తెలంగాణ పండగల చిత్రాలకు అంతర్జాతీయ అవార్డులు

పల్లెటూరి ప్రజల జీవనశైలికి అద్దం పట్టే, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే పండుగలకు సంబంధించిన చిత్రాలు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలలో అవార్డులు గెలుచుకున్నాయి. ములుగుజిల్లా వెంకటాపుం మండలంలోని పాలంపేటకు చెందిన తడండ్ల శ్రవణ్‌ తీసిన ఈ ఫోటోలు అంతర్జాతీయ వేదికపై అవార్డులు గెలుచుకోవడం పట్ల పలువురు శ్రవణ్‌ను అభినందించారు.

గోల్డెన్‌ లయన్‌ ఫోటో సర్క్యూట్‌ 2021 మలేషియా వైపున ఆసియా ఫోటోగ్రాఫర్స్‌ యూనియన్‌ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబరులో ఆన్‌లైన్‌లో ఫోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో శ్రవణ్‌కు ట్రావెలింగ్‌ విభాగంలో 2, ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్‌ అమెరికా (పీఎస్‌ఏ)వారి నుంచి పల్లెటూరి ప్రజల జీవనశైలి, సంస్కృతి, సంప్రదాయాలు అంశాలలో రెండు గోల్డ్‌ మెడల్స్‌, మరో మూడు అవార్డులకు శ్రవణ్‌ ఎంపికయినట్లు నిర్వాహకులు ప్రకటించారు.