|

గానకళకు ప్రాణదీపం

ఆమె ఎంతటి మహాగాయనో మనం గాంధీజీ, నెహ్రూ, రాజాజీ, సరోజినీ నాయుడు తదితర ప్రముఖుల మాటల్లో విన్నాం. స్వయంగా కచేరీలో కన్నాం. ఇప్పటికీ నిత్యం వింటూనే ఉన్నాం. జన సామాన్యానికి చేరువైన ఒకే ఒక విదుషిగా ఎం.ఎస్.ను పేర్కొనవచ్చు. ఈ కర్ణాటక సంగీత లక్ష్మి పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలు మీద పాడి, ప్రపంచ సంగీతాభిమానుల మన్నల్ని పొందారు. సమకాలీన ప్రముఖ సంగీత విద్వాంసుల ప్రశంసల్నీ పొందారు. ఎం.ఎస్. అంటేనే మెలోడీ సబ్లైమ్. ఆమె పాడుతుంటే ఒక్కోసారి మృదంగం వాయించడం కూడా మానేసి, వింటూ వుండి పోయేవారట కె.వి.ప్రసాద్. సావిత్రి సినిమా షూటింగులో నారద పాత్రధారిగా ఎమ్మెస్ పాడుతుంటే సహనటులు నటించడం మానేసి వింటూ వుండిపోయేవారట.

చాలా మంది చాలా సందర్భాల్లో నన్నడిగే ప్రశ్న ఒక్కటే. ఎం.ఎస్. మిమ్మల్ని ఇంతగా ప్రభావితం చేయటానికి కారణం ఏమిటని? అందుకు నా సమాధానం ఒక్కటే. కారణం ఒకటి కాదు, రెండు కాదు. అవి ఏకంగా ఏడు కారణాలు. వాటిని ఏడు అంశాలు అనవచ్చు. ఏడు మూర్తులు అనవచ్చు. అవి వరుసగా ఆమె మహానటి, మహాగాయని, మహా సౌందర్యమూర్తి, మహాదాత, మహా దేశభక్తురాలులు, మహా దైవ భక్తురాలులు, మహా పతి భక్తురాలులు. ప్రపంచంలోనే ఇన్ని సుగుణాులు కలిగిన స్త్రీ మూర్తి ఇంతకుముందూ లేదు. ఇక ముందూ వుండబోదు. ఇది నిజం. ఇదే నిజం కూడా! ఐన్స్టీన్ గాంధీజీని ఉద్దేశించి చెప్పింది ఎమ్మెస్ సుబ్బుక్ష్మికి కూడా వర్తిస్తుంది.

గానకళకు ప్రణాధిపాంమహానటి: 1938-1947 మధ్య ఎం.ఎస్. సుబ్బులక్ష్మి నటించింది కేవలం నాలుగు సినిమాలే. అవి సేవాసదన్, శకుంతలై, సావిత్రి, మీరా. ఇవి తమిళంలో నిర్మించినవి. హిందీ వెర్షన్ మీరాతో కలిపితే అవి ఐదు. నష్టాలతో నడుస్తున్న కల్కి పత్రికను గట్టున పడేయటానికి మాత్రమే ఈ చిత్రాలో నటించింది. ఇందుకు సేవాసదన్ ఒక మినహాయింపు. అట్లా భర్త కష్టాలలో పాలు పంచుకుంది. ఒక పత్రికకు ఆయువును పెంచింది. పత్రికలే ప్రజాస్వామ్యానికి జీవగర్రలు అని కదా! అట్లా ప్రజాస్వామ్యానికీ జీవం పోసింది. భగవంతుడు తను వచ్చినపని అయిపోయినప్పుడు అవతారం చాలించినట్లు నటి అవతారానికి తను స్వస్తి చెప్పింది. ఆమె ఏ చిత్రంలోనూ నటించలేదు. జీవించింది. ఒక్క సావిత్రి సినిమాలో తప్ప అన్ని చిత్రాలోనూ కథానాయిక పాత్రలు మాత్రమే చేశారు. సావిత్రి సినిమాలో నారదుడిగా మగపాత్ర ధరించటం ఒక విశేషం. తెలుగున భావి అందాల హీరోయిన్గా కాంచనమాలను చెప్పుకున్నట్లే తమిళంలో తొలి అందా హీరోయిన్గా నిస్సందేహంగా సుబ్బులక్ష్మిని చెప్పుకోవచ్చు. 1938 సంవత్సరం ఈ ఇద్దరికీ కలిసివచ్చిన సంవత్సరంగా కూడా చెప్పుకోవచ్చును. వీడియో లేని ఆ రోజుల్లో పరోక్షంగా మనం ఎమ్మెస్ను చూసే అవకాశం లేదు. ఆ భాగ్యాన్ని సినిమాయే కలిగించింది.

