‘ప్రగతి’ పరుగులు… మురిసిన పల్లెలు

By: బి. రాజమౌళి

దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  నేతృత్వంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో మూడు విడతలలో విజయవంతంగా నిర్వహించింది. ఇదే స్ఫూర్తితో పల్లె ప్రగతి నాలుగవ విడత కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్ర వ్యాప్తంగా జులై 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం పండుగలా జరిగింది. రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, మండల పరిషత్‌ అధ్యక్షులు, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక సభ్యులు, మండల పరిషత్‌ ప్రాదేశిక సభ్యులు, గ్రామ పంచాయితీ సర్పంచులు, వార్డు మెంబర్లు, రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా, డివిజన్‌, మండల, గ్రామస్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా సిరిగిరిపురం గ్రామంలో రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు జులై 1వ తేదిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం గ్రామ సభలో పాల్గొన్నారు. రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజుపేట పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామసభలో పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు సిద్ధిపేట జిల్లాలోని తిప్పారం, కుకునూర్‌ పల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో రాష్ట్ర మంత్రులు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామ సభలలో పాల్గొన్నారు.

నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం అమలును స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు రాష్ట్రంలోని 16 జిల్లాలలో పర్యటించి పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డులు, ఇతర కార్యక్రమాల అమలును స్వయంగా పరిశీలించారు.

జగిత్యాల జిల్లా హాబ్సిపూర్‌, నిజామాబాద్‌ జిల్లా వెల్పుర్‌ గ్రామాలలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి మరునాడు ఉదయం గ్రామాలలో అభివృద్ధి పనులు, పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డు, వైకుంంధామం, రైతు వేదికలను పరిశీలించారు.

రాష్ట్రంలో పల్లె ప్రగతి నాలుగవ విడత  కార్యక్రమంలో చేపట్టిన పనులు

– గ్రామీణ ప్రాంతాలలో 6 లక్షల 43 వేల రోడ్లను తుడిచి పరిశుభ్రంగాఉంచడం జరిగింది.

– 3లక్షల 52వేల 426 డ్రైనేజీలను పూడికతీసి మురుగునీరు,వాననీరు ప్రవహించడానికి ఆటంకం లేకుండా చేయడం జరిగింది.

– 1లక్ష 64వేల రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు అయిన ప్రభుత్వ విద్యాసంస్థలు,అంగన్‌ వాడీలు, ప్రభుత్వ ఆసుపత్రిలు శుభ్రం చేయడం జరిగింది.

– 51వేల 215 లోతట్టు ప్రాంతాలలో, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలలో వాననీరు,డ్రైనేజీ నీరు,నిల్వకు అవకాశం లేకుండా చర్యలు గైకొనబడ్డాయి.

– గ్రామలలో నిర్మించిన 10వేల 643 వైకుంఠ ధామాలకు 10వేల 542 డంపింగ్‌ యార్డులకు బయో పెన్సింగ్‌ చేయబడింది.

– 26వేల 104 విద్యుత్‌ స్తంభాలను తుప్పుపట్టిన, వంగిన విద్యుత్తు స్తంభాల స్థానంలో అమర్చడం, రిపేర్లు చేయడం జరిగింది.

–  కొత్తగా 32వేల 186 స్ట్రీట్‌ లైట్‌ స్తంభాలకు మూడవ వైర్లను అమర్చడం జరిగింది.

–  13 వేల 497 విద్యుత్‌ మీటర్లు కొత్తగా అమర్చ బడ్డాయి.

–  వినియోగంలో లేని 1046 బావులను పూడ్చి వేయడంతో పాటుగా పనిచేయకుండా ఉన్న 3909 బోరుబావులను మూసి వేయడం జరిగింది.

–  అసంపూర్తిగా ఉన్న 53 వైకుంఠధామాలు, 29 డంపింగ్‌ యార్డులు నిర్మాణం పూర్తి చెయ్యబడిరది.

నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్మాణంలో ఉన్న పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేయడానికి కొత్తగా ప్లాంటేషన్‌ చేపట్టడానికి ప్రతి  కుటుంబానికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేయడానికి ప్రతి మండలం లో బృహత్‌ పల్లె ప్రకృతి వనానికి భూమిని గుర్తించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడిరది. అందులో భాగంగా ఈ క్రింది కార్యక్రమాలను చేపట్టడం జరిగింది.

–  98 పల్లె ప్రకృతి వనాల నిర్మాణాన్ని కొత్తగా చేపట్టడం జరిగింది.

– మండలాలలో 533 బృహత్‌ పల్లె ప్రగతి వనాలకు కావాల్సిన స్థలాలను గుర్తించడం జరిగింది.

– ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున 46 లక్షల 9వేల 27 ఇండ్లలో నాటడానికి 3 కోట్ల 8 వేల  985 మొక్కలను పంపిణీ చేయబడ్డాయి.

– రాష్ట్రంలో 17 వేల 453 కిలోమీటర్ల పొడువునా రోడ్డు కిరువైపులా 70 లక్షల 23 వేల 182 అవెన్యూ ప్లాంటేషన్‌లు చేయడం జరిగింది.

