రాష్ట్రంలో భారీగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు

రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రానున్న 2022-23 సంవత్సరానికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహించాలని, ఇందులో భాగంగా ఆయిల్‌ పామ్‌ సాగుచేసే రైతులకు ఎకరాకు మొదటి సంవత్సరం రూ.26,000, రెండవ సంవత్సరం ఎకరాకు రూ.5,000, మూడవ సంవత్సరం ఎకరాకు రూ. 5,000 చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందచేయాలని నిర్ణయించింది. అటవీ శాఖ, అటవీ అభివృద్ధి కార్పోరేషన్‌ తో పాటు పంచాయితీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖల సహాయంతో ఆయిల్‌ పామ్‌ మొక్కల నర్సరీలను పెంచాలని కేబినెట్‌ సూచించింది.

ఆయిల్‌ పామ్‌ పంట విధానం గురించి మరింతగా తెలుసుకోవడానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన అధ్యయన బృందం, కోస్టారికా, మలేషియా, థాయ్‌ లాండ్‌, ఇండోనేషియా తదితర దేశాలలో పర్యటన చేపట్టాలని కేబినెట్‌ ఆదేశించింది. ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు, తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌ మెంట్‌ అండ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ అడ్వాన్స్‌మెంట్‌ (టిఎస్‌.ఐ.డి.ఈ.ఏ), తెలంగాణ స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల (టి.ఎస్‌.ఎఫ్‌.పి.జెడ్‌) నిబంధనల ప్రకారం అందించే ప్రోత్సాహకాలు అందచేయాలని అధికారులకు కేబినెట్‌ సూచించింది.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రెండు రోజుల పాటు మంత్రి మండలి సమావేశం జరిగింది. ముందుగా వ్యవసాయ శాఖకు సంబంధించిన విషయాలపై కేబినెట్‌ చర్చించింది. ఈ సందర్భంగా గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు, తదితర విషయాలను, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, కార్యదర్శి, అధికారులు కేబినెట్‌ కు సమగ్రంగా వివరించారు. ప్రస్తుతం వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో, విత్తనాలు, ఎరువుల లభ్యత, వర్షపాతం తదితర అంశాల పై కేబినెట్‌ చర్చించింది.

గత పాలనలో తెలంగాణలో వ్యవసాయం తీరు ఎట్లుండె నేటి స్వయం పాలనలో ఎట్లున్నది అనే విషయాలను ముఖ్యమంత్రి సమావేశంలో చర్చించారు. గత ఏడేండ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయ ప్రస్థానం, అది సాధించిన ఘన విజయాలను సీఎం ప్రస్తావించారు. ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్తును అందించడంతో పాటు, అనేక కష్టాలకోర్చి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నదీజలాలను చెరువు లకు, కుంటలకు, బీడు భూములకు ప్రభుత్వం మళ్లించిన దన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఒక్క ఎకరమూ వదల కుండా, వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను రైతులు సాగుచేయడం ప్రారంభించారన్నారు. దాంతో పెద్దఎత్తున రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.

అదే సమయంలో ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పంట పెట్టుబడి సాయం రైతుబంధు సహా సకాలంలో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడం, తదితర వ్యవసాయ రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇట్లా అన్ని రకాల చర్యల ఫలితంగా, గత సంవత్సరం 3 కోట్ల టన్నుల ధాన్యం తెలంగాణలో, రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరిగిందని సీఎం తెలిపారు. దాంతోపాటు రైతుకు ఎటువంటి కష్టాలు రాకుండా కరోనా కష్ట కాలంలో గ్రామాల్లోకి వెళ్లి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసిందని సీఎం తెలిపారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులు మరింత ఉత్సాహంతో వరి ధాన్యాన్ని పండిరచే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని, వచ్చే సంవత్సరం ధాన్యం ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశాలున్నాయని సీఎం సూచించారు. అందుకు అనుగుణంగా ధాన్యం నిలువ చేయడం, మార్కెటింగ్‌ చేయడంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రస్తుత వానాకాలం కోటీ నలభై లక్షల ఎకరాల్లో వ్యవసాయ సాగు జరగనున్నదని, వరి, పత్తి పంటలు రికార్డుస్థాయిలో పండనున్నాయని సీఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వున్న ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలన్నారు. రైస్‌ మిల్లుల్లో మిల్లింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, నూతనంగా రైస్‌ మిల్లులు, పారబాయిల్డ్‌ మిల్లులను గణనీయంగా స్థాపించాల న్నారు. ఇందుకు సంబంధించి అత్యంత క్రియాశీలకంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖను సీఎం ఆదేశించారు.

రైతులకు సమగ్రంగా శిక్షణ ఇవ్వడానికి కావలసిన అన్ని సౌకర్యాలను వ్యవసాయ శాఖ కల్పించాలని, ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగాలని సీఎం స్పష్టం చేశారు. ఉద్యానవన శాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చాలని అందుకు అవసరమైన రీతిలో అధికారులను, నిపుణులను జోడిరచి నిరంతరంగా రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

పౌరసరఫరాల శాఖ సహా వ్యవసాయ శాఖలో ఎటువంటి ఉద్యోగాలు ఖాళీగా ఉండకూడదని, అన్ని పోస్టులను నింపుకోవాలని కేబినెట్‌ ఆదేశించింది. పండిన ధాన్యాన్ని పండినట్టే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ లో భాగంగా మిల్లింగ్‌ చేసి ఎక్కడ డిమాండ్‌ ఉంటే అక్కడికి సరఫరా చేయాలన్నది. ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ ఆదేశించింది. అందుకు అవసరమైతే సంబంధిత రంగంలో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని కేబినెట్‌ సూచించింది. నూతనంగా ముందుకు వచ్చే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలని మంత్రి మండలి అధికారులను ఆదేశించింది.

కేబినెట్‌ సబ్‌ కమిటీ

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరుగనున్న నేపథ్యంలో ధాన్యం నిల్వ, మిల్లింగ్‌, మార్కెటింగ్‌ సహా నూతన పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ సబ్‌ కమిటీలో సభ్యులుగా మంత్రి గంగుల కమలాకర్‌, హరీశ్‌ రావు, కేటీఆర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌, సబితా ఇంద్రారెడ్డి,  ప్రశాంత్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి సభ్యులుగా ఉంటారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ

‘తెలంగాణ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ’ కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని కేబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

500 ఎకరాలకు తగ్గకుండా 1000 ఎకరాల వరకు తెలంగాణ స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్స్‌ ఏర్పాటు చేసి 2024 -25 సంవత్సరం వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాలల్లో ఏర్పాటు లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులను కేబినెట్‌ ఆదేశించింది.

ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ మార్గ దర్శకాల ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ప్రభుత్వం భూమిని సేకరించి ఏర్పాటు చేసిన జోన్లలో అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే అభివృద్ధి చేసి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హత మేరకు అందులో భూమిని కేటాయించాలని నిర్ణయించారు.

తద్వారా సుమారు 25 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించి, 70 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, 3 లక్షల మందికి పరోక్ష ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది. విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో కూడిన స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది.

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ పద్దతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను, నైపుణ్యాన్ని పెంచే దిశగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ విధా నాన్ని అమలు పరచాలని అధికారులను అదేశించింది.

రైస్‌ మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోళ్లు, పాలు, డెయిరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్లను ఈ విధానం ద్వారా ఏర్పాటు చేయాలని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల చుట్టూ కనీసం 500 మీటర్ల వరకు బఫర్‌ జోన్‌ గా గుర్తించి ఎలాంటి జనావాసాలకు, నిర్మాణాలను అనుమతించకూడదని మంత్రివర్గం నిర్ణయించింది.

ఈ పాలసీలో రూపొందించిన మార్గదర్శకాలపై కేబినెట్‌ చర్చించింది. రాష్ట్ర నీటిపారుదల సామర్థ్యంలో గణనీయమైన పెరుగుదల కారణంగా వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక, పాడి, మత్స్య రంగాలలో సాధించే అదనపు ఉత్పత్తిని ప్రాసెసింగ్‌ చేసేందుకు రాష్ట్రంలో అనువైన సామర్థ్యం సృష్టించబడిరదని కేబినెట్‌ నిర్ధారించింది.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థల స్థాపన ద్వారా, వాల్యూ చైన్‌ ముందుకు సాగడానికి, ఉత్పత్తిదారులకు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ద్వారా, గ్రామీణ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల అభివృద్ధితో ఆర్థిక కలాపాలు పెరిగి, తద్వారా ఉపాధి పెరిగి, రాష్ట్రంలోని గ్రామీణ మారుమూల వెనకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి దారి తీస్తుందని కేబినెట్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.

గ్రామీణ ఎస్సీ, ఎస్టీ మహిళలకు జోన్లల్లో వ్యవస్థాపక అవకాశాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. రాష్ట్రంతో పాటు దేశ విదేశాలకు ప్రాసెస్‌ చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వీలు కల్పించే దిశగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించారు.