మహా సౌందర్యమూర్తి:

ఆమె మహాసౌందర్యమూర్తి. భౌతికంగానే కాదు. ఆమె అంతరంగమూ మహా సౌందర్యాత్మకమే. ప్రపంచ సుందరీ మణులుగా కీర్తింపబడిన, కీర్తింపబడుతున్న, కీర్తింపబడే వారంతా ఎం.ఎస్. సౌందర్యం ముందు సూర్యుని ముందు దివిటీ వంటివాళ్ళు. లావణ్యానికి ఎం.ఎస్. ఒక ప్రతీక. ఒక నిలువెత్తు పతాక కూడా. మళ్ళీ సృష్టించలేనంతటి మహా సౌందర్యం ఎం.ఎస్.ది. చతుర్ముఖుడు కూడా మళ్ళీ సృష్టించలేనంతటి మహాసౌందర్యం ఎం.ఎస్ది. ఎమ్మెస్ సభికుల్ని మంత్రముగ్ధుల్ని చేసేది. ఒక గాన సరస్వతిగానూ, ఒక సౌందర్యక్ష్మిగానూ, ఒక నాదోపాసకురాలైన పార్వతిగానూ.

మహాదాత:

గానకళకు ప్రణాధిపాం2కచేరీ ద్వారా దేశంలోని పలు సేవా సంస్థలకు (243), ఉదాహరణకు శంకర నేత్రాలయ, కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు లక్షలాది రూపాయలను సమకూర్చడమే కాకుండా కలియుగ దైవం తిరుమలేశునికి తన రికార్డు, కేసెట్లు, సి.డి. అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలను సమకూర్చిన వితరణశీలి. ఇప్పటికీ రాయల్టీ రూపంలో టి.టి.డి. వారికి డబ్బు వస్తూవుంది. కల్కిగార్డెన్స్‌లోని సువిశాల నివాసం అమ్ముకున్న తర్వాత కూడా ఈ దాతృత్వగుణం ఆమెను వీడిపోకపోవడం ప్రపంచంలోనే చాలా అరుదుగా చూస్తాం. కొట్టూరుపురంలో చాలా సాధారణమైన భవంతిని నివాసంగా ఎంచుకోవడం ఆమె నిరాడంబరత్వాన్నే సూచిస్తుంది. ప్రభుత్వం భవనాన్ని ఇవ్వజూపినా సున్నితంగా తిరస్కరించారామె.

ఆమె ఎక్కువగా విద్యాభివృద్ధికోసం, బాధాసర్పదష్టుల కోసం తన గళాన్ని ఉపయోగించారు. 30.7.1944 నుంచి 3.3.87 వరకు 243 ప్రదేశాలలో ఆమె కచేరీలు చేయటం, వాటిలో 15 ఉమ్మడి రాష్ట్రంలో ఉండటం నిజంగా అది మన అదృష్టం. ఆ నేలలు చేసుకున్న పుణ్యం.

మహా దేశ భక్తురాలు:

ప్రపంచంలోనే ఇంతటి దేశభక్తి కలిగిన గాయని ఎందెందు వెదకి చూసినా మనకు కనబడదు. ఇప్పటికీ ఆమె పాడకపోతే దేశమే తానైన ఏ పల్లే లేవదుకదా! ఎం.ఎస్‌. పాడినన్ని దేశభక్తి గీతాలు ఏ ప్రముఖ గాయనీ పాడలేదు.

ఈ దేశభక్తే ఆమెను ఒక మహాదాతను చేసింది.

మహా దైవభక్తురాలు:

ఎం.ఎస్‌ను ఇట్లా సంబోధించటమే ఒక పునరుక్తి అవుతుంది. అందుకే ఆమెను పదమూడవ ఆళ్వారుగా కీర్తించారు ప్రముఖ పాత్రికేయులు, రచయిత ఎబికె ప్రసాద్‌. ఆమె అణువణువునా దైవచింతనమే. ఆమె పాడకపోతే దేవుళ్ళకు కూడా తెల్లవారదు. అంతగా ఆమె గానాన్ని ఇష్టపడతారు ముక్కోటి దేవతలు. ఆమె కవయిత్రి కాకపోవటం (వాగ్గేయ కారిణి) ఒక్కటి మినహాయిస్తే ఎం.ఎస్‌.ను దక్షిణపథంలో పుట్టిన అపర మీరాగా కీర్తించవచ్చు. మీరా భజన్లు కొద్దిమంది పాడినా అవి ఎం.ఎస్‌. సుబ్బుక్ష్మి గళంలో ఎంతమాత్రం సరితూగవు. రాజస్థాన్‌లో హిందీ మీరా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు మీరాయే వచ్చింది అని తండోపతండాలుగా రావటం ఆ రోజుల్లో మామూలు విషయం కాదు.

