|

కళ్యాణ లక్ష్మి కమనీయం..

By:- చిటుకుల మైసారెడ్డి

కళ్యాణ లక్ష్మి కమనీయం.. తెలంగాణ ఆడ బిడ్డలకు కళ్యాణ వైభోగం.. పుట్టినింట నుండి మెట్టినింట అడ బిడ్డ తొలి అడుగుకు భరోసా.. పేద తల్లిదండ్రులు పడే బాధలను దూరం చేసిన ఉద్యమ నేత కేసీఆర్‌, అక్టోబర్‌ 2 గాంధీ జయంతి రోజున కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకం ప్రారంభించి అడ పిల్లల పెండ్లికి భరోసా నింపి పేద తల్లిదండ్రుల కండ్లలో సంతోషం, వెలుగు నింపారు. ఈ ఎనిమిది యేండ్లలో 11 లక్షల 62 వేల మంది ఆడ బిడ్డల పెండ్లికి వరమైంది. 10 వేల కోట్ల సహాయం పేదింటి బిడ్డలకు భరోసా నింపింది.

ఒకప్పుడు పేదింట ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే అప్పు చేయాల్సిందే. అలా చేసి ఆర్ధికంగా చితికిపోయిన కుటుంబాలు ఎన్నో. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల వివాహం భారం కాకుండా తెలంగాణ సర్కారు 2014 అక్టోబర్‌ 2న ప్రవేశపెట్టిన అద్భుత పథకం కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌. ఈ పథకం ద్వారా రూ.1,00,016 అందిస్తున్నారు. ఈ పథకం దివ్యాంగ అడ పిల్లలకూ ఎంతో ఆసరాగా నిలిచింది. వీరికి 25 శాతం అదనంగా సహాయం కలుపుకుంటే 1 లక్ష 25 వేల 16 రూపాయలు అందిస్తోంది. ఇప్పటి వరకు 512 మంది దివ్యాంగ ఆడ బిడ్డలకు రూ. 6.40 కోట్ల సహాయం అందింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో అత్యధికులు 46.20 శాతం మంది బీసీలే వున్నారు. పథకం వల్ల ఒకవైపు పేద కుటుంబాలపై ఆర్దికభారం తగ్గిపోవడంతో పాటు, బాల్యవివాహాలు తగ్గాయి. తద్వారా వాటిల్లే మాతా శిశుమరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు అమ్మాయిల విద్యాభ్యాసం పెరిగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్ళలో ఏ ప్రధాని, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకం మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ అడబిడ్డలకు ‘‘కల్యాణలక్ష్మి” ఒక గొప్ప కానుక అందించిండు.. ఎవరు అడగలేదు.. కేసీఆర్‌ గొప్ప ఆలోచనతో ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం తరపున ఆసరాగా నిలవాలని కళ్యాణలక్ష్మి పథకం ద్వారా వారికి భరోసా కల్పించారు. పెళ్లి అంటే నూరేళ్ల పంట అన్నట్టు.. ఆడపిల్ల తల్లిదండ్రులు పుట్టింటి నుండి మెట్టినింట సుఖసంతోషాలతో వాళ్ళ సంసారం జీవనం సాగాలని కోరుకుంటారు.. మెట్టినింట బిడ్డ సంతోషంగా ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉంటారు..ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే ఎన్నో రకాల ఆలోచనలు చేసి మంచి సంబంధాలు చూసి ఏ లోటు రాకుండా చూసుకునే భర్త, అత్త మామా ఇంటికి పంపుతారు .. తెలంగాణ ప్రభుత్వం తరపున సిఎం కేసిఆర్ అందించే కళ్యాణలక్ష్మి ఆడపిల్లల పెళ్లికి ఎంతో సహకారం అందిస్తుందని తల్లిదండ్రులకు ధైర్యం కలుగుతోంది.. పెళ్లి ఖర్చులకు కళ్యాణ లక్ష్మి బాసటగా నిలుస్తుందని పిల్లల తల్లిదండ్రులకు సీఎం కేసీఆర్‌ ఉన్నారని ధీమా కలుగుతోంది.

ఆడబిడ్డకు సీఎం కేసీఆర్‌ అందించిన వరం

కళ్యాణ లక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన యువతులకు ఆర్ధిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, అక్టోబర్‌ 2న ప్రవేశపెట్టిన పథకం. 2017, మార్చి 13న ప్రవేశపెట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్‌ లో ఈ పథక ఆర్ధిక సాయాన్ని రూ.51వేల నుండి రూ.75,116 లకు పెంచారు. 2018, మార్చి 19న రూ.1,00,116 కు పెంచారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద 2021, సెప్టెంబర్‌ 18వ తేదీనాటికి 7,14,575 మంది ఆడపిల్లలకు లబ్ధిచేకూరింది. దీనికోసం ప్రభుత్వం రూ.5,556.54 కోట్లు వెచ్చించింది. అదే 2022 సంత్సరం నాటికి 10 వేల కోట్లకు చేరింది. 11 లక్షల 62 వేల మంది లబ్ధి పొందారు. కొత్తగా 97 వేల దరఖాస్తులు కళ్యాణలక్ష్మి పథకం సహాయం కోసం వచ్చాయి.