ఈ ప్రోత్సాహకాల్లో భాగంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లలో స్థాపించే యూనిట్లకు పలు విధాల రాయితీలను అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది:

  • కరెంటు సబ్సిడీని ప్రతి యూనిట్‌కు రెండు రూపాయల చొప్పున 5 సంవత్సరాల దాకా అందిస్తారు.
  • . పెట్టుబడికోసం తీసుకున్న టర్మ్‌ లోన్‌ పై చెల్లించాల్సిన మొత్తం వడ్డీలో 75 శాతం వడ్డీని (రెండు కోట్లకు మించకుండా) రీయింబర్స్‌మెంట్‌
  • మార్కెట్‌ కమిటీకి చెల్లించాల్సిన ఫీజును, ఏడు సంవత్సరాల కాలం వరకు 100 శాతం రీయింబర్స్‌ మెంట్‌
  • ఆహార ఉత్పత్తులను, స్టోరేజీకి తరలింపు తదితర లాజిస్టిక్స్‌ కోసం కూడా ఈ జోన్లలో ప్రత్యేకంగా భూమిని కేటాయించి వాణిజ్యాభివృద్ధికి తోడ్పాటు.

వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అదనపు ప్రోత్సాహకాలం దించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

పైన తెలిపిన సాధారణ ప్రోత్సాహకాలకు అదనంగా:

  • 15 శాతం మూలధనాన్ని(20 లక్షలకు మించకుండా) మంజూరు.
  • మూలధనం లోన్‌ పై చెల్లించాల్సిన వడ్డీలోని 10 శాతం రీయింబర్స్‌ మెంట్‌ (85 శాతం) (రెండు కోట్ల వడ్డీకి మించకుండా)
  • అర్హులైన వారికి జోన్లలో కేటాయించిన భూమి కొనుగోలు ధర మీద 33 శాతం సబ్సిడీ (20 లక్షలకు మించకుండా సబ్సిడీ)

స్వయం సహాయక సంఘాలు, రైతు సంఘాలకు (ఎఫ్‌.పీ.ఓ) కూడా అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా (పైన తెలిపిన సాధారణ ప్రోత్సాహకాలకు అధనంగా)

  • 15 శాతం మూల ధనం మంజూరు (రూ.1 కోటి మించకుండా)
  • మూలధనం లోన్‌ పై చెల్లించాల్సిన వడ్డీలోని 10 శాతం రీయింబర్స్‌ మెంట్‌ (80 శాతం) (రెండు కోట్ల వడ్డీకి మించకుండా)

భూమి విలువ మీద 33 శాతం వరకు సబ్సిడీ (20 లక్షలకు మించకుండా)

‘తెలంగాణ లాజిస్టిక్స్‌ పాలసీ’

పారిశ్రామిక, ఈ-కామర్స్‌, సేవా రంగాలలో రాష్ట్రం దినదినాభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో, అందుకను గుణంగా లాజిస్టిక్స్‌ రంగాన్ని ప్రోత్సహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. అందులో భాగంగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ రూపొందించిన ‘తెలంగాణ లాజిస్టిక్స్‌ పాలసి’కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

కరోనా నేపథ్యంలో బయట తిరగలేని పరిస్థితుల్లో ప్రజలకు వస్తు సేవలు అందుబాటులోకి రావడానికి లాజిస్టిక్స్‌ రంగం ఎంతగానో ఉపయోగపడ్డదని, అంతర్జా తీయ ఈ-కామర్స్‌ సంస్థలు లాజిస్టిక్‌ రంగాన్ని వినియోగించుకుని ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్నా యని కేబినెట్‌ గుర్తించింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధిలో ఆయా ఉత్పత్తులను దేశ విదేశీ వినియోగదారుల చెంతకు చేర్చడానికి లాజిస్టిక్స్‌ రంగాన్ని ప్రోత్సహించడం తక్షణావసరమని కేబినెట్‌ అభిప్రాయపడిరది.

వ్యవసాయ రంగంలో సాధించిన అభివృద్ధి, తద్వారా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు ద్వారా సాధించే అదనపు వాణిజ్యానికి లాజిస్టిక్‌ రంగాభివృద్ధి ఎంతో అవసరం అని గుర్తించింది.

