లక్ష మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేసిన హెచ్‌ఎండిఏ

పర్యావరణ సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని హెచ్‌ఎండిఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ కోరారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పురపాలకశాఖ కేంద్ర కార్యాలయంలో  పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు. సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌  బి. రాజమౌళి, అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లె, సంయుక్త సంచాలకులు డి ఎస్‌. జగన్‌, డి శ్రీనివాస్‌, ఉప సంచాలకులు యాసా.వెంకటేశ్వర్లు,సహాయ సంచాలకులు ఎం. యామిని, హెచ్‌ఎండిఏ ఎస్‌ఈ పరంజ్యోతి, పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కార్యాలయం ఓ.ఎస్‌.డి. లు శ్రీనివాస్‌ రావు, రాధ,  హెచ్‌ఎండిఏ, పురపాలక విభాగాల అధికారులకు, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.