ఈ కథల నీడలో…

రచయిత కూర చిదంబరం రచనలు మానవీయ విలువల మూటలు. వృత్తి రీత్యా చార్టెడ్‌ అకౌంటెంట్‌ అయినప్పటికీ ఆయన రచనల్లో మానసిక విశ్లేషణ మూలాలు కనిపిస్తాయి. ఇరవై ఆరు కథలతో తీర్చిదిద్దిన ఈ కథా సంపుటి, రచయితకు మూడవ సంపుటిగా అర్థమవుతుంది. ఈ పుస్తకంలో వున్న అన్ని కథలు  కూడా మనస్సుకు ప్రాధాన్యమిచ్చి వ్రాసిన కథలే.

ఈ కథలన్నీ క్లుప్తంగా తీర్చిదిద్దినవే. ఇరవై ఆరు కథలలో ఒక కథగా వున్న  ‘నీటి నీడ’ కథ పేరునే ఈ కథా సంకలనం పేరుగా ఎంచుకున్నారు రచయిత. ఈ కథలలో కొన్ని కథల పోటీలలో బహుమతులు గెలుచుకున్నవి వున్నాయి. అలాగే ఆయా కథలు వివిధ పత్రికలలో ప్రచురితమైనపుడు, వాటిని చదివిన పాఠకులు వెలిబుచ్చిన అభిప్రాయాలు కూడా పొందుపరచడం జరిగింది.

రచయిత కథా రచన శైలి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే రచనలు అన్నీ కూడా మనసును కేంద్రీకృతం చేసుకునే కొనసాగుతాయి. ఈ పుస్తకం లోని కథలను చదివిన వారికి అవి ఒక కౌన్సిలింగ్‌ లాగా పనిచేస్తాయి. ఒకసారి చదివిన వారికి మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తాయి,చదివిస్తాయి కూడా.

పుస్తకం పేరు:నీటి నీడ
రచయిత :కూర చిదంబరం
పేజీలు:194
వెల : రూ. 150/-

ప్రతులకు: సౌమిత్రి ప్రచురణలు
6-1-118/19,
పద్మారావు నగర్‌,
సికింద్రాబాద్-500025.

నవోదయ బుక్‌ హౌస్‌
కాచిగూడ శ రోడ్‌, హైదరాబాద్‌ -027.

నవచేతన బుక్‌ హౌస్‌<
బ్యాంక్‌ స్ట్రీట్‌, హైదరాబాద్‌ -001.