డ్రై పోర్టు ఏర్పాటు

రాష్ట్రంలో గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీలు, డ్రై పోర్టులు, ట్రక్‌ డాక్‌ పార్కింగ్‌ సహా తదితర లాజిస్టిక్స్‌ రంగాల్లో మౌలిక వసతులను మెరుగు పరచాలని కేబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్రంలో సుమారుగా 1400 ఎకరాల్లో భారీ స్థాయిలో డ్రై పోర్టును (మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కును) పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

రాష్ట్రంలో ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడానికి కస్టమ్స్‌ శాఖ అనుసంధానంతో, సనత్‌నగర్‌లో ప్రస్తుతమున్న కాంకర్‌ ఐసిడి తరహాలో కొత్తగా మరో రెండు ఇంటిగ్రేటెడ్‌ కంటైనర్‌ డిపో (ఐసీడీ)లను స్థాపించడానికి,  బాటసింగారంలో ఏర్పాటు చేసిన మాదిరి, రాష్ట్రవ్యాప్తంగా మరో 10 ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్‌ పార్కులను నెలకొల్పడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడం కోసం అంతర్జాతీయ స్థాయిలో టాస్క్‌ సహాయంతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ను స్థాపించాలని కేబినెట్‌ నిర్ణయించింది. అన్నిరకాల రంగాలకు చెందిన వస్తువుల నిల్వ సామర్థ్యం పెంచుకోవడానికి లాజిస్టిక్స్‌ పాలసీ చేయూతనిస్తుందని కేబినెట్‌ అభిప్రాయ పడిరది. తెలంగాణ లాజిస్టిక్స్‌ పాలసీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లాజిస్టిక్‌ పార్కులు ఏర్పాటు చేయాలని సంకల్పించింది.

మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కులు, వేర్‌ హౌజ్‌ లను ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పలు రకాల ప్రోత్సహకాలు అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లాజిస్టిక్స్‌ రంగాభివృద్ధి ద్వారా పత్యక్షంగా 1 లక్ష మందికి, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని, అందుకు గాను రాష్ట్రానికి దాదాపు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖకు కేబినెట్‌ సూచించింది.

వివిధ శాఖలలో ఖాళీల వివరాలు

కేబినెట్‌ సమావేశానికి హాజరైన అన్ని శాఖల కార్యదర్శులు, వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగుల వివరా లను ఖాళీల వివరాలను కేబినెట్‌ కు అందించారు. ప్రతి విభాగంలో మంజూరీ అయివున్న పోస్టుల సంఖ్యను, వివిధ కేటగిరీల్లో ఉన్న ఖాళీల వివరాలతో పాటు అందులో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వివరాలను కూడా కేబినెట్‌ ముందుంచారు.

కొత్త జోనల్‌ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను కేబినెట్‌ ఆదేశించింది.

సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని అందుకు సరికొత్త పోస్టుల అవసరం పడుతున్నదని కేబినెట్‌ అభిప్రాయపడిరది. అదే సందర్భంలో కాలం చెల్లిన కొన్ని పోస్టుల అవసరం లేకుండా పోతున్నదని, కాలానుగుణంగా ఉద్యోగ వ్యవస్థలో కూడా మార్పులు చోటు చేసుకోవాలని సూచిం చింది. తద్వారా ప్రజలకు మరింత చేరువగా పాలనను తీసుకెళ్లి వారికి ప్రభుత్వ సేవలందించే వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఏర్పాటు చేసుకోవాలని, ఆ దిశగా చర్యలకు పూనుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను, అధికారులను కేబినెట్‌ ఆదేశించింది.

రెండు రాష్ట్రాల నడుమ ఉద్యోగుల విభజన పూర్తయిందని, ఆంధ్రాలో మిగిలిన ఉద్యోగులను కూడా ఈ మధ్యనే తెలంగాణకు తెచ్చుకున్నామని కేబినెట్‌ తెలిపింది. ఇంకా కూడా మిగిలిపోయిన 200 నుంచి 300 తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రా నుంచి తీసుకు రాబోతున్నామన్నది. ఈ అన్ని సందర్భాలను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రా నుంచి వచ్చే ఉద్యోగులందరినీ కలుపుకుని ఇంకా మిగిలివున్న ఖాళీలను సత్వరమే గుర్తించి కేబినెట్‌ సబ్‌ కమిటీకి నివేదిక అందచేయాలని, మంత్రి మండలి అధికారులను ఆదేశించింది.

అన్ని ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆస్తులను క్రోడీకరించి జిల్లాల వారీగా, విభాగాల వారీగా సంకలనం చేయాలని కేబినెట్‌ ఆదేశించింది.