హృదయాల విజేత మహా ప్రవక్త (స)
దైవ ప్రవక్త ముహమ్మద్(స) ప్రముఖ ఖురైష్ వంశానికి చెందినవారు. కాబా గృహం అర్చకులు ఆయన (స) వంశంవారే. ఆయన (స) తండ్రి పేరు అబ్దుల్లా. తాతపేరు అబ్దుల్ ముత్తలిబ్. ఆయన (స) మక్కా నగరంలో 22 ఏప్రిల్ క్రీ.శ. 571న అనాథగా జన్మించారు. ఆరు సంవత్సరాల తరువాత తల్లి బీబీ ఆమీన పరమపదించారు. ఎనిమిదవ ఏట వరకు తాత పోషించారు. పిన్న వయస్సులోనే బాబాయితో వ్యాపారం నిమిత్తం సిరియా వెళ్ళారు. యువకుడయిన ఆయన (స) తెగల మధ్య దౌర్జన్యానికి బదులు న్యాయవంతమయిన ‘హిల్‌ఫుల్ జూల్’ అనే ఒప్పందంలో పాల్గొన్నారు.

స్త్రీ జనోద్ధరణకు శ్రీకారం
మక్కా నగరానికి చెందిన ధనవంతురాలు, వ్యాపార వేత్త అయిన స్త్రీ హజ్రత్ బీబీ ఖదీజా, సరుకును వ్యాపార నిమిత్తం తీసుకుని బిడారులతో కలసి సిరియా వెళ్ళి వ్యాపారం నుండి విజయవంతంగా తిరిగి వచ్చారు. ఆయన (స) తన 25వ ఏట వయసులో పదిహేనేళ్లు పెద్ద వయసైన, రెండో సారి వితంతువు అయిన హజ్రత్ ఖదీజా(ర)ను వివాహమాడి స్త్రీ జనోద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఆమెతో అత్యంత సంతోషకరమైన జీవితాన్ని గడిపారు.
ఓపికలో అందెవేసిన చేయి
సర్వసాధారణ పరిస్థితుల్లో ఎదుటివారి దాష్టీకాలను మౌనంగా సహించడం, వారేం చెప్పినా ఓర్చుకుని నిశ్శబ్దంగా మౌనంగా సహించడం, వారేం చెప్పినా ఓర్చుకుని నిశ్శబ్దంగా ఉండటం కష్టమైన పనే. ఇలాంటి పరిస్థితుల్లో మనోనిగ్రహంతో వ్యవహరించే వ్యక్తి నైతికంగా ఉన్నత స్థితికి చేరుకుంటాడు. మహా ప్రవక్త (స) ఒక యూదు పండితుని నుంచి కొంత పైకం (డబ్బు) అప్పుగా తీసుకున్నారు. అప్పు తీర్చమని ఆ వ్యక్తి చాలా గట్టిగా నిలదీసి అడిగాడు. ‘ఇప్పుడు బాకీ తీర్చడానికి నా దగ్గర ఏమీ లేద’ని ఆయన (స) అన్నారు.
దానికతను ససేమిరా అన్నాడు. నా బాకీ తీర్చే దాకా నిన్ను వదిలేది లేదు అంటూ తీవ్రంగా హెచ్చరించాడు. యూదు పండితుడు. ‘సరే, అలాయితే ఇక్కడే కూర్కొండి పోతాన’న్నారాయన (స). అన్నట్లే కూర్చుండిపోయారు.
జొహర్, అసర్, మగ్రిట్, ఇఫా నమాజులు, మరుసటి రోజు ఫజర్ నమాజ్ కూడా అక్కడే చేసుకున్నారు. మదీనాలో ఇస్లామీయ ప్రభుత్వం నెలకొన్నప్పటి సంఘటన ఇది. ఆయన (స) గనక తలచుకుంటే ఆ వ్యక్తికి వ్యతిరేకంగా చర్య తీసుకోగలరు. పొద్దెక్కెసరికి ఆ యూదుడు కరిగి పోయాడు. ఆయన్ని దైవ ప్రవక్తగా విశ్వసించాడు. తౌరాతు గ్రంథంలో ప్రస్తావించబడిన ‘ఆ ప్రవక్త’లోని ఉత్తమ గుణాలు మీలో ఉన్నాయో లేదో చూడటానికే నేనిలా ప్రవర్తించాను.
ఇప్పుడు నేను సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్య దైవం లేడని, తమరు అల్లాహ్ యొక్క ప్రవక్త అని అంగీకరిస్తున్నాను అన్నాడు. ఇదిగో నా సొమ్ము దీనిని తమరు కోరిన విధంగా, కోరిన పద్దులో ఖర్చు పెట్టుకోవచ్చు అన్నాడు.
సత్య సంధుడు
హజ్రత్ ముహమ్మద్ (స) పూర్తిగా సత్యవంతులు. ఆయన జీవితంలో ఎన్నడూ అబద్ధమాడి ఎరుగరు. అందుకనే ఆయన దైవ ప్రవక్తగా నియమింపబడక పూర్వమే ఆయనను ప్రజలు ‘సాధిఖ్`అమీన్’ అనే బిరుదులతో సత్కరించారు.
ఆయన (స) ప్రవక్తగా ప్రకటించుకోగానే ఆయన బద్ధ శత్రువులు సైతం ఆయనను అసత్యవాది అని చెప్పే ధైర్యం చేయలేకపోయారు. అబూజహల్ ఆయనకు బద్ధ శత్రువు ‘ఓ ముహమ్మద్ మేము మిమ్మల్ని సత్యవాది అనడంలో ఎటువంటి సందేహం లేదు అని అన్నాడు.
మంచి మిత్రునిగా
దైవ ప్రవక్త (స) తన సహచర మిత్రులను చాలా ప్రేమించేవారు. ఎల్లప్పుడూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండేవారు.
మృదు స్వభావం ` దయార్ద్ర హృదయం
దైవ ప్రవక్త (స) ఒక విశాలమైన దృక్పథం, దయగల హృదయం గలవారు. ఆయన గనక కఠిన హృదయుడయితే తన ఉద్యమంలో ఎన్నడూ విజయం సాధించేవారు కాదు. దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా తెలిపారు.
‘(ఓ ప్రవక్తా), అల్లాహ్ యొక్క అనంత కరుణ వల్లనే నీవు వారి పట్ల మృదు స్వభావుడవు అయ్యావు. నీవే గనక కర్కశుడవు, కఠిన హృదయుడవు అయినట్లయితే వారందరూ నీ చుట్టు పక్కల నుండి దూరంగా పోయేవారు.’
(దివ్య ఖుర్ ఆన్ ` ఆలి ఇమ్రాన్ 3:159)
ధన త్యాగం : మహా ప్రవక్త (స) దైవ ప్రవక్తగా ఎన్నుకోబడకముందు అంతర్జాతీయ వాణిజ్యం చేసేవారు ఆయన సతీమణి ఒక సంపన్నురాలు. ఆమె స్వయంగా పెద్ద వ్యాపారి కాని ఆయన (స) దైవ ప్రవక్తగా ఎన్నుకోబడిన తరువాత ఆమె తన సంపాదనంతా ఇస్లాం ప్రచారం కోసం ఖర్చు చేశారు. చివరికి ఆయనకు తాయెఫ్ నగరానికి కాలినడక వెళ్ళవలసి వచ్చింది. ఏ వాహనమూ లేకుండా పోయింది. మదీనాకు వలసపోయే సమయంలో ఖర్చులన్నీ హజ్రత్ అబూబక్ర్ (రజి) భరించారు. ఆయన (స) వద్దకు సంపద వచ్చినప్పుడు ఖర్చుల వరకే తీసుకుని మిగతాది పేదలకు దానం చేసేవారు.