ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి

telangana-packegతెలంగాణలో అభివృద్ధి చెందని, వెనుకబడిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, వాటిని అభివృద్ధిపథంలో ముందుకు నడిపించడానికి రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షులు అరవింద్‌ పనగరియాకు రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సెప్టెంబరు 8న న్యూడిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడుతో కలిసి పనగరియాతో భేటీ అయ్యారు.

విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతా అభివృద్ధికి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందాల్సి ఉండగా ఇప్పటివరకు అందలేదని తెలిపారు. ఈ విషయంలో శ్రద్ద చూపి తమకు నిధు వచ్చేలా చేయాని కోరారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో 8 జిల్లాను వెనుకబడిన జిల్లాలుగా గతంలోనే ప్లానింగ్‌ కమిషన్‌ గుర్తించిందని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత ఏడాది డిసెంబర్‌లోనే ప్రధానమంత్రికి లేఖ రాశారని తెలిపారు. జులై 3న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి కూడా లేఖ రాశారని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలలో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ప్రత్యేక ప్యాకేజీ మంజూరీ చేసిన కేంద్ర ప్రభుత్వం తెంగాణకు ఇప్పటివరకు మంజూరీ చేయలేదని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు ద్వారా పలు రాష్ట్రాలకు లబ్ది చేకూరినా తెంగాణకు అన్యాయం జరిగిందని వివరించారు. ప్రస్థుత ఆర్థిక సంవత్సరానికి రూ. 2,389 కోట్ల మేర నష్టం జరిగిందని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రానున్న 4 సంవత్సరాకు గాను రాష్ట్రానికి రూ. 30,571 కోట్లు చెల్లించాని పేర్కొన్నారు. ఈ మేరకు సమగ్ర నివేదికను అందచేశారు. అంతకుముందు ఇదే అంశంపై పీఎంవో కార్య దర్శి శేషాద్రిని కలిశారు. ఆర్థికశాఖ కార్యదర్శి ఆర్పీ వాట్టాల్‌కు కూడా వివరించారు.