‘ఆమె కంఠంలో విన్నవాటిని ఇతర కంఠాలలో వినలేమనిపిస్తుంది. ఆమె వాటిని అమిత భలక్తిశ్రద్ధలతో పాడటం వల్ల అవి మరింతగా ప్రసిద్ధిచెందాయి’ అన్న పి.సుశీల నివాళిని ఈ సందర్భంగా గుర్తుచేసుకునే తీరాలి. అట్లాగే ఆమె ఓ కచ్చేరి హాలును సైతం ఓ పవిత్ర దేవాయంగా మార్చేయగలదు అన్న పండిట్‌ రవిశంకర్‌ మాటలలోని అంతరార్థం తొసుకోవాలి.

మహా పతిభక్తురాలు:

1997లో భర్త సదాశివం మరణించిందగ్గర్నుంచీ ఎం.ఎస్‌. తుదిశ్వాస వదిలేవరకూ ఏడేళ్ళూ ఏకాంత వాసంలో గడిపారు. ఈ ఏడేళ్ళలో ఒక్క కచేరీ కూడా చేయలేదు. భర్త చనిపోవటం, ఆ తర్వాత ఆమె కచేరీ చేయకపోవటం రెంటినీ వేరుచేసి చూడలేం. ఈ ఏడేళ్ళూ ఇంటికే పరిమితమవటం చూస్తే ఆమె ఏం కోల్పోయారో ఎవరికైనా ఇట్టే అవగతమౌతుంది. ఏకాత్మగా యాబది ఏడేళ్ళ ఓ ఇద్దరు జీవించిన ఒక గొప్ప చారిత్రక సందర్భమది.
సదాశివం స్వాతంత్య్ర సమరయోధుడు. పాత్రికేయుడు, కాంగ్రెస్‌ వాదికావడం కూడా ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మిలోని దేశభక్తిని ద్విగుణీకృతం చేసింది అనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు.

ఇంద్రధనుస్సు నుంచి ఏ ఒక్క వర్ణాన్నీ వేరుచేసి చూడలేం. ఒకవేళ చూస్తే అది ఇంధ్రధనుస్సు కాదు. అట్లాగే ఎం.ఎస్‌. సుబ్బుక్ష్మి గుణాల్లో ఏ ఒక్క గుణాన్ని వేరుచేసి చూసినా ఆమె పరిపూర్ణ ఎం.ఎస్‌. కాదు. అందుకే ఎం.ఎస్‌ సుబ్బుక్ష్మిని మనకాలoలో మన నేలమీద నడిచిన ఇంధ్రధనుస్సు అంటాను.

1966 అక్టోబరు 23న, అప్పటి యు.న్‌. సెక్రటరీ జనరల్‌చే ఆహ్వానింపబడి యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీలో యు.ఎన్‌.డే నాడు ఎం.ఎస్‌. సుబ్బుక్ష్మి బ్రహ్మాండమైన సంగీత కచేరి నిర్వహించారు. సి.వి. నరసింహన్‌ ప్రారంభోపన్యాసం చేశారు. ఎం.ఎస్‌. ‘రామా నన్ను బ్రోవరా’ త్యాగరాజు కృతినీ, ‘సారసాక్ష’ స్వాతి తిరునాళ్‌ కీర్తనను పాడారు. ఇవి వరుసగా హరికాంభోజీ, పంతువరాళి రాగాలు. ఈ సందర్భంలోనే శ్రీకంచి కామకోటి స్వామి వారు రచించిన ‘మైత్రీం భజత:’ అన్న సంస్కృత కీర్తనను ప్రార్థనా రూపంగా ఆపించారు. యు.ఎన్‌. జనరల్‌ అసెంబ్లీలో కచేరి జరిగిన తర్వాత సెక్రటరీ జనరల్‌ ఏడు వారా పాటు అమెరికాలోని పదిహేను కేంద్రాలో కచేరీలను ఎం.ఎస్‌. చేత నిర్వహింపజేశారు. విదేశీయులు ఎం.ఎస్‌. సాహిత్యం కంటే ఆమె మెలోడీకి మంత్రముగ్దుయ్యారు. వేనోళ్ళ ప్రశంసించారు.