రామంలో ప్రజలంతా కలిసికట్టుగా తమ గ్రామానికి ఏ అభివృద్ధికార్యక్రమాలు కావాలో తామే నిర్ణయించుకుంటే ఆ మేరకు నిధులు మంజూరీ చేయడానికి తాను సిద్దంగా ఉన్నానన్నారు. ఒక్క గంగదేవిపల్లె కాకుండా రాష్ట్రంలో నిజామాబాద్‌ జిల్లాలోని అంకాపూర్‌ గ్రామ ప్రజలు కూడా సంఘటిత శక్తితో అద్భుతాలు సాధించారన్నారు. హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో ఎలా ఉన్నాయో అలాంటి అధునాతన భవనాలు అంకాపూర్‌లోను అగుపిస్తాయన్నారు. అక్కడ రైతు అంతగా స్థితిమంతులు కావడానికి వారి సమిష్టి కృషి మాత్రమే కారణమన్నారు. ప్రతి గ్రామం కూడా స్వయం పోషకంగా ఉండాలన్నదే తన కోరిక అన్నారు. గ్రామంలో ఎరువులు, బట్టలు, చెప్పులు ఇలా ఏవి కావాలన్నా గ్రామంలోనే కొనుక్కునే విధంగా ఉండాలని, పక్కనున్న నగరాలకు, పట్టణాలకు వెళ్ళి కొనుగోలు చేసే పరిస్తితి రావద్దని అన్నారు. అందుకై గ్రామస్థుంతా కలిసి నిరుద్యోగ యువకులకు ఇలాంటి దుకాణాలు పెట్టించాని అన్నారు. ఈ విధంగా గ్రామాలు స్వయం పోషకాలుగా మారిపోతే రాష్ట్రం అభివృద్ధిపథంలో సాగుతుందని అన్నారు. రాష్ట్రంలోని ఎం.పి. లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఒక్కొ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని సూచించారు. గ్రామాలలో ముఖ్యంగా పారిశుధ్య సమస్య ఉందని, దాన్ని అధిగమించడానికి గ్రామస్థుంతా గట్టి నిర్ణయం తీసుకోవాలని కోరారు. గ్రామజ్యోతికి నిధుల కొరత లేదని, ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే వెనుకాడేది లేదని సీఎం గ్రామస్థులకు భరోసా ఇచ్చారు. గ్రామాలోని ప్రజలంతా చేతులు కలిపితే వేలకోట్ల సంపదను సృష్టించగలరన్నారు. ప్రజలు అభివృద్ధిచెందితేనే బంగారు తెంగాణ సాధ్యమవుతుందన్నారు. అవరోధాలను అదిగమిస్త్తూ ముందుకుసాగాలని చెబుతూ వెలుతురు ఉన్న చోట చీకటి ఉంటుందని, అలాగే మన కార్యక్రమాలను వ్యతిరేకించే వాళ్ళు మన మధ్యే ఉంటారని అన్నారు. వారిని చూసి బెదిరిపోకుండా ధైర్యంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తులుగా ఎవరికివారు బాగున్నా సంఘంగా పనులు సాధించలేక పోతున్నామన్నారు. అందుకే రాష్ట్రంలోని ప్రతి గ్రామం స్వయం పాలనతో స్వయం సమృద్ధి సాధించాలన్నదే గ్రామజ్యోతి లక్ష్యమన్నారు. ఏ విషయంలో కూడా గ్రామాలు ఇతరుల  పైన ఆధారపడరాదన్నారు. అప్పుడే నిజమైన గ్రామ స్వరాజ్యం వచ్చినట్లని అన్నారు. గ్రామాలలోని రైతులు వ్యవసాయంలో ఆదునిక పద్దతులు పాటించి సంపన్నులు  కావాలన్నారు.

రాష్ట్రంలో కరీంనగర్‌ జిల్లా ముల్కనూరు, వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లి, నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ గ్రామాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. తెంగాణలోని అన్ని గ్రామాలు ఈ గ్రామాల మాదిరిగానే స్వయంపోషకాలై బంగారు తెలంగాణను తేవాలని పిలుపునిచ్చారు. మనం వెయ్యేండ్లు బతకమని, ఉన్నన్ని రోజులు మంచిపనులు చేసి సమాజానికి మనవంతు తోడ్పాటును అందించాలని అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ పోరాటం చేశారు. ఈరోజు ఆయన భౌతికంగా లేకున్నా, ఆయన స్పూర్తి ఉందన్నారు. ఆ స్పూర్తితో మనం ముందుకు సాగాని పిలుపునిచ్చారు.

మేడిపల్లి రాంపూర్‌లో..

మేడిపల్లి రాంపూర్‌ జంట గ్రామాలలో జరిగిన సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. పల్లెల్లో గుడంబా మహమ్మారి ప్రజలను, ముఖ్యంగా యువతను నిర్వీర్యం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గుడంబాను గ్రామాలనుంచి తరిమి కొట్టాని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా గుడంబా వల్ల అవి ఉపయోగంలోకి రావడంలేదని అన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమం కోసం రానున్న నాలుగేండ్లలో ప్రభుత్వం నుంచి రూ. 4.10 కోట్లు రానున్నాయని, వాటితో పాటు ఇక్కడి దాతలు అందచేసిన రూ. 1.75 కోట్ల రూపాయలతో గ్రామాలను అద్దంలా తీర్చిదిద్దుకోవాలని ఆయన సూచించారు. ఇవే కాకుండా ముఖ్యమంత్రిగా తాను మరో రూ. 5 కోట్లు మంజూరీ చేస్తున్నట్లు తెలిపారు. మీ గ్రామానికి అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చినదాతలను అభినందించారు.

కోటి రూపాయలు విరాళమిచ్చిన యశోద ఆసుపత్రుల యాజమాన్యం 

యశోదా ఆసుపత్రుల యజమానులు గోరుకంటి రవీందర్‌రావు, సురేందర్‌రావు, దేవేందర్‌రావు తమ స్వగ్రామం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి గాను రూ. కోటి చెక్కును సీఎం కేసీఆర్‌కు అందచేశారు. అలాగే తమకు గ్రామంలో ఉన్న 30 గుంటల భూమిని కమ్యునిటీ హాలు నిర్మాణానికి ఇచ్చారు. వీరితో పాటు చెన్నారావుపేట మండలం లింగగిరికి చెందిన దొడ్డా మోహనరావు రూ. 50 లక్షలు, అమెరికాలో స్థిరపడ్డ ఫార్మాకంపెనీ యజమాని మిడియా సుధాకర్‌రావు రూ. 25 లక్షలు విరాళాన్ని అందచేశారు. యశోదా ఆసుపత్రుల యజమానులను సీఎం కేసీఆర్‌ వేదికపై శాలువా కప్పి సన్మానించారు. అనంతరం గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ గ్రామజ్యోతి ప్రారంభ కార్యక్రమాలలో శాసనసభ సభాపతి సిరికొండ మధుసూధనా చారి, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎం.పి.లు వినోద్‌కుమార్‌, అజ్మీరా చందులాల్‌, తెంగాణ సాంస్కృతిక సారధి రసమయి బాల్‌కిషన్‌, డిల్లీలో  ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలా చారి, రామచంద్రు, ఎమ్మెల్యేలు  చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్‌, మాధవరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బి.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్‌ పీటర్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ అనితా రామచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.