|

అలరించిన హరికథా మహోత్సవాలు

nతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి డాక్టర్‌ కె.వి. రమణ పుట్టిన రోజంటే కళాకారులందరికీ ఓ పండుగరోజు. కళాకారుల పట్ల ఆయనకు ఉన్న అభిమానం, గౌరవానికి ఇది నిదర్శనం.

డాక్టర్‌ కె.వి. రమణ ఎప్పటిలాగానే ఈ ఏడాదికూడా 6?వ జన్మదినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వారం రోజుల పాటు హరికథా మహోత్సవాలను నిర్వహించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఘంటసాల కళావేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సంస్కృతిక శాఖ సహకారంతో, కిన్నెర ఆర్ట్‌ థియేటర్‌, నిర్వహణలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు పలువురు ప్రముఖులు హాజరై కె.వి.రమణకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హరికథా గానం చేసిన పలువురు ప్రముఖులను డాక్టర్‌ కె.వి.రమణ సత్కరించారు.

దశాబ్దాలకు పైగా కళాకారులను ప్రోత్సహిస్తున్న రమణాచారి జన్మదినం తమకు అపురూపమైన పర్వదినంగా జానపద కళాకారులు భావిస్తారు. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి తరలివచ్చిన జానపద కళాకారుల, తమ కళారూపాలు ప్రదర్శించి ఆ కళామూర్తి పట్ల తమ గౌరవాదరాలను చాటుకున్నారు. ఈ సందర్భంగా రమణాచారి స్పందిస్తూ అనేక వ్యయప్రయాసాలకోర్చి తన కోసం రాజధానికి విచ్చేసిన కళాకారుల ప్రతిభకు చంద్రునికో నూలుపోగులా లకూజుా యాభైవేల రూపాయలు పారితోషికంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. తన పెన్షన్‌ నుంచి ఈ సొమ్ము ఇస్తున్నట్లు ఆయన పేర్కొనడం విశేషం.