మహిళ సత్యాగ్రహం.. అరెస్టు

hostoryముఖ్యమంత్రి పీఠం నుండి తనను దించివేస్తారేమోనని భయపడిన బ్రహ్మానందరెడ్డికి 1969 జూన్‌ 16న తెలంగాణ బంద్‌ ప్రశాంతంగా జరగడంతో ఊపిరి పీల్చుకుని మరునాడే ధైర్యంగా ఢిల్లీ చేరుకున్నారు. 16న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌పై తీవ్రమైన వ్యతిరేకత రావడం, ముఖ్యమంత్రిని మార్చనవసరం లేదని పలువురు ఎం.పి.లు, సీనియర్‌ నేతలు అభిప్రాయపడడం కూడా కాసుకు కొండంత బలాన్నిచ్చింది.

1969 జూన్‌ 19న తెలంగాణ సమస్యపై ఏదో ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశం తీసుకునే అవకాశం వున్నందున రెండు రోజుల ముందే పిసిసి అధ్యక్షుడైన కాకాని వెంకటరత్నంను వెంటబెట్టుకుని ఢిల్లీకి చేరుకున్నారు బ్రహ్మానందరెడ్డి.

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులైన నిజలింగప్పతో, ప్రధానికి సన్నిహితంగా వున్న మరో ముఖ్యనేత కామరాజ్‌తో బ్రహ్మానందరెడ్డి సమావేశమై రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడినట్లు, బంద్‌ సందర్భంగా శాంతి భద్రతకు ఎలాంటి ముప్పు వాట్లికుండా సమర్థవంతంగా అదుపు చేయగలిగినట్లు గొప్పు చెప్పుకున్నారు.

తెలంగాణ సమస్యపై కేంద్రనాయకుల సలహాలు తీసుకోవడానికై తాను ఢిల్లీ వచ్చినట్లు పత్రిక వారికి చెప్పుకున్న ముఖ్యమంత్రి, ఇందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితులో ఇవ్వకూడదని కేంద్రనాయకులకు తానే సలహా ఇచ్చారు.

ఒక ప్రక్కన బ్రహ్మానందరెడ్డి నిజలింగప్పతో సుదీర్ఘంగా చర్చిస్తున్న సమయంలోనే రాష్ట్రం నుండి తెంగాణ ఇవ్వవద్దని నిజలింగప్పను కోరుతూ వందలాది టెలిగగ్రాంలు  వచ్చినాయి. ఇతర కేంద్ర నాయకులకు కూడా అసంఖ్యాకంగా ఇలాంటి టెలిగ్రాంలే వచ్చాయి. ఈ టెలిగ్రాంలలో ‘‘రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే ప్రతిపాదన అనుచితమ’’ని, ‘‘పార్టీ నాయకత్వంలో మార్పు తెస్తే మొత్తం రాష్ట్రంలోనే కాంగ్రెస్‌పార్టీ నాశనమై పోగద’’ని హెచ్చరించారు. ఈ టెలిగ్రాంలు బ్రహ్మానందరెడ్డి సృష్టించినవే.

ఒక ప్రక్కన తెలంగాణ ఎన్‌.జి.ఓ.లు  వారం రోజుల నుండి నిరవధికంగా సమ్మె చేస్తుంటే తను సృష్టించిన పోటీ సంఘంతో ‘‘తెలంగాణ డిమాండ్‌ను తాము వదిలివేస్తున్న’’ట్లు ప్రకటన చేయించిన ముఖ్యమంత్రి ఢిల్లీలో ‘‘తెంగాణ ఎన్‌.జి.ఓ.లు తమ తెలంగాణ కోర్కెను ఇప్పుడు విడిచిపెట్టినార’’ని విలేఖరుల తో అన్నారు. ‘‘తెలంగాణలో ముల్కీకు కేటాయించిన 2వేల ఉద్యోగాలలో వెయ్యి ఉద్యోగాలు ముల్కీకే ఇచ్చినట్లు’’ చెప్పినారు. తెలంగాణకు తానేమి అన్యాయం చేయడంలేదనే అభిప్రాయాన్ని ఢిల్లీ మీడియాకు కలిగించే ప్రయత్నం చేసినారు బ్రహ్మానందరెడ్డి. ‘‘పరిస్థితి చక్కబడిన తర్వాత తెలంగాణ నాయకునికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి రాజకీయ సర్దుబాట్లు చేస్తామని’’ తెలిపినారు. అంటే ఢిల్లీ వర్గాల్లో ‘‘కొంతమంది పదవుల కోసమే తెంగాణ ఉద్యమాన్ని లేవదీసార’’నే అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేశారు.