– గతంలో నాటి చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా 72 లక్షల 36 వేల 696 మొక్కలను రాష్ట్రంలో వివిధ ప్రదేశాలలో నాటబడ్డాయి.

–  గృహాలలోనే కాకుండా ప్రభుత్వ, సామాజిక ప్రదేశాలలో 1కోటి 16 లక్షల 11వేల 914 మొక్కలను నాటడం జరిగింది.

పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల సాధించిన విజయాలు

ప్రణాళిక బద్ధంగా గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించే సంకల్పంతో చేపట్టి, అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం నాలుగవ విడత విజయవంతంగా జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమం అమలు వల్ల గ్రామలలో యేళ్ల తరబడి పెండిరగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యాయి.

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు,కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రజల భాగస్వామ్యంలో గ్రామాల అభివృద్ధికి చేపట్టవలసిన పనులకు గ్రామ స్థాయిలోనే ప్రణాళిక రూపొందించారు. గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి ఆయా పంచవర్ష ప్రణాళికలను రూపొందించారు.

దేశంలోనే మొదటిసారిగా 12,769 గ్రామలలో ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రతి గ్రామంలో వర్క్‌ కమిటీ, శానిటేషన్‌ కమిటీ, స్ట్రీట్‌ లైట్‌ కమిటీ, గ్రీన్‌ కవర్‌ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజా సంఘాల కమిటీలో 8 లక్షల 20 వేల 729 మంది సభ్యులను ఎన్నుకున్నారు. వీటిలో 4,03,758 మంది మహిళలు ఉన్నారు.

గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీల సరఫరా

రాష్ట్రంలోనున్న మొత్తం 12,769 గ్రామ పంచాయతీ లకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. అన్ని గ్రామాల్లో ఉదయం తడి, పొడి చెత్త సేకరించి డంపింగ్‌ యార్డులకు తరలించడానికి ట్రాక్టర్లు, ట్రాలీలను వినియోగిస్తున్నారు. అదేవిధంగా ట్రాక్టర్లు, ట్యాంకర్ల సహకారంతో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు  నీటి సరఫరా కల్పించబడుతుంది. డంపింగ్‌ యార్డులకు తరలించబడిన తడి, పొడి చెత్తను రైతుల పొలాల్లో సేంద్రీయ ఎరువుల తయారీకి వినియోగిస్తున్నారు.

పల్లె ప్రకృతి వనాలు

రాష్ట్రంలో 116 కోట్ల రూపాయల వ్యయంతో 19,472 పల్లె ప్రకృతి వనాల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో 19,413 (99.69శాతం) పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. నిర్మాణంలో ఉన్న మిగతా 59 పల్లె ప్రకృతి వనాలను వెంటనే పూర్తి చేయడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

వైకుంఠధామాలు

12,769 గ్రామ పంచాయతీలలో 1596 కోట్ల రూపాయల వ్యయంతో 12,769 వైకుంఠధామాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 12432 (97.36 శాతం) వైకుంఠధామాల నిర్మాణం పూర్తయింది. నిర్మాణంలో ఉన్న మిగతా 337 వైకుంఠధామాల నిర్మాణాన్ని నెల రోజులలోగ పూర్తి చేయాలని  జులై 13వ తేదీన జరిగిన రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

డంపింగ్‌ యార్డులు

రాష్ట్రంలోనే 12,769 గ్రామ పంచాయతీలలో 319 కోట్ల రూపాయల వ్యయంతో డంపింగ్‌ యార్డులను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించబడిరది. ఇందులో ఇప్పటికే 12,711 డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తయింది. నిర్మాణంలో ఉన్న మిగతా 58 డంపింగ్‌ యార్డుల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది.

గ్రామ పంచాయతీ నిధుల విడుదల

గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి 308 కోట్ల రూపాయలు ప్రతి నెలా గ్రాంటును గ్రామాల్లో స్థానిక సంస్థలకు విడుదల చేయబడుతున్నది. అందులో భాగంగా రాష్ట్రంలోని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి 2019 సెప్టెంబర్‌ నుండి 2021 మే వరకు 6,500 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటును విడుదల చేసింది.

2021-22 గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా 18.49 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది.

బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు

రాష్ట్రంలోని అన్ని మండలాలలో ఒక బృహత్‌ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయబడుతున్నాయి. మండల కేంద్రంలో గాని లేదా అదే మండలంలోని మేజర్‌ గ్రామ పంచాయతీలలో దాదాపు 40 లక్షల వ్యయంతో 10 ఎకరాల విస్తీర్ణంలో బృహత్‌ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు అవుతుంది. ఈ బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో దాదాపు 31 వేల మొక్కలు నాటబడుతాయి. అందుకు నిమిత్తం 533 మండలాలలో భూమిని గుర్తించడం జరిగింది.

పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నెరవేరాలంటే రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధి కార్య క్రమాలలో భాగస్వాములు కావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.