ఊహా సౌదామిని

tsmagazineతన మనసులోని భావాలను అందరికీ అర్ధమయ్యే సులభ శైలిలో అక్షరీకరించిన ఊహల సమాహారమే ‘ఊహా సౌదామిని’ అనే ఈ పుస్తకం. అలవోకగా వచ్చిన ఆలోచనలకు ఒక అక్షర రూపం ఇచ్చిన నేపథ్యంలో దైవమా, భావమా, జానపదమా అని మూడు విభాగాలుగా తీర్చిదిద్దిన ప్రయత్నం పాఠకులను ఆకట్టుకునే అంశం అని చెప్పవచ్చు.

తొలి విభాగాన్ని దైవ స్తోత్రాలుగా మలచి పదహారు కవితలతో ప్రస్తుతించిన తీరు ప్రశంసనీయమైనది. ఇక పండుగలు,సామాజిక,పర్యావరణ అంశాలతో ఏర్చి కూర్చిన మరో నలభై కవితలు కమనీయంగా అక్షరగీతికలయ్యాయి. మరోవైపు, జనపదాలతోనే తన కవితలనల్లినా అవి జానపదాల రుచిని జాగ్రత్తగా అందించిన తీరు అమోఘం.

పుస్తకం పేరు: ఊహా సౌదామిని
రచన:గుమ్మనగారి(వేలేటి)బాలసరస్వతి
ధర: అమూల్యం: పేజీలు:176
ప్రతులకు: వేలేటి హిమాంశుశర్మ
ఇ.నం. 4-194/1, మారుతినగర్‌,సిద్ధిపేట