మరో ప్రక్కన ‘‘తెలంగాణ ప్రజలకు నిరాశ కల్గించడం ప్రమాదకరమని’’ కేంద్రాన్ని చెన్నారెడ్డి హెచ్చరించారు. 19న ఢిల్లీలో జరుగనున్న కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశం ఎజెండాలో తెలంగాణ అంశం వున్న దృష్ట్యా ఆయన ఈ ప్రకటన చేశారు. లింగంపల్లిలోని సమితి కార్యాయంలో చెన్నారెడ్డి పత్రిక వారితో మాట్లాడుతూ ‘‘ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది. అటు పార్టీ, ఇటు ఆంధ్ర ప్రభుత్వం తమ స్వంత లోకంలోనే జీవిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

డా॥ చెన్నారెడ్డి ఇచ్చిన పిలుపునందుకొని 1969 జూన్‌ 17వ తేదీన తెలంగాణ జిల్లాల్లో, జంటనగరాల్లో పెద్ద ఎత్తున మహిళలు, నాయకుల కుటుంబ సభ్యులు సత్యాగ్రహాలు చేశారు.

హైదరాబాద్‌ మేయర్‌ కుముద్‌ నాయక్‌ మొదటి సత్యాగ్రహ జట్టుకు నాయకత్వం వహించి ఆబిడ్స్‌లోని నెహ్రూ విగ్రహం వద్దకు వస్తుంటే నిషేధాజ్ఞు ధిక్కరించారనే నెపంతో ఆమెను, సహచర మహిళను అరెస్టు చేశారు పోలీసులు. హైదరాబాద్‌ ప్రథమ పౌయి, ఒక మేయర్‌ సత్యాగ్రహం చేయడం, అరెస్టు కావడం దేశ చరిత్రలో ప్రథమం. ఫ్లకార్డు పట్టుకొని ‘జై తెలంగాణ’ అని నినదిస్తూ ఆమె వీధుల్లో నడిచింది. మేయర్‌ అరెస్టుకు నిరసనగా అప్పటికప్పుడు రెండు వేల మంది కార్పొరేషన్‌ సిబ్బంది, కార్మికులు సమ్మెకు దిగినారు. ఉద్యమనేత డా॥ చెన్నారెడ్డి సతీమణి సావిత్రీదేవి ఆధ్వర్యంలో రెండోజట్టు సుల్తాన్‌ బజార్‌లో సత్యాగ్రహం చేసింది. మాజీ ఉపముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి మూడో కూతురు స్నేహలతా రెడ్డి మూడో జట్టుకు నాయకత్వం వహించారు. నాల్గో కూతురు సాధన, మనుమరాళ్ళు అనురాధ, అరుణ, కోడులు విమల, పెద్దకూతురు సుమిత్రారెడ్డి తదితయి ఈ సత్యాగ్రహ జట్టులో ఉన్నారు. చెన్నారెడ్డి సతీమణితో సహా ఈ మహిళందరినీ పోలీసు అరెస్టు చేసినారు.
సచివాయం వద్ద రిపబ్లికన్‌ పార్టీ కార్యదర్శి, ఎం.ఎల్‌.ఏ ఈశ్వరీ బాయి మరో 25 మంది మహిళలు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. పోలీసు వాహనాలు రావడంలో జాప్యం జరగడం వన వీరంతా రోడ్డుపై కూర్చోవడంతో ట్రాఫిక్‌ కు అంతరాయం ఏర్పడింది. మోజంజాహి మార్కెట్‌ వద్ద మాజీమంత్రి సదాక్ష్మి, మాజీ ఎం.ఎల్‌.ఏ, శాంతాబాయి మరికొందరు సత్యాగ్రహం చేశారు.

తెలంగాణ ప్రజాసమితి మహిళా విభాగానికి చెందిన లక్ష్మీరెడ్డి చార్మినార్‌ క్రాస్‌ రోడ్‌ వద్ద సత్యాగ్రహం జట్టుకు నాయకత్వం వహించారు. సికింద్రాబాద్‌, బొల్లారం, కంటోన్మెంట్‌ తదితర ప్రదేశాల్లో, జిల్లా కేంద్రాల్లో, పట్టణాలో సత్యాగ్రహంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అరెస్టయినారు.

వ్యానుల్లో మహిళలను పోలీసులు తీసికెళ్తుంటే ఇంత మంది మహిళలు సత్యాగ్రహంలో పాల్గొనడం పట్ల డా॥ చెన్నారెడ్డి, కొండాక్ష్మణ్‌ తదితర నేతలు హర్షధ్వానాలు చేశారు.

జూన్‌ 17ను ‘తెలంగాణ మహిళా దినం’ గా ప్రజాసమితి పరిగణించి వివిధ ప్రాంతాల్లో సత్యాగ్రహాలు చేయడానికి వివిధజట్లను ఎంపిక చేసింది.

బంద్‌లు, సత్యాగ్రహాలు శాంతియుతంగా జరిగి జయప్రదం కావడంతో చెన్నారెడ్డి జూన్‌ 19నుంచి తెంగాణ ఉద్యమం తాలుకా స్థాయికి విస్తరించాలని సంకల్పించారు. సమష్టి సత్యాగ్రహాకు పిలుపు నిచ్చారు. ఉద్యమంలో ఇదొక ‘మలుపు’గా చెన్నారెడ్డి అభివర్ణించారు. తెలంగాణ నేతలు వెంకటస్వామి, అంజయ్యు ఢిల్లీలో నిజలింగప్ప, కామరాజ్‌, జగ్జీవన్‌రాంను కలిసి తెంగాణ పరిస్థితిని వివరించారు. గత 6 నెలుగా తెలంగాణలో పోలీసురాజ్యం నెలకొన్నదని, శాంతిభద్రతలు సన్నగిల్లుతున్నాయని, బ్రహ్మానందరెడ్డిని గద్దె దింపాని, రాష్ట్రపతి పాలనను విధించాని ఈ నేతలు కోరినారు.

మార్క్సిస్టు వ్యతిరేకత:

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ కలకత్తాలో జరిగిన మార్క్సిస్టు పార్టీ పోలిట్‌బ్యూరో ప్రకటన చేసింది. ‘‘వేర్పాటు వాదులు ప్రారంభించిన ద్వేషించే ఉద్యమాన్ని అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోవాల’’ని ప్రభుత్వాన్ని కోరింది. ‘‘1947-48 నాటి రజాకార్ల దుష్కృత్యాలను పోలిన విధంగా డా॥ చెన్నారెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు దోపిడీలు, హింసాకాండ, దౌర్జన్యాలు సాగిస్తున్నార’’ని ఈ ప్రకటనలో తెలిపారు.
‘‘రక్తం చిందించి సాధించిన విశాలాంధ్రను పరిరక్షించుకోవాల’’ని ప్రజలకు మార్క్సిస్టు పిలుపునిచ్చారు. మరో కమ్యూనిస్టు పార్టీ అయిన సి.పి.ఐ. రాష్ట్ర శాఖ మాత్రం బ్రహ్మానందరెడ్డిని గద్దె దింపాని, వెంటనే రాష్ట్రపతి పాలనను ఏర్పాటు చేయాలనే తెలంగాణవాదులతో గొంతు కలిపి ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రలోనూ ధర్నాలు, నిరాహారదీక్షలు సాగిస్తూ తమపై పడిన ‘‘తెలంగాణ ద్రోహల’’నే అపవాదును ఎంతో కొంత తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జూన్‌ 18 నుంచి పికెటింగ్‌ ఉద్యమం జరపాలని సిపిఐ పిలుపు నిచ్చింది. ఈ పికెటింగ్‌ ఉద్యమానికి చండ్ర రాజేశ్వరరావు, ఆరుట్ల కమలాదేవి నాయకత్వం వహించారు.

ఢిల్లీలో ఉన్నతస్థాయి చర్చలు

ఢిల్లీలోనే మకాం పెట్టిన ముఖ్యమంత్రి జూన్‌ 18న ప్రధాని, దేశీయాంగమంత్రి, లోకసభ స్పీకర్‌గా వున్న నీలం  సంజీవరెడ్డితో తెలంగాణ సమస్యపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ పరిస్థితిలోనూ ఏర్పాటు చేయవద్దని, కావాంటే సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణ ప్రయోజనాకు తగిన రక్షణ వుండగదని తెలంగాణ ప్రజలకు హామీనిచ్చే పథకం గురించి ఆలోచిస్తే మంచిదని పెద్దలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు బ్రహ్మానంద రెడ్డి. ‘‘తనను ఎందుకు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోవలసిందిగా కోరరాద’’నే విషయంలో బ్రహ్మానంద రెడ్డి అదనపు కారణాలను కూడా ప్రధానికి వివరించారు.

రాష్ట్రంలోని శాసనసభ్యులలో మెజారిటీ సభ్యుల మద్దతు చూరగొన్న నాయకున్ని రాజీనామా యివ్వమనడం ప్రజాస్వామ్య విరుద్ధమని బ్రహ్మానంద రెడ్డి అన్నారు. కేంద్రం పూర్తి స్వేచ్ఛను యిచ్చిన పక్షంలో సత్వరం సాధారణ పరిస్థితి పునరుద్ధరణకి తనకు ఎట్టి చిక్కులుండవని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే వుంటూ అహింసాయుత ఆందోళన లేక రాజ్యాంగ బద్ధమైన పరిష్కార మార్గాలపట్ల ఎట్టి గౌరవం లేనివారి అరెస్టు పట్ల వున్న భయసందేహాలు తనకు అవరోధంగా వున్నట్లు బ్రహ్మానందరెడ్డి కేంద్ర నాయకులకు వివరించారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి సమావేశం

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశానికి హాజరై తెలంగాణపై చర్చించాలని చెన్నారెడ్డిని, కొండా లక్ష్మణ్‌ను మరికొందరు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిజలింగప్ప ఆహ్వానించారు. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గం వైఖరి దృష్ట్యా చర్చలు నిరుపయోగమని చెన్నారెడ్డి, కొండాక్ష్మణ్‌ బాపూజీలు నిజలింగప్ప ఆహ్వానాన్ని తిరస్కరించారు.

జూన్‌ 19న సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ 2 గంటలపాటు తెలంగాణ సమస్యపై చర్చించింది. కేవలం దామోదరం సంజీవయ్య తప్ప ఏ ఒక్క నేత కూడా బ్రహ్మానందరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ‘‘ప్రత్యేక తెంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశానికే హానికరమ’’ని దాదాపు నేతంతా అభిప్రాయపడగా, ‘‘బ్రహ్మానందరెడ్డి పరిస్థితిని అదుపు చేయడంలో విఫమైనందున రాష్ట్రపతి పాలనతప్ప మరో ప్రత్యామ్నాయం తనకు కనిపించడం లేద’’ని సంజీవయ్య అన్నారు. మరునాడు జరిగే సమావేశానికి చొక్కారావును, నూక రామచంద్రారెడ్డిని ఆహ్వానించారు.

(సశేషం)
(వచ్చే సంచికలో
చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌లు  అరెస్టు `
రాజమండ్రి జైలుకు తరలింపు)