అనాథలకు ప్రభుత్వమే అమ్మా నాన్న

రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల  స్థితిగతులు మెరుగు పర్చి, వారి భవిష్యత్‌కు బంగారు బాట వేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌, రాష్ట్ర గిరిజనస్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌  అధ్యక్షతన  క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రులు  సత్యవతి రాథోడ్‌ సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో ఉన్న విక్టో రియా మెమోరియల్‌ హోమ్‌ను సందర్శించి, అక్కడి వసతులను, పిల్లల ఆరోగ్య, విద్యా పరిస్థితులనుపరిశీలించారు.

ఈ హోమ్‌లో 58 మంది తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఉన్నారు. మంత్రులు పిల్లలతో  మాట్లాడి వారి బాగోగులు తెలుసు కున్నారు. ఇంకా ఏమేమివసతులు కల్పిస్తే బాగుంటుంది, ఇంకా ఏమి చేస్తే సంతోషంగా ఉంటారో చెప్పాలని అడిగారు.మంత్రులు ఇద్దరూ పిల్లలని దగ్గరకు తీసుకొని, వారితో మాట్లాడారు. హోమ్‌లో ఎలా ఉంది, భోజనం, చదువు బాగా ఉందా అని అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులులేరని ఇక అనుకోవద్దని ప్రభుత్వమే ఇక తల్లిదండ్రిగా అన్ని బాధ్యతలుతీసుకొని, ఈ రాష్ట్ర బిడ్డలుగా మీ సంరక్షణ చేస్తుందని, ఏ లోటూ లేకుండాచూస్తుందని  వారు పిల్లకు భరోసా ఇచ్చారు.

సీఎం కేసీఆర్‌  ఒక తండ్రి వలె గొప్ప మనసుతో ఆలోచించి మీకు విద్య, భోజనం, వసతితో పాటు ఇక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరవాత మంచి భవిష్యత్‌అందించాలన్న ఆలోచనతో ఉన్నారని,దేనికి దిగులు పడకుండా బాగా చదువుకోవాలనివారికి ప్రోత్సాహం కల్పించారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల అనాథలు అయిన వారి బాగోగులు చూసి, వారి బంగారుభవిష్యత్‌ కోసం సీఎం కేసిఆర్‌  కేబినెట్‌ సబ్‌ కమిటీ వేశారు.పిల్లలు అనాథలు కాకుండా వీరిని రాష్ట్ర ప్రభుత్వ పిల్లలుగా గుర్తించాలన్నారు.ఈ పిల్లలందరికీ సీఎం కేసీఆర్‌  ప్రకటించే ప్యాకేజీ వారి బంగారు భవిష్యత్‌ తీర్చిదిద్దే విధంగా ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు.

సీఎం కేసిఆర్‌, రాష్ట్రం వచ్చాక అనేక కార్యక్రమాలు చేశారు. ఏమి చేసినా ఆకార్యక్రమం లోతుల్లోకి వెళ్లి చేస్తారు. అందులో భాగంగానే అనాథల కోసం మంచి కార్యక్రమం చేయాలని నిర్ణయించారు.అనాథ పిల్లలకు అమ్మ, నాన్న ప్రభుత్వమే కావాలని సీఎం కేసీఆర్‌  ఆలోచన.అనాథల కోసం దేశం మొత్తం గర్వించే విధంగా తెలంగాణలో నూతన విధానం తీసుకురానున్నారు.120 ఏళ్ల కింద ఏర్పాటు అయిన ఈ విక్టోరియా మెమోరియల్‌ హోమ్‌  చాలా మందికి ఆశ్రయం ఇచ్చింది.ఇక్కడ కేజీ టు పిజి వరకు విద్యావకాశం కావాలని అడిగారు. దీనిని సీఎం దృష్టికి తీసుకెళ్తాం మని, ఉమెన్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ కూడా ఏర్పాటు చేసి అక్కడ చదువుకునే  అవకాశం కల్పిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.

ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌, ప్రత్యేక కార్యదర్శి  దివ్య దేవరాజన్‌, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.