ప్రజా ఆకాంక్షల మేరకు మరిన్ని మండలాలు

పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు దార్శనికతతో ఇప్పటికే నూతన జిల్లాలను, రెవిన్యూ డివిజన్లను, మండలాలను  ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆయా జిల్లాల్లోని రెవిన్యూ డివిజన్ల పరిధుల్లో  ఏర్పాటయిన నూతన మండలాలు:

 • నారాయణ పేట జిల్లా/ రెవిన్యూ డివిజన్‌ పరిధిలో గుండుమల్‌ (Gundumal), కొత్తపల్లె (Kothapalle) మండలాలు
 • వికారాబాద్‌ జిల్లాలోని, తాండూర్‌ రెవిన్యూ డివిజన్‌ పరిధిలో దుడ్యాల్‌ (Dudyal) మండలం
 • మహబూబ్‌ నగర్‌ జిల్లా/ రెవిన్యూ డివిజన్‌ పరిధిలో కౌకుంట్ల (Koukuntla) మండలం
 • నిజామాబాద్‌ జిల్లా, ఆర్మూర్‌ రెవిన్యూ డివిజన్‌ పరిధిలో ఆలూర్‌ (Aloor), డొంకేశ్వర్‌ (Donkeshwar) మండలాలు
 • నిజామాబాద్‌ జిల్లా, బోధన్‌ రెవిన్యూ డివిజన్‌ పరిధిలో, సాలూర (Saloora) మండలం
 • మహబూబాబాద్‌ జిల్లా/ రెవిన్యూ డివిజన్‌ పరిధిలో సీరోల్‌ (Seerole) మండలం
 • నల్లగొండ జిల్లా/ రెవిన్యూ డివిజన్‌ పరిధిలో గట్టుప్పల్‌ (Gattuppal) మండలం
 • సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ ఖేడ్‌ రెవిన్యూ డివిజన్‌ పరిధిలో నిజాంపేట్‌ (Nizampet) మండలం
 • కామారెడ్డి జిల్లాలోని, బాన్స్‌ వాడ రెవిన్యూ డివిజన్‌ పరిధిలో డోంగ్లి (Dongli) మండలం
 • జగిత్యాల జిల్లా/ జగిత్యాల రెవిన్యూ డివిజన్‌ పరిధిలో ఎండపల్లి (Endapally) మండలం, జగిత్యాల జిల్లా కోరుట్ల డివిజన్‌ పరిధిలో భీమారం (Bheemaram) మండలం
 • మహబూబాబాద్‌ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఇనుగుర్తి గ్రామాన్ని కూడా మండల కేంద్రంగా చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, చీఫ్‌ సెక్రెటరి సